twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘టెంపర్' లేచింది: బిజినెస్ ఏ ఏరియా...ఎంతకి

    By Srikanya
    |

    హైదరాబాద్: జూ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టెనర్ ‘టెంపర్'. సినిమా ఫస్ట్ లుక్, థియేట్రికల్ ట్రైలర్ విడుదలయినప్పటి నుండి సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. పిభ్రవరి 13న విడుదల అవుతున్న ఈ చిత్రం కు స్టన్నింగ్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. అందుతున్న సమాచారాన్ని బట్టి దాదాపు అన్ని ఏరియాల బిజినెస్ క్లోజ్ చేసేసారు.

    ఆడియో పంక్షన్ లో ఈ చిత్రం అవుట్ పుట్ టెర్రిఫిక్ గా వచ్చిందని...తను తన సోదరుడు కలిసి ఈ చిత్రాన్ని స్వయంగా విడుదల చేస్తున్నామని బంగ్ల గణేష్ ప్రకటించారు. దానికి తోడు దర్సకుడు పూరి జగన్నాథ్ సైతం కొన్ని ఏరియాలు రైట్స్ తీసుకుంటున్నట్లు వార్త వచ్చింది. ఈ నేపధ్యంలో ప్రి రిలీజ్ బిజినెస్ 42 కోట్ల వరకూ జరిగిందని ట్రేడ్ వర్గాల అంచనా.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Ntr's Temper distributors & Area rights

    ఏరియావైజ్ డిస్ట్రిబ్యూటర్స్...వారు తీసుకున్న రేట్లు :

    ఏరియా బిజినెస్ డిస్ట్రిబ్యూటర్

    నైజాం Rs. 11.00 కోట్లు సురేష్ మూవీస్

    సీడెడ్ Rs. 6.30 కోట్లు శివ శక్తి ఫిల్మ్స్

    నెల్లూరు Rs. 1.65 కోట్లు ఐకాన్

    కృష్ణా Rs. 2.75 కోట్లు హరి పిక్చర్స్

    గుంటూరు Rs. 3.30 కోట్లు ఎస్ క్రియేషన్స్

    వైజాగ్ Rs. 4.00 కోట్లు భరత్ పిక్చర్స్

    వెస్ట్ గోదావరి Rs. 2.30 కోట్లు సురేష్ మూవీస్

    ఈస్ట్ గోదావరి Rs. 2.52 కోట్లు అనుశ్రీ ఫిల్మ్స్

    మొత్తం Rs. 33.82 కోట్లు

    కర్ణాటక Rs. 4.50 కోట్లు బృందా అశోసియేట్స్

    దేశంలో మిగిలిన ఏరియాలు Rs. 2.00 కోట్లు ఇంద్ర ఫిల్మ్స్

    -ఓవర్ సీస్ Rs. 3.60 కోట్లు గ్రేట్ ఇండియా

    మొత్తం (ప్రపంచవ్యాప్తంగా) Rs. 43.92 కోట్లు

    గమనిక: కేవలం ఇవి ట్రేడ్ లో చెప్పబడుతున్న లెక్కలు మాత్రమే..అధికారిక లెక్కలు కావు

    Ntr's Temper distributors & Area rights

    ఈ చిత్రం ఫిబ్రవరి 13న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. మాగ్జిమం నెంబరాఫ్ థియోటర్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం మొదటి షో హైదరాబాద్ భ్రమరాంబ థియోటర్ లో ఉదయం 5.07 నిముషాలకు విడుదల కానున్నదని సమాచారం. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేష్ ఈ విషయమై ప్రకటన చేసి ఉన్నారు. అలాగే .. భ్రమరాంబ థియోటర్ లో గతంలో బాలకృష్ణ లెజండ్ చిత్రం విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అయితే ఈ లోగా సీడెడ్ లో చాలా చోట్ల 12 రాత్రి తెల్లారితే 13 అనగా షోలు పడతాయి. అయితే అఫీషియల్ గా ముహూర్తం మాత్రం భ్రమరాంబలో జరగనుంది.

    ఇక చిత్రం విశేషాలకు వస్తే...

    తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈచిత్రాన్ని వెస్ట్ గోదావరిలో పూరి జగన్నాథ్ స్వయంగా విడుదల చేయబోతున్నాడు. ఇందుకోసం ఆయన పాపుల డిస్ట్రిబ్యూటర్ సురేస్ మూవీస్‌తో జతకట్టినట్లు తెలుస్తోంది. ఈ జిల్లా రైట్స్ కోసం పూరి జగన్నాథ్ రూ. 2 కోట్ల 50 లక్షలు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

    తాను దర్శకత్వం వహించిన చిత్రాన్ని....ఇంత రేటు పెట్టి మరీ పూరి జగన్నాథ్ కొనడం హాట్ టాపిక్ అయింది. సినిమాపై ఆయనకు చాలా కాన్ఫిడెన్స్ ఉండబట్టే ఇలా చేసాడని అంటున్నారు. అయితే మరో వాదన కూడా వినిపిస్తోంది ఉంది. ‘టెంపర్' చిత్రం చివరి షెడ్యూల్‌కు నిర్మాత బండ్ల గణేష్ డబ్బులు ఇవ్వలేదని, పూరి తన సొంత డబ్బులు ఖర్చు పెట్టాడని, అందుకే నిర్మాత ఇలా సెటిల్మెంట్ చేసాడని కొందరు అంటున్నారు. ఇందులో నిజమెంతో తేలాల్సి ఉంది.

    Ntr's Temper distributors & Area rights

    ఆడియో విడుదల తర్వాత ‘టెంపర్' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రెస్పాన్స్ కు తగిన విధంగానే ఈ చిత్రాన్ని తొలిరోజు భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాట్లు చేస్తున్నారు. వెయ్యికిపైగా థియేటర్లు ఇప్పటికే బుక్ చేసినట్లు సమాచారం. మరో వైపు అమెరికాలోనూ ఈ చిత్రాన్ని 100కుపైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం అందించారు. సినిమాకు మ్యూజిక్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరి 13న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫుల్‌లెంగ్త్‌ కమర్షియల్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.

    English summary
    Pre release business of Temper has collected Rs 42 Crores already. Here is the film’s area wise distributors and price details
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X