Don't Miss!
- News
Sajjala : కోటంరెడ్డి టీడీపీలోకే ? తేల్చేసిన సజ్జల- ఫోన్ ట్యాపింగ్ పై కీలక వ్యాఖ్యలు !
- Lifestyle
ఎరుపు రంగు హ్యాండ్లూమ్ చీరలో నిర్మలా సీతారామన్, శక్తిని, ధైర్యానికి సంకేతంగా..
- Travel
బెజవాడకు చేరువలోని ఈ జైన దేవాలయం గురించి మీకు తెలుసా!
- Finance
Stock Market: మార్కెట్ల బడ్జెట్ దూకుడు.. నష్టపోయిన స్టాక్స్.. లాభపడిన స్టాక్స్ ఇవే..
- Technology
Samsung కొత్త ఫోన్లు లాంచ్ ఈ రోజే! లైవ్ ఈవెంట్ ఎలా చూడాలి,వివరాలు!
- Sports
వికెట్ తీసిన తర్వాత అతి చేష్టలు.. స్టార్ ఆల్‌రౌండర్‌పై అంపైర్ గుస్సా!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
18 Pages Official Collections: నిఖిల్ మూవీకి ఊహించని వసూళ్లు.. మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే!
విలక్షణమైన నటన, విభిన్నమైన చిత్రాలు చేస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్. కెరీర్ ఆరంభంలోనే పలు విజయాలను సొంతం చేసుకున్న అతడు.. ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా సినిమాల చేస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే ఈ ఏడాది '18 పేజెస్'తో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. ఇక, ఇప్పుడు అతడు '18 పేజెస్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీనికి మాత్రం ఆశించిన రీతిలో కలెక్షన్లు రాలేదు. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఫస్ట్ డే రిపోర్టుపై లుక్కేద్దాం పదండి!

18 పేజెస్ అంటూ వచ్చిన నిఖిల్
నిఖిల్ సిద్ధార్థ్ - పల్నాటి సూర్య ప్రతాప్ కాంబోలో రూపొందిన చిత్రమే '18 పేజెస్'. ఈ మూవీని జీఏ2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బన్నీ వాస్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. దీనికి గోపీ సుందర్ సంగీతాన్ని అందించాడు. ఇక, ఈ మూవీలో దినేష్ రాజ్, అజయ్, పోసాని, బ్రహ్మాజీ తదితరులు నటించారు.
కొత్త లవర్‌తో హీరోయిన్ అరాచకం: ప్యాంట్ తీసేసి మరీ.. మరీ ఇంత దారుణమా!

నిఖిల్ మూవీ బిజినెస్ డీటేల్స్
నిఖిల్ మార్కెట్‌కు తోడు '18 పేజెస్' మూవీపై నెలకొన్న అంచనాల ప్రకారం.. ఈ చిత్రం నైజాంలో రూ. 3.50 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.50 కోట్లు, ఆంధ్రాలో కలిపి రూ. 5 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో రూ. 10.00 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే, రెస్టాఫ్ ఇండియాలో రూ. 50 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 1.50 కోట్లతో కలిపి రూ. 12.00 కోట్ల బిజినెస్ చేసింది.

అలాంటి టాక్... వసూళ్లు ఇలా
ఎన్నో అంచనాల నడుమ రూపొందిన '18 పేజెస్' మూవీ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లోనూ మిక్స్‌డ్ టాక్ మాత్రమే వచ్చింది. అందుకు అనుగుణంగానే రివ్యూలు కూడా ఏవరేజ్‌గానే వచ్చాయి. దీంతో ఈ సినిమాకు అనుకున్న విధంగా ఓపెనింగ్ డేన కలెక్షన్లు వచ్చే అవకాశం ఉండదని విశ్లేషకులు అంచనా వేశారు.
హాట్ డ్రెస్‌లో రెచ్చిపోయిన లైగర్ పాప: ఆమెను ఇలా చూస్తే అస్సలు ఆగలేరు!

తొలి రోజు ఎక్కడ? ఎంతొచ్చింది
'18 పేజెస్' సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ డే అనుకున్న రేంజ్‌లో స్పందన మాత్రం రాలేదు. ఫలితంగా దీనికి కలెక్షన్లు కూడా చాలా అంటే చాలా తక్కువగానే వచ్చాయి. దీంతో నైజాంలో రూ. 1.05 కోట్లు గ్రాస్, సీడెడ్‌లో రూ. 25 లక్షలు గ్రాస్, ఆంధ్రా మొత్తంలో రూ. 1.05 కోట్లు గ్రాస్ వసూలైంది. ఇవన్నీ కలిపి రూ. 2.45 కోట్లు గ్రాస్, రూ. 1.20 కోట్లు షేర్ మాత్రమే వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లు ఇలా
నిఖిల్ నటించిన '18 పేజెస్' మూవీకి ఆంధ్రా, తెలంగాణలో మొదటి రోజు రూ. 2.45 కోట్లు గ్రాస్ మాత్రమే వచ్చింది. అలాగే, ఈ సినిమా కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 30 లక్షలు, ఓవర్సీస్‌లో రూ. 80 లక్షలు గ్రాస్ వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే మొదటి రోజు ఈ చిత్రానికి ఊహించని విధంగా రూ. 3.45 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 1.75 కోట్లు షేర్ వసూలైంది.
బెడ్రూంలో లవర్‌తో శృతి హాసన్ రచ్చ: నాకు అదే కావాలి అంటూ దొరికిపోయిందిగా!

హిట్ అవ్వాలంటే ఎంత రావాలి
టాలెంటెడ్ స్టార్ నిఖిల్ హీరోగా నటించిన '18 పేజెస్' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 12.00 కోట్లు మేర బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 12.50 కోట్లుగా నమోదైంది. ఇక, తొలి రోజు దీనికి రూ. 1.75 కోట్లు వచ్చాయి. అంటే మరో రూ. 10.75 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలుస్తుంది.

టికెట్ రేట్లు తగ్గించడం వల్లే
హీరో నిఖిల్ వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అలా వచ్చిన '18 పేజెస్' మూవీకి మాత్రం మొటి రోజే బిగ్ షాక్ తగిలింది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా కేవలం రూ. 1.75 కోట్లు షేర్ మాత్రమే దక్కింది. అదే.. కార్తికేయ 2కు మాత్రం రూ. 5.05 కోట్లు షేర్ వచ్చింది. అయితే, ఈ మూవీకి కలెక్షన్లు ఇలా రావడానికి టికెట్ రేట్లను తగ్గించడమే కారణం అనే టాక్ వినిపిస్తోంది.