»   »  ఎన్టీఆర్ సైతం 'బాహుబలి' దాటలేదు

ఎన్టీఆర్ సైతం 'బాహుబలి' దాటలేదు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాబోయే ప్రతీ పెద్ద సినిమాకీ కలెక్షన్స్ , రిలీజ్ విషయంలో బాహుబలే టార్గెట్. దాన్ని దాటాలనే ఆలోచన ఉన్నా లేకపోయినా అంతా దానితో పోల్చి చూస్తూంటారు. తాజాగా జూ ఎన్టీఆర్ హీరోగా, సుకుమార్ డైరక్టర్ గా రూపొంది విడుదలకు సిద్దమైన చిత్రం ‘నాన్నకు ప్రేమతో'. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమా పై ట్రేడ్ లోనూ, అభిమానుల్లోనూ అంచనాలు బాగున్నాయి. దాంతో ఏ ఏరియాలో ఎంత బిజినెస్ జరిగింది...ఎన్ని ధియోటర్స్ లో విడుదల చేస్తున్నారనేది హాట్ టాపిక్ గా మారింది.

పంపిణీదారుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం సీడెడ్ లో భారీగా అంటే 230 ధియెటర్స్ లో విడుదలవుతోంది. కాకపోతే బాహుబలి సినిమాను ఇది క్రాస్ చేయ్యలేక పోతోంది. బాహుబలి 250 ధియెటర్స్ లో రిలీజ్ అయ్యి రికార్డు సృష్టంచింది.


NTR's Nannaku premato ceded centers 230

నాన్నకు ప్రేమతో సినిమా సీడెడ్ లో మెదటిరోజు సుమారు 3 కోట్లకుపైగా వసులు చేస్తుందని, అభిమానులు ఎక్సపెక్ట్ చేస్తున్నారు. ఏదిఎమైనా ఈ సినిమా విజంయం పై అభిమానులు కొండంత ఆశతో ఉన్నారన్నది సత్యం. చాలా కాలం నుండి సరైన హిట్ లేక బాదపడుతున్న ఎన్టీఆర్ కు విజయం వరిస్తుందో లేదో వేచి చూడాలి. ఈ సినిమా ఆడియో ఈ రోజున విడుదల చేస్తున్నారు.


అలాగే.. ఈ చిత్రం బిజినెస్ కూడా అదే స్పీడుతో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రం ఉత్తరాంధ్ర, వైజాగ్ రైట్స్ ని విబిఎమ్ రెడ్డి ఫిలిమ్స్ వారు సొంతం చేసుకున్నారు. నిన్నే ఈ డీల్ ఫైనల్ అయ్యింది. నాన్ రిఫండబుల్ ఎడ్వాన్స్ పద్దతిలో విబిఎన్ రెడ్డి ఫిల్మ్స్ వారు తీసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం.


రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సమకూర్చారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరసన రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈ చిత్రంలో జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, రాజీవ్‌ కనకాల, అవసరాల శ్రీనివాస్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

English summary
‘Nannaku Prematho’ is going to release in 230 theaters in Ceeded . But ‘Baahubali’ back then released in 250 theaters on its release day and got the highest theaters record .
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu