»   » త్రివిక్రమ్, నితిన్ ఈ రోజు రిలీజ్ 'అ..ఆ' టాక్ ఏంటి?

త్రివిక్రమ్, నితిన్ ఈ రోజు రిలీజ్ 'అ..ఆ' టాక్ ఏంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్, సమంత ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం 'అ..ఆ'. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి అనే ట్యాగ్ లైన్ తో రూపొందిన ఈచిత్రం ఈ రోజు (జూన్ 2న) ప్రపంచవ్యాప్తంగా భారి ఎత్తున విడుదల అయ్యింది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. ఆయా సెంటర్ల నుంచి అందుతున్న రిపోర్ట్ ఈ క్రింద విధంగా ఉంది.

త్రివిక్రమ్ తన తొలి రోజుల నాటి చిరు నవ్వుతో, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు తరహాలో ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ ని రూపొందించారు. అలాగే ఈ సినిమా పూర్తిగా నీట్ కామెడీతో సాగే క్లీన్ మూవి, త్రివిక్రమ్ ఫన్ డైలాగులుకు తోడు సెంటిమెంట్ ని బాగా అద్దారు. అయితే సినిమా కాస్త స్లో పేస్ లో నడుస్తుంది. సెకండాఫ్ లో ముఖ్యంగా ప్రెడిక్టబుల్ సీన్స్ తో సాగుతుంది. ప్రీ క్లైమాక్స్ చాలా డల్ గా అనిపించి నా, క్లైమాక్స్ కు వచ్చేసరికి ఎక్సలెంట్ అనిపిస్తుంది.

Nitin’s A Aa Movie talk

క్లైమాక్స్ లో మనం పాతం త్రివిక్రమ్ ని చూడవచ్చు. ఆయన రైటింగ్ స్కిల్స్ దర్శకుడుని డామినేట్ చేస్తాయి. హార్ట్ టచింగ్ తో, ఫీల్ గుడ్ తో సాగే క్లైమాక్స్ తో ఫ్యామిలీ ఆడియన్స్ మనస్సు గెలిచే ప్రయత్నం చేసారు. ఈ మద్యకాలంలో ఓ మామూలు ఆర్డనరీ ఫ్యామిలీ కథకు అంత అందమైన క్లైమాక్స్ కుదరలేదు. సినిమాలో నెగిటివ్ ఏమిటీ అంటే సినిమా సెకండాఫ్ లో స్లో అవటమే. ఫైనల్ గా త్రివిక్రమ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు.

త్రివిక్రమ్ దర్శకత్వం లో నితిన్ తొలిసారిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన సరసన సమంత హీరోయిన్ గా తొలిసారిగా నటిస్తున్నారు. మరో హీరోయిన్ గా ' అనుపమ పరమేశ్వరన్'(మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఫేం) నటిస్తున్నారు. చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో .. నదియ,అనన్య,ఈస్వరీరావు,సన, గిరిబాబు, నరేష్,రావురమేష్ ,పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాస రెడ్డి లు నటిస్తున్నారు.

English summary
A… Aa directed by Trivikram Srinivas has been released on the silver screen. It stars Nithin, Samantha, and Anupama Parameswaran in the lead roles. The film started with a wave of positive viewers reviews. They said that it is a good family entertainer.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu