For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Love Story 10Days Collections: ఆదివారం రికార్డు స్థాయి కలెక్షన్లు.. హిట్‌కు కొన్ని లక్షల దూరంలో!

  |

  తెలుగు సినీ ఇండస్ట్రీలో ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు విడుదల కాలేదు. గత సంవత్సరం సంక్రాంతి సీజన్‌లో లాభాల బాటలో కనిపించిన పరిశ్రమ.. కరోనా తర్వాత నుంచి నష్టాల మార్గంలో పయణిస్తోంది. రెండు సార్లు వచ్చిన లాక్‌డౌన్ల కారణంగా చాలా ఎదురుదెబ్బలు తగిలాయి. వాటి నుంచి కోలుకునేందుకు సరైన హిట్ రావాలని అంతా అనుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారీ స్థాయిలో విడుదలైన చిత్రమే 'లవ్ స్టోరి'. నాగ చైతన్య.. సాయి పల్లవి కాంబోలో వచ్చిన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకు అనుగుణంగానే కలెక్షన్లు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా 10 రోజుల బాక్సాఫీస్ రిపోర్టుపై ఓ లుక్కేద్దాం పదండి!

  ‘లవ్ స్టొరీ'తో వచ్చేసిన చైతన్య, పల్లవి

  ‘లవ్ స్టొరీ'తో వచ్చేసిన చైతన్య, పల్లవి

  నాగ చైతన్య హీరోగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన చిత్రం 'లవ్ స్టోరీ'. సాయి పల్లవి హీరోయిన్‌గా చేసిన ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, అమిగోస్ క్రియేషన్స్ సంస్థలపై కే నారాయణదాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు సంయుక్తంగా నిర్మించారు. పవన్ సీహెచ్ ఈ మూవీకి సంగీతం అందించాడు. సున్నితమైన ప్రేమకథతో రూపొందిన ఈ చిత్రం ఇటీవలే రిలీజైంది.

  హాట్ హాట్‌గా రెచ్చిపోయిన మంచు లక్ష్మి: తొలిసారి అందాలన్నీ కనిపించేలా ఘాటు ఫోజులు

  అంచనాలకు తగ్గట్టే భారీగా ప్రీ బిజినెస్

  అంచనాలకు తగ్గట్టే భారీగా ప్రీ బిజినెస్

  ఆది నుంచే 'లవ్ స్టోరి' మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీనికి దీని నుంచి విడుదలైన ప్రతి పాట, పోస్టర్, టీజర్, ట్రైలర్‌లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. దీంతో ఈ చిత్రానికి బిజినెస్ కూడా భారీగా జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఇది రూ. 31.20 కోట్లకు అమ్ముడుపోయింది. తద్వారా అంచనాలకు తగ్గట్టుగానే బిజినెస్ చేసుకుంది.

  10వ రోజు ఎక్కడ ఎంత వసూలు చేసింది?

  10వ రోజు ఎక్కడ ఎంత వసూలు చేసింది?

  'లవ్ స్టోరి' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 10 రోజు కలెక్షన్లు భారీగా పెరిగాయి. ఫలితంగా నైజాంలో రూ. 49 లక్షలు, సీడెడ్‌లో రూ. 21 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ. 12 లక్షలు, ఈస్ట్ గోదావరిలో రూ. 6 లక్షలు, వెస్ట్ గోదావరిలో రూ. 5 లక్షలు, గుంటూరులో రూ. 6 లక్షలు, కృష్ణాలో రూ. 6 లక్షలు, నెల్లూరులో రూ. 5 లక్షలు వచ్చాయి. దీంతో రూ. 1.10 కోట్లు షేర్, రూ. 1.82 కోట్లు గ్రాస్ వచ్చింది.

  షర్ట్ విప్పేసి షాకిచ్చిన బిగ్ బాస్ సరయు: బ్రాతో ఘాటు ఫోజులిస్తూ.. వామ్మో చూస్తే తట్టుకోలేరు

  10 రోజులకు కలిపి ఎంత కలెక్ట్ చేసిందంటే

  10 రోజులకు కలిపి ఎంత కలెక్ట్ చేసిందంటే

  'లవ్ స్టోరీ'కి పది రోజులకు ఏపీ, తెలంగాణలో మంచి కలెక్షన్లు వచ్చాయి. నైజాంలో రూ. 11.64 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.09 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.79 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.49 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ.1.25 కోట్లు, గుంటూరులో రూ. 1.44 కోట్లు, కృష్ణాలో రూ. 1.26 కోట్లు, నెల్లూరులో రూ. 82 లక్షలతో.. మొత్తం రూ. 24.78 కోట్లు షేర్, రూ. 40.30 కోట్లు గ్రాస్‌ వచ్చింది.

  ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్‌లో రాబట్టింది?

  ప్రపంచ వ్యాప్తంగా ఏ రేంజ్‌లో రాబట్టింది?

  తెలుగు రాష్ట్రాల్లో రూ. 24.78 కోట్లు కొల్లగొట్టిన 'లవ్ స్టోరీ' ప్రపంచ వ్యాప్తంగానూ సత్తా చాటింది. దీంతో కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4.72 కోట్లు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే పది రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 31.20 కోట్లు షేర్‌తో పాటు రూ. 55.30 కోట్లు గ్రాస్ వచ్చింది. ఫలితంగా ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి.

  అరాచకమైన డ్రెస్‌తో రెచ్చిపోయిన దిశా పటానీ: వామ్మో అందాలు మొత్తం కనిపించేంత దారుణంగా!

  బ్రేక్ ఈవెన్ టార్గెట్ అలా.. ఇంకెంత రావాలి?

  బ్రేక్ ఈవెన్ టార్గెట్ అలా.. ఇంకెంత రావాలి?

  భారీ అంచనాల నడుమ వచ్చిన 'లవ్ స్టోరీ' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 31.20 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 32 కోట్లుగా నమోదైంది. ఇక, పది రోజులకు కలిపి దీనికి రూ. 31.20 కోట్లు వచ్చాయి. అంటే మరో 80 లక్షలు వసూలు చేసే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది. ఈ రెండు రోజుల్లోనే అది జరిగే ఛాన్స్ ఉంది.

  English summary
  Naga Chaitanya and Sai Pallavi Did Love Story Movie Under Sekhar Kammula Direction. This Movie Collect 31.20 Cr in Ten Days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X