twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'జనతాగ్యారేజ్' మలయాళి వెర్షన్ టీజర్, ఇందులో మార్పు ఏమిటీ అంటే

    By Srikanya
    |

    హైదరాబాద్ : మొదటి నుంచీ జనతాగ్యారేజ్ మేకర్స్...మళయాళి వెర్షన్ ని తెలుగు వెర్షన్ తో పాటే ప్యార్లల్ గా వర్క్ చేస్తూ వస్తున్నారు. ఎందుకంటే మోహన్ లాల్ ఉండటంతో అక్కడా ఈ చిత్రాన్ని భారీగా రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో ఇక్కడ తెలుగు టీజర్ విడుదల కాగానే అక్కడ మళయాళి టీజర్ కూడా ఇమ్మీడియట్ గా విడుదల చేసారు.

    అయితే అక్కడ మోహన్ లాల్ ని ప్రొజెక్టు చేస్తూ టీజర్ సాగింది. మళయాళి నటులు మోహన్ లాల్, దేవయాని, ఉన్ని ముకుందన్ ఈ చిత్రంలో కీరోల్స్ లో కనపడుతూండటంతో ఖచ్చితంగా మళయాళి మార్కెట్ లో ఈ సినిమా వండర్స్ క్రియేట్ చేస్తుందని భావిస్తున్నారు. అక్కడ ఓ స్ట్రైయిట్ సినిమాలాగానే ప్రమోట్ చేస్తున్నారు. మళయాళి వెర్షన్ టీజర్ ని మీరు ఇక్కడ చూడవచ్చు.

    ఎన్టీఆర్‌ హీరోగా నటించిన చిత్రం 'జనతా గ్యారేజ్‌'. 'ఇచట అన్నీ రిపేర్లు చేయబడును...' అనేది ఉపశీర్షిక. సమంత హీరోయిన్. మోహన్‌లాల్‌ కీ రోల్ పోషిస్తున్నారు. కొరటాల శివ దర్శకుడు.నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ (సీవీఎమ్‌) నిర్మాతలు.

    'బలవంతుడు బలహీనుడిని భయపెట్టి బతకడం ఆనవాయితీయే. బట్‌ ఫర్‌ ఎ ఛేంజ్‌...ఆ బలహీనుడి పక్కన కూడా ఓ బలముంది' అంటూ సాగే టీజర్ తో ఎన్టీఆర్‌ తన బలం చూపించారు. 34 సెకన్ల నిడివిగల ప్రచార చిత్రం విడుదలవడమే ఆలస్యం సామాజిక మాధ్యమాలు 'జనతా గ్యారేజ్‌' సందడితో హోరెత్తిపోయాయి.

    ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ జరుగుతోంది. త్వరలోనే పాటల్ని, వచ్చే నెల 12న చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ ఓ విద్యార్థిగా కనిపించబోతున్నట్టు తెలుస్తోంది.

    అలాగే ఈ చిత్రం జూలై 25 న ఆడియో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆడియో పంక్షన్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. మొదట ఈ ఆడియో పంక్షన్ ని న్యూ జర్సీలో ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ కు ఛేంజ్ చేసినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఆడియో పంక్షన్ ప్లాన్ చేసినా, ఏర్పాట్లు చేయటం కష్టమని ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు.

    ఇక ఆడియో పంక్షన్ రోజే ...చిత్రానికి సంభందించిన ధియోటర్ ట్రైలర్ విడుదల చేస్తున్నారు. అలాగే సాంగ్ టీజర్స్ తో ఓ వారం రోజులు పాటు దమ్ము రేపనున్నారు. ఈ నెల సైలెంట్ గా షూటింగ్ జరిపి, వచ్చే నెల నుంచి ఇక ప్రమోషన్ ని ప్రారంభించనున్నారు.

    ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మిర్చి, శ్రీమంతుడు సినిమాల తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

    ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో సంచలనం క్రియేట్ చేస్తోందట. ముఖ్యంగా ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు భారీ రేట్‌కు సొంతం చేసుకున్నారు. మొత్తానికి ఈ సినిమాకు 61 కోట్లకు పైగానే బిజినెస్ జరిగినట్టు తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు ఎన్టీఆర్.

    ఇప్పటికే రూ. 61 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. ఎన్టీఆర్ కెరీర్లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా రూ. 60 కోట్ల దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఇదంతా కొరటాల శివ ఎఫెక్టే అని చెప్పక తప్పదు. సినిమా హిట్టయితే రూ. 70 నుండి 80 కోట్ల మేర వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

    English summary
    Coming to Janata Garage teaser now, while Jr NTR says "Janata Garage, Ichhata anni repair cheyabadunu" in Telugu, Mohan Lal has stated the same in Malayalam teaser.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X