పూరీ ‘హార్ట్ ఎటాక్’ జనవరిలోనే..
హైదరాబాద్: నితిన్ హీరోగా లావణ్య సమర్పణలో పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ పతాకంపై పూరి జగన్నాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'హార్ట్ ఎటాక్'. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ చిత్రం జనవరి 30 న కానీ 31 గానీ విడుదల చేసే అవకాసం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు దర్శక,నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకున్నారు. మొదట ఈ చిత్రాన్ని సంక్రాంతికి అనుకున్నారు కానీ ..ఇప్పుడు లేటు గా విడుదల అవుతోంది.

విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన హారర్ సినిమా '1920' ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను భయపెట్టిన ఆదాశర్మ ఈ సినిమా ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ చిత్రానికి అమోల్ రాథోడ్ ఫోటోగ్రఫీని అందిస్తుండగా, అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. పాటలు: భాస్కరభట్ల, కెమెరా: ఆమోల్ రాథోడ్, ఎడిటింగ్: ఎస్.ఆర్. శేఖర్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్-లక్ష్మణ్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పూరి జగన్నాథ్.


Click it and Unblock the Notifications











