5years for A Aa: నితిన్ కెరీర్ బిగ్గెస్ట్ హిట్..అత్యదిక లాభాలు అందించిన త్రివిక్రమ్ మాయ..క్లోజింగ్ కలెక్షన్స్!
టాలీవుడ్ యువ హీరో నితిన్ కెరీర్ మొదలై దాదాపు 18 ఏళ్ళవుతోంది. ఎన్నో బాక్సాఫీస్ హిట్స్ అందుకున్నప్పటికి అంతకంటే ఎక్కువ స్థాయిలో డిజాస్టర్స్ కూడా అందుకున్నాడు. దాదాపు అగ్ర దర్శకులందరితోను వర్క్ చేశాడు. ఇక అతని కెరీర్ లో బిగెస్ట్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచిన అఆ సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చి నేటికి 5 ఏళ్లవుతోంది. ఆ సినిమా కలెక్షన్స్ పై ఒక లుక్కేస్తే..

నితిన్ కెరీర్ కు డిఫరెంట్ క్రేజ్..
నితిన్ మొదటి సినిమా జయం 2003లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తేజ డైరెక్ట్ చేసిన ఆ సినిమా కలెక్షన్స్ అందుకోవడంలో ఒక ట్రెండ్ సెట్ చేసింది. అనంతరం వెంటనే వివి.వినాయక్ దర్శకత్వంలో చేసిన దిల్ సినిమాతో కూడా బాక్సాఫీస్ హిట్ గా నికిచింది. అలా కొన్ని ప్లాప్స్ కూడా వచ్చాయి. అయితే 'అఆ' సినిమా మాత్రం నితిన్ కు ఒక డిఫరెంట్ క్రేజ్ ను అందించింది.

చాలా గ్యాప్ తరువాత
త్రివిక్రమ్ శ్రీనివాస్ అప్పటి వరకు స్టార్ హీరోలతోనే ఎక్కువ సినిమాలు చేసుకుంటూ వచ్చారు. చాలా కాలం తరువాత మొదటిసారి నితిన్ లాంటి మీడియం రేంజ్ హీరోతో వర్క్ చేయడం అందరిలోను ఆసక్తిని కలిగించింది. ఎలాంటి హడావుడి లేకుండా ఒక కవిత్వంలాగా కథను నడిపించిన విధానం బాగానే క్లిక్కయ్యింది.

నితిన్ సినిమా మొదటిసారి భారీ కలెక్షన్స్
అఆ సినిమా 2016 జూన్ 2న విడుదలయ్యింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా యూఎస్ లో నితిన్ సినిమా మొదటిసారి అత్యదిక వసూళ్లను అందుకుంది. సినిమా వరల్డ్ వైడ్ 27.71 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగగా పెట్టిన పెట్టుబడికి బయ్యర్లకు డబుల్ ప్రాఫిట్స్ వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన షేర్
తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా అన్ని ఏరియాలా వారిగా వచ్చిన షేర్ ఈ విదంగా ఉంది. నైజాం 13.19కోట్లు, సీడెడ్ 4.18 కోట్లు, ఉత్తరాంధ్ర 4.22 కోట్లు, ఈస్ట్ 2.39 కోట్లు, వెస్ట్ 1.98 కోట్లు, గుంటూరు 2.50 కోట్లు, కృష్ణా 2.20 కోట్లు, నెల్లూరు 0.98 కోట్లు, ఏపీ + తెలంగాణ (టోటల్) 31.64 కోట్లు,
Recommended Video

టోటల్ కలెక్షన్స్
రెస్ట్ ఆఫ్ ఇండియా 5.15 కోట్లు రాగా ఓవర్సీస్ లో 10.65 కోట్లు వచ్చాయి. ఇక వరల్డ్ వైడ్ గా వచ్చిన మొత్తం కలెక్షన్స్ 47.44 కోట్లు. ఒక నార్మల్ ఫ్యామిలీ కథతో కూడా బాక్సాఫీస్ హిట్ అందుకోవచ్చని త్రివిక్రమ్ అఆ సినిమాతో నిజం చేశాడు. నితిన్ కెరీర్ లో ఇప్పటివరకు కూడా అన్ని రకాలుగా అఆ సినిమా ది బెస్ట్ అని చెప్పవచ్చు.


Click it and Unblock the Notifications











