OG Day 5 Collections Worldwide: 300 కోట్లకు చేరువగా ఓజీ .. పవన్ కళ్యాణ్ మూవీకి 5 వ రోజు ఎన్ని కోట్లంటే?

OG Day 5 Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'OG (They Call Him OG)'. ఈ గ్యాంగ్ స్టార్ మూవీ సెప్టెంబర్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఫస్ట్ షో నుంచే ప్రేక్షకులను ఆకట్టుకుంది. పవన్ కళ్యాణ్ స్టైల్, యాక్షన్, డైలాగ్స్, థమన్ సంగీతం సినిమాకు హైలైట్. ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మాత్రమే కాదు, సాధారణ ఆడియెన్స్ నుంచీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో OG సినిమా బడ్జెట్ ఎంత? ఏరియా వైజ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎన్ని కోట్లు? 5 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు సాధించిందంటే..?

ఓజీ మూవీ బడ్జెట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'OG'లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కలిసి కనిపించారు. ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్, ఉపేంద్ర లిమయి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాశ్ రాజ్, అజయ్ ఘోష్, శుభలేఖ సుధాకర్ వంటి తారలు ఇందులో కీలక పాత్రలు పోషించారు.

ఇక టెక్నికల్ వైపు.. సినిమాటోగ్రఫీ - రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస, ఎడిటింగ్- నవీన్ నూలి, మ్యూజిక్ - ఎస్ఎస్ థమన్ అందించారు. టాలీవుడ్ టాప్ బ్యానర్ DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నిర్మాత డీవీవీ దానయ్య ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించారు. నటీనటుల రెమ్యూనరేషన్లు, టెక్నీషియన్ల ఫీజులు, సెట్ ఖర్చులు, విదేశీ షూటింగ్, ప్రమోషన్లు అన్ని కలిపి ఈ మూవీ బడ్జెట్ సుమారు ₹250 కోట్లు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

OG Day 5 Estimated Box Office Collections Worldwide Pawan Kalyan s Movie witnessed massive growth

ప్రీ రిలీజ్ బిజినెస్ - బ్రేక్ ఈవెన్ టార్గెట్

'OG'పై ముందే ఏర్పడిన అంచనాల వల్ల, థియేట్రికల్ రైట్స్, డిజిటల్ రైట్స్ భారీ ధరలకు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల బిజినెస్ విషయానికి వస్తే.. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ - రూ. 80 కోట్లు, సీడెడ్‌ - రూ. 22 కోట్లు, నైజాం - రూ. 55 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రూ. 157 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇతర రాష్ట్రాలు విషయానికి వస్తే.. కర్ణాటక- రూ. 8 కోట్లు, తమిళనాడు+కేరళ -రూ. 3 కోట్ల బిజినెస్ జరిగింది. ఇక ఓవర్సీస్ లో (ప్రధానంగా USA, కెనడా) రూ. ₹25.5 కోట్లుకు అందాయి. అన్ని కలుపుకుని మొత్తం వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 193.5 కోట్ల ప్రీ రిలీజ్ జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. సినిమా బడ్జెట్ భారీగా ఉన్నప్పటికీ, ప్రీ రిలీజ్ బిజినెస్ ద్వారా మంచి మొత్తాన్ని ఇప్పటికే రికవర్ చేసింది. వరల్డ్ వైడ్‌గా ₹194 కోట్లకు పైగా వసూలు చేస్తే సినిమాకు బ్రేక్ ఈవెన్ అవుతుంది. అంటే.. పవన్ కళ్యాణ్ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ. 200 కోట్ల డిస్ట్రిబ్యూషన్ షేర్, 400 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు

బాక్సాఫీస్ వద్ద ఓజీ సునామీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్'OG'సినిమా విడుదలైన దగ్గర నుంచే బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం ప్రీమియర్ షోలు నుంచే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా, పెయిడ్ ప్రీమియర్స్ ద్వారానే సుమారు రూ.21 కోట్ల వసూళ్లు సాధించింది. తొలి రోజు పవన్ పవర్ ఏంటో అర్థమైంది. దీంతో రూ.64 కోట్ల భారీ గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజున రూ.20 కోట్లు, మూడో రోజున రూ.19 కోట్లు, నాలుగవ రోజు ఆదివారం రోజు కూడా అదే జోరులో కలెక్షన్ సాధించింది. వీకెంట్ నాడు రూ.18.4 కోట్లు వసూలు చేసింది. దీంతో ఇండియాలో దేశీయంగా మొత్తం వసూళ్లు రూ.140 కోట్లకు చేరాయి. ఇక వర్డల్ వైడ్ గా నాలుగు రోజుల్లోనే 'OG' రూ.230 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది.

ఓజీ ఐదో రోజు కలెక్షన్స్

ఇక ఓజీ 5 డే కలెక్షన్ వివరాలు వస్తే.. పవర్‌ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్‌కు వీకెండ్ కలిసి రావడంతో ఆదివారం నాడు భారీ మొత్తంలో కలెక్షన్లు వచ్చాయి. అయితే.. డే 5 పండుగ, సోమవారం వర్కింగ్ డే కావడంతో కలెక్షన్లలో కాస్త డ్రాప్ కనిపించింది. మధ్యాహ్నం 2 గంటల వరకు తెలుగు వెర్షన్‌లో 30 శాతం, తమిళ్‌లో 12 శాతం, హిందీలో 8 శాతం చొప్పున థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. ఫస్ట్ షో కంటే.. సెకండ్ షోలకు ఓజీకి మరింత బుకింగ్స్ పెరిగాయి.

ఈ పరిణామాణాలను చూస్తే.. ఐదో రోజు ఓజీకి తెలుగు రాష్ట్రాల్లో 10 కోట్లు, ఓవర్సీస్‌లో 4 కోట్ల రూపాయలు, తమిళనాడులో 40లక్షల రూపాయలు, కర్ణాటకలో కోటి రూపాయలు, కేరళ + హిందీలో కోటి లెక్కన వరల్డ్ వైడ్‌గా రూ. 16 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రావొచ్చని అంచనా వేస్తున్నారు. దాంతో దీంతో 5 రోజుల్లో ఓజీ మూవీకి వరల్డ్ వైడ్‌గా 245 కోట్ల రూపాయల కలెక్షన్స్ వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే.. మూవీ ప్రకటన ప్రకారం ఓజీ నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 291.54 కోట్లు వసూలు చేసినట్లు ప్రకటించడం గమనార్హం. మూవీ మేరక్ లెక్క ప్రకారం చూస్తే.. ఓజీ 5 రోజుల్లో రూ. 300 కోట్ల క్లబ్ లో చేరుకునే అవకాశముంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X