‘ముకుంద’ ఫస్ట్ డే కలెక్షన్ ఎంత?
హైదరాబాద్: మెగాబ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ ‘ముకుంద' చిత్రం బుధవారం విడుదలైన సంగతి తెలిసిందే. హీరోకు తగిన పర్సనాలిటీతో వరుణ్ తేజ్ చూడటానికి స్మార్ట్‌గా ఉండటం, మెగా ఫ్యామిలీకి చెందిన వాడు కావడం, శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం కావడం, సినిమా ఓపెనింగ్ దగ్గర నుండి ఆడియో రిలీజ్, ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైల్ ఇలా అన్ని ప్లాన్డ్ గా చేయడంతో సినిమాకు బాగా ప్రచారం జరిగి అంచనాలు భాగా పెరిగాయి......వెరసి సినిమాకు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి.
తాజాగా ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం రెండు తెలుగు తొలి రోజు రూ. 3.36 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. అయితే తొలిరోజే సినిమాపై టాక్ చూస్తే మాత్రం...కాస్త ఆందోళన కరంగానే ఉంది. సినిమా ఆశించిన స్థాయిలో లేక పోవడం, కనీసం ఎంటర్టెనింగ్ కూడా పెద్దగా లేక పోవడంతో బిలో యావరేజ్ టాక్ వస్తోంది.
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం స్లో నరేషన్....స్క్రిప్టు పక్కాగా లేక పోవడం, ఎంటర్టెన్మెంట్ లోపించడం లాంటి కారణాలతో డీలా పడింది. అయితే వరుణ్ తేజ్ అప్పియరెన్స్, పెర్ఫార్మెన్స్, హీరోయిన్ అందంగా ఆకట్టుకునే విధంగా ఉండటం, సినిమాటోగ్రఫీ, సంగీతం ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.
ట్రేడ్ వర్గాల నుండి అందిన అంచనాల ప్రకారం ఏరియా వైజ్ కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం: రూ. 93 లక్షలు
సీడెడ్ : రూ. 53 లక్షలు
నెల్లూరు : 9 లక్షలు
క్రిష్ణ: 23 లక్షలు
గుంటూరు: రూ. 43 లక్షలు
వైజాగ్: రూ. 27 లక్షలు
ఈస్ట్ గోదావరి : రూ. 46 లక్షలు
వెస్ట్ గోదావరి : రూ. 42 లక్షలు
మొత్తం: రూ. 3.3 కోట్లు


Click it and Unblock the Notifications











