For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిజమా....‘కార్తికేయ’ అంత కలెక్టు చేసిందా?

  By Srikanya
  |

  హైదరాబాద్ :నిఖిల్‌, స్వాతి జంటగా వెంకటశ్రీనివాస్‌ బొగ్గరం నిర్మించిన ‘కార్తికేయ' చిత్రం విడుదలై మూడవ వారంలోనూ మంచి వసూళ్లను రాబడుతూ చిన్న చిత్రాల్లో పెద్ద విజయాన్ని సాధించింది. ఈ చిత్రం ఇరవై కోట్ల గ్రాస్ వసూలు చేసిందని మీడియా సమావేశం ఏర్పాటు చేసి నిర్మాతలు తెలియచేసారు. ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకునిగా పరిచయమయ్యారు.

  నిఖిల్‌ మాట్లాడుతూ ‘‘చిన్న సినిమా అయినా ఓ పెద్ద సినిమా రేంజ్‌లో కలెక్షన్లు వస్తున్నాయి. నా కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌'' అన్నారు. నిర్మాత శ్రీనివాస్‌ మాట్లాడుతూ ‘‘సినిమా గొప్పగా ఉందని అందరూ అంటున్నారు. చెప్పింది చెప్పినట్లుగా సినిమా బాగా తీశాడు చందు'' అని చెప్పారు. వంద శాతం టీమ్‌ వర్క్‌తో ‘కార్తికేయ' బ్లాక్‌బస్టర్‌ హిట్టయ్యిందని దర్శకుడు చందు అన్నారు.

  ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసిన మల్కాపురం శివకుమార్‌ మాట్లాడుతూ ఇప్పటివరకూ రూ. 20 కోట్ల గ్రాస్‌ను వసూలు చేసిందని తెలిపారు. ఈ సమావేశంలో నటులు జోగినాయుడు, మీనాకుమారి, సత్య, చిత్ర సమర్పకుడు శిరువూరి రాజేశ్‌వర్మ, హైదరాబాద్‌లోని శ్రీరాములు థియేటర్‌ యజమాని ఫణి పాల్గొన్నారు.

  Nikil's Karthikeya collects 20cr. Gross?

  చిత్రం కథేమిటంటే...మెడికో కార్తీక్(నిఖిల్) ది ఏదైనా సందేహం వస్తే, దానికి సమాధానం అన్వేషించడానికి ఎంతదూరమైనా వెళ్లే మనస్తత్వం. అలాంటి కార్తీక్... మెడికల్ క్యాంప్ కోసం ... ఆంధ్ర, తమిళనాడు బోర్డర్‌లోని సుబ్రహ్మణ్యపురం అనే ఊరికి వెళ్లాల్సి వస్తుంది. ఆ ఊళ్లో మూతబడిన సుబ్రమణ్యేశ్వరస్వామి గుడి ఉంటుంది. ఆ గుడికో మిస్టీరియస్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది.

  ప్రతీ కార్తీక పౌర్ణమికి గుడి మొత్తం ప్రకాసిస్తూంటుంది. మూతబడిన ఆ గుడిని తెరవాలని ప్రయత్నించేవారంతా పాము కాటుతో మరణిస్తూంటారు. ఈ విషయం తెలుసుకున్న కార్తీక్ ఎలా స్పందించాడు. ఆ మిస్టరీ వెనక ఉన్న అసలు నిజం ఏంటనేది ఎలా తెలుసుకున్నాడు. ఆ ప్రాసెస్ లో ఏం జరిగిందనేది,కథలో వల్లి(స్వాతి) పాత్ర ఏమిటి... వంటి విషయాలు తెలియాలంటే చిత్రం చూడాల్సిందే.

  ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో తనికెళ్ల భరణి, రావు రమేష్, శ్రీనివాస్ రెడ్డి, తులసి, కిషోర్, జోగి నాయుడు, తాగుబోతు రమేష్, పృథ్వి, గౌతం రాజు, శివన్నారాయణ, స్వామి రారా సత్య, గిరి తదితరులు నటిస్తున్నారు. కెమెరా : కార్తిక్, సంగీతం : శేఖర్ చంద్ర, ఎడిటింగ్ : కార్తిక శ్రీనివాస్, ఆర్ట్ : సాహి సురేష్, పాటలు : కృష్ణ చైతన్య, కొరియోగ్రఫీ : రఘు, ఫైట్స్ : వెంకట్ నాగు, సమర్పణ : శిరువూరి రాజేష్ వర్మ, నిర్మాత : వెంకట శ్రీనివాస్ బొగ్గరం, కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం : చందు మొండేటి.

  English summary
  Nikhil said producer Shiva Kumar has announced that, this movie has collected 20 Crore rupees worldwide.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X