OG AP TG Day 1 Collection: ఓజీ ఆంధ్రా, నైజాం కలెక్షన్స్.. రికార్డ్ వసూళ్లతో పవన్ కళ్యాణ్ బీభత్సం

సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్‌గా నటించారు. ఎన్నో అంచనాల మధ్య సెప్టెంబర్ 25న ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా విడుదలైంది. తొలి రోజే భారీ ఓపెనింగ్స్‌తో దుమ్మురేపిన ఓజీ తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ కలెక్షన్స్ సాధించింది. ఈ వివరాల్లోకి వెళితే..

ఓజీ బడ్జెట్ ఎంత?
ఓజీలో బాలీవుడ్ స్టార్‌ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ పోషిస్తున్నారు. అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శుభలేఖ సుధాకర్, శియా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, అజయ్ ఘోష్‌‌లు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రవి కే చంద్రన్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి ఓజీ సినిమాను దాదాపు 250 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు.

OG AP TG Day 1 Collection Pawan Kalyan s movie set new record in nizam

ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్
టీజర్, ట్రైలర్లతో పాటు పవన్ కళ్యాణ్ కారణంగా ఓజీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే ఓజీ ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. ఆంధ్రా రైట్స్ 80 కోట్ల రూపాయలకు, సీడెడ్‌లో 22 కోట్ల రూపాయలు, నైజాం థియేట్రికల్ రైట్స్ 55 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. దాంతో ఓజీ తెలుగు రాష్ట్రాల్లో 157 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి) మేర బిజినెస్ చేసింది. ఇక కర్ణాటక హక్కులు 8 కోట్ల రూపాయలు.. తమిళ, కేరళలో హక్కులు 3 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది.

ఓజీ బ్రేక్ ఈవెన్ టార్గెట్
ఇక నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ 25.5 కోట్ల రూపాయల మేర అమ్ముడయ్యాయి. పవన్ కళ్యాణ్ చిత్రం యూఎస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. మొత్తంగా ఓజీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 193.5 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. దాంతో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 200 కోట్ల రూపాయల డిస్ట్రిబ్యూషన్ షేర్, 400 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉంది.

ఓజీ తొలి రోజు కలెక్షన్స్
సెప్టెంబర్ 24వ తేదీ రాత్రి వరల్డ్ వైడ్‌గా ఓజీ ప్రీమియర్స్ ప్రదర్శితమయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రీమియర్స్ ద్వారా 98 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇండియా వైడ్ మొత్తం 9,642 షోలకు గాను 65 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇందులో ఆంధ్రాలో 4,183 షోలకు గాను 30.80 కోట్ల రూపాయలు.. తెలంగాణలో 2,628 షోలకు గాను 26 కోట్ల రూపాయలు, కర్ణాటకలో 6.37 కోట్ల రూపాయలు, తమిళనాడులో 1.20 కోట్ల రూపాయలు వచ్చాయి. ఇక ఓవర్సీస్‌లో అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రికార్డ్ సాధించిన ఓజీ.. పెయిడ్ ప్రీమియర్స్‌లోనూ సరికొత్త రికార్డులు నమోదు చేసింది. ఓవర్సీస్‌లో ప్రీమియర్స్ ద్వారా 3.65 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 27 కోట్ల రూపాయలు) రాబట్టింది ఓజీ. ఇందులో ఒక్క నార్త్ అమెరికా నుంచే 24.85 కోట్ల రూపాయలు రాగా.. ఇతర దేశాల నుంచి 7.55 కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా తొలిరోజు వరల్డ్ వైడ్‌గా ఓజీ 150 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఓజీ కలెక్షన్స్
తెలుగు రాష్ట్రాల్లో ఓజీ తొలిరోజు కలెక్షన్స్ పరిశీలిస్తే.. కడపటి వార్తలు అందేసరికి ఉత్తరాంధ్రలో 6.70 కోట్ల రూపాయలు, ఈస్ట్ గోదావరిలో 5.30 కోట్ల రూపాయలు, గుంటూరులో 6.35 రూపాయల షేర్ రాబట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. మిగిలిన ఏరియాల ఫైనల్ రిపోర్ట్ తెలియాల్సి ఉంది. ఇక నైజాంలో మొదటి రోజుకే 20.7 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసి పవన్ కళ్యాణ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు ఓజీ చిత్రం పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా 20.25 కోట్ల రూపాయలు + 70 కోట్ల రూపాయల నెట్ రాబట్టినట్లు సాక్‌నిక్ వెల్లడించింది.

More from Filmibeat

Read more about: pawan kalyan og box office report
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X