»   » బట్ ఫర్ ఎ ఛేంజ్...అంటూ 'జనతాగ్యారేజ్' టీజర్ వచ్చేసింది..

బట్ ఫర్ ఎ ఛేంజ్...అంటూ 'జనతాగ్యారేజ్' టీజర్ వచ్చేసింది..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న జనతాగ్యారేజ్ టీజర్ వచ్చేసింది. "బలవంతుడు ..బలహీనుడ్ని భయపెట్టి బ్రతకటం ఆనవాయితీ అయితే ..బట్ ఫర్ ఎ ఛేంజ్...ఆ బలహీనుడు ప్రక్కన కూడా ఓ బలం ఉంది. జనతాగ్యారేజ్.. ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును" అని ఎన్టీఆర్ చెప్పే డైలాగుతో ఈ టీజర్ వదిలారు. ఈ టీజర్ తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపుచేసేసారు. మీరు ఇక్కడ ఆ టీజర్ ని చూడవచ్చు.


మైత్రిమూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తోన్న ఈ మూవీలో మలయాళ స్టార్ మోహన్‌లాల్ కీలకపాత్రలో కనిపించనున్నారు. సమంత, నిత్యమీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు ఆగస్టు 12న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ చిత్రం జూలై 25 న ఆడియో విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ ఆడియో పంక్షన్ ని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నట్లు చెప్తున్నారు. మొదట ఈ ఆడియో పంక్షన్ ని న్యూ జర్సీలో ప్లాన్ చేసారు. అయితే ఇప్పుడు హైదరాబాద్ కు ఛేంజ్ చేసినట్లు తెలుస్తోంది. అమెరికాలో ఆడియో పంక్షన్ ప్లాన్ చేసినా, ఏర్పాట్లు చేయటం కష్టమని ఈ నిర్ణయానికి వచ్చినట్లు చెప్తున్నారు.


ఇక ఆడియో పంక్షన్ రోజే ...చిత్రానికి సంభందించిన ధియోటర్ ట్రైలర్ విడుదల చేస్తున్నారు. అలాగే సాంగ్ టీజర్స్ తో ఓ వారం రోజులు పాటు దమ్ము రేపనున్నారు. ఈ నెల సైలెంట్ గా షూటింగ్ జరిపి, వచ్చే నెల నుంచి ఇక ప్రమోషన్ ని ప్రారంభించనున్నారు.


ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ మలయాళ నటుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. మిర్చి, శ్రీమంతుడు సినిమాల తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.


Ntr's Janatha Garage teaser released

ఇప్పటికే బిజినెస్ వర్గాల్లో సంచలనం క్రియేట్ చేస్తోందట. ముఖ్యంగా ఈ సినిమా నైజాం హక్కులను ప్రముఖ నిర్మాత దిల్‌రాజు భారీ రేట్‌కు సొంతం చేసుకున్నారు. మొత్తానికి ఈ సినిమాకు 61 కోట్లకు పైగానే బిజినెస్ జరిగినట్టు తెలిసింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నారు ఎన్టీఆర్.


ఇప్పటికే రూ. 61 కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. ఎన్టీఆర్ కెరీర్లో ఇప్పటి వరకు ఏ సినిమా కూడా రూ. 60 కోట్ల దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఇదంతా కొరటాల శివ ఎఫెక్టే అని చెప్పక తప్పదు. సినిమా హిట్టయితే రూ. 70 నుండి 80 కోట్ల మేర వసూళ్లు సాధిస్తుందని అంచనా వేస్తున్నారు.

English summary
Janatha Garage Telugu Movie Official Teaser released today. Teaser ft. Jr NTR, Samantha, Mohanlal and Nithya Menen, directed by Koratala Siva and music is composed by Devi Sri Prasad. This movie is produced by Naveen Yerneni, Y. Ravi Shankar and CV Mohan. This movie also stars Devayani, Saikumar and Ajay in supporting roles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu