OG Day 1 Advance Collections Worldwide: ఓజీ డే 1 వరల్డ్ వైడ్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు.. ఎన్ని కోట్లంటే?

ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఓజీ చిత్రం బాక్సాఫీస్ వద్ద మహా జాతరను తలపిస్తున్నది. 24వ తేదీ రాత్రి ప్రీమియర్లు, 25వ తేదీ షోల కోసం ఓపెన్ చేసిన అడ్వాన్స్ బుకింగ్‌‌లో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. పవన్ కల్యాణ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లను రాబడుతున్నది. డీవీవీ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు ఏపీ, తెలంగాణలోనే కాకుండా కర్ణాటక, ఓవర్సీస్ రాష్ట్రాల్లో సంచలన రీతిలో వసూళ్లు రాబడుతున్నది. ఈ సినిమా తొలి రోజుకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు వివరాల్లోకి వెళితే..

ఓజీ సినిమాను సుమారుగా 250 కోట్ల రూపాయలతో నిర్మించారు.ఈ చిత్రం ఆంధ్రప్రదేశ్ రైట్స్ 102 కోట్ల రూపాయల మేర బిజినెస్ జరిగింది. ఇక నైజాం థియేట్రికల్ రైట్స్ 55 కోట్ల రూపాయల మేర జరిగింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 157 కోట్ల రూపాయల (జీఎస్టీతో కలిపి) మేర బిజినెస్ జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

OG Day 1 Estimated Advance Booking Collections

ఇదిలా ఉండగా, కర్ణాటక హక్కులు 8 కోట్ల రూపాయల మేర జరిగింది. తమిళ, కేరళలో హక్కులు 3 కోట్ల రూపాయల మేర జరిగింది. ఇక నార్త్ అమెరికా థియేట్రికల్ రైట్స్ 2.9 మిలియన్ డాలర్లు అంటే.. 25.5 కోట్ల రూపాయల మేర జరిగింది. యూఎస్‌లో బ్రేక్ ఈవెన్ కావాలంటే.. కనీసం 4.5 మిలియన్ డాలర్లు వసూలు చేయాల్సి ఉంటుంది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

కర్ణాటకలో ఈ సినిమా సంచలన రీతిలో అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించింది. వినాయక థియేటర్‌లో కేవలం 8 నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడుపోయాయి. బెంగళూరులో కేజీఎఫ్, దేవర చిత్రాల కంటే అధికంగా, కూలీ సినిమాకు చేరువగా వసూళ్లను నమోదు చేసింది. ఈ సినిమా తొలి రోజున 1 కోటి రూపాయలు వసూళ్లను నమోదు చేసింది.

నార్త్ అమెరికాలో ఈ సినిమాకు సంబంధించి రికార్డు లెవెల్‌లో ఆటలను ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేశారు. హిందీ వెర్షన్ 250 లొకేషన్లలో, తెలుగు వెర్షన్ 3000 షోలను ప్రదర్శించనున్నారు. కడపటి వివరాలు తెలిసే సరికి.. ఈ సినిమా 2 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 20 కోట్ల రూపాయలు వసూలు చేసింది అని అధికారికంగా ప్రత్యాంగీరా సినిమాస్ తెలిపారు. ఈ సినిమా చరిత్ర సృష్టించేందుకు సిద్దంగా ఉంది అంటూ పోస్టు చేశారు.

ఈ సినిమా తెలంగాణలో 10 కోట్ల రూపాయలు, ఇండియాలో 20 కోట్ల రూపాయల మేర అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. ఈ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టిందని, రానున్న రోజుల్లో ఈ మొత్తం పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఇదిలా ఉండగా, సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

More from Filmibeat

Read more about: og pawan kalyan sujeeth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X