OG Day 6 Collections Worldwide: బాక్సాఫీస్ వద్ద పవన్ మేనియా... ఓజీకి 6 వ రోజు ఎన్ని కోట్లంటే?

OG Day 6 Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ 'OG (They Call Him OG)' బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టిస్తోంది. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా, సెప్టెంబర్ 25న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో సినిమాకు అద్భుతమైన ఓపెనింగ్స్ లభించాయి. పవన్ కళ్యాణ్ స్టైల్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్, థమన్ మ్యూజిక్ సినిమాకు హైలైట్ అయ్యాయి. ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి మాత్రమే కాదు, సాధారణ ఆడియెన్స్ నుంచీ కూడా పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురుస్తోంది. ఈ క్రమంలో OG సినిమా బడ్జెట్ ఎంత? ఏరియా వైజ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎన్ని కోట్లు? 6 రోజుల్లో ఎన్ని కోట్లు వసూళ్లు సాధించిందంటే..?

ఓజీ మూవీ బడ్జెట్
పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాను టాలీవుడ్ టాప్ బ్యానర్ DVV ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిర్మాత డీవీవీ దానయ్య సుమారు ₹250 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 'OG'లో బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ నటీనటులు కలిసి కనిపించారు. ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్‌తో పాటు ప్రకాశ్ రాజ్, అజయ్ ఘోష్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ఉపేంద్ర లిమయి వంటి ప్రముఖులు కీలక పాత్రలు పోషించారు. ఇక టెక్నికల్ వైపు.. సినిమాటోగ్రఫీ - రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస, ఎడిటింగ్- నవీన్ నూలి, మ్యూజిక్ - ఎస్ఎస్ థమన్ అందించారు. భారీ సెట్‌లు, విదేశీ షెడ్యూల్స్, టెక్నికల్ టీమ్ రీమ్యునరేషన్లు అన్ని కలిపి బడ్జెట్ రేంజ్ బాగా పెరిగింది.

OG Day 6 Estimated Box Office Collections Worldwide Power Star Pawan Kalyan Storm Continues at Box Office

ప్రీ రిలీజ్ బిజినెస్ - బ్రేక్ ఈవెన్ టార్గెట్
పవన్ కళ్యాణ్ 'OG'పై ముందే ఏర్పడిన బజ్ కారణంగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా రికార్డ్ స్థాయిలో జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోనే థియేట్రికల్ రైట్స్ భారీ మొత్తంలో అమ్ముడుపోయాయి. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ - రూ. 80 కోట్లు, సీడెడ్‌ - రూ. 22 కోట్లు, నైజాం - రూ. 55 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో రూ. 157 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక కర్ణాటకలో రూ. 8 కోట్లు, తమిళనాడు-కేరళలో రూ. 3 కోట్లు, ఓవర్సీస్ రైట్స్ రూ. 25.5 కోట్లకు అమ్ముడయ్యాయి. మొత్తం వరల్డ్ వైడ్ గా రూ. 194 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీంతో సినిమాకు బ్రేక్ ఈవెన్ కావాలంటే డిస్ట్రిబ్యూటర్స్ షేర్‌గా ₹200 కోట్లు, అంటే వరల్డ్ వైడ్ గ్రాస్ సుమారు ₹400 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.

బాక్సాఫీస్ వద్ద ఓజీ సునామీ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన 'OG (They Call Him OG)' విడుదలైన దగ్గర నుంచే బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. ప్రీమియర్ షోల ద్వారానే హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా, పెయిడ్ ప్రీమియర్స్ ద్వారా సుమారు రూ.21 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఫస్ట్ డే పవన్ కళ్యాణ్ పవర్ ఏంటో చూపిస్తూ, రూ.64 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రెండో రోజు రూ.20 కోట్లు, మూడో రోజు రూ.19 కోట్లు, నాలుగవ రోజు (ఆదివారం) కూడా అదే జోరును కొనసాగిస్తూ రూ.18.4 కోట్లు రాబట్టింది. ఐదో రోజు మాత్రం కొంత తగ్గినా, రూ.8.5 కోట్లు వసూలు చేసింది. మొత్తంగా ఐదు రోజుల వరకు ఇండియాలో రూ.148.82 కోట్ల నెట్, రూ.176.12 కోట్ల గ్రాస్ రాబట్టింది.

ఏరియా వైజ్ వసూళ్లను పరిశీలిస్తే, ఆంధ్రా- నైజాంలలో కలిపి రూ.148 కోట్ల రూపాయలు, కర్ణాటకలో రూ.17 కోట్లు, తమిళనాడులో రూ.3.50 కోట్లు, కేరళ + హిందీ + రెస్టాఫ్ ఇండియాలో రూ.5.23 కోట్ల వసూళ్లు సాధించింది. పవన్ సినిమా అన్ని భాషల్లోనూ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇక ఓవర్సీస్‌లో అయితే OG కి అసలు ఎదురులేదు. అమెరికాలో రిలీజ్‌కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే $3 మిలియన్ (రూ.25 కోట్లు) రాబట్టగా, మొదటి 5 రోజుల్లో నార్త్ అమెరికాలోనే $5 మిలియన్ (భారత కరెన్సీలో రూ.45 కోట్లు) వసూలు చేసింది. ఈ వివరాలను ప్రత్యంగీరా సినిమాస్ అధికారికంగా వెల్లడించింది. అమెరికాతో పాటు ఆస్ట్రేలియా, యూకే, యూరప్, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, న్యూజిలాండ్ వంటి ప్రాంతాలన్నింటిలో కలిపి ఓవర్సీస్‌లో రూ.86 కోట్లకు పైగా వసూళ్లు వచ్చాయి. దీంతో ఐదు రోజులకు గాను OG వరల్డ్‌వైడ్ గ్రాస్ రూ.263 కోట్లను దాటింది.

ఓజీ ఆరో రోజు కలెక్షన్స్

ఇక ఓజీ 6 డే కలెక్షన్ వివరాలు వస్తే.. OG' వీకెండ్ కలెక్షన్స్‌తో దుమ్మురేపింది. అయితే ఆ తర్వాతి వర్కింగ్ డేస్‌లో పండుగ రోజులు కూడా కావడంతో కలెక్షన్లపై ప్రభావం పడింది. మధ్యాహ్నం 2 గంటల వరకు థియేట్రికల్ ఆక్యుపెన్సీ తెలుగులో 25 శాతం, తమిళ్‌లో 8 శాతం, హిందీలో 7 శాతం నమోదైంది. ఫస్ట్ షోల కంటే సెకండ్ షోలకు మాత్రం బుకింగ్స్ బాగానే పెరిగాయి. ట్రేడ్ అంచనాల ప్రకారం, ఆరవ రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.4.3 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.0.8 కోట్లు, తమిళనాడు, కర్ణాటక, కేరళ, హిందీ వెర్షన్లలో కలిపి రూ.1.5 కోట్లు వసూలు చేసినట్లు భావిస్తున్నారు. మొత్తంగా ఇండియా వైడ్ గా డే 5 నాడు రూ.6 కోట్లకు పై వసూలు చేసే

అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. దాంతో OG 6 రోజుల్లో ఇండియాలో రూ.155 కోట్ల నెట్, రూ.186 కోట్ల గ్రాస్ వసూలు చేయనుంది. వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ మాత్రం ఇప్పటికే రూ.270 కోట్లను చేరే దిశగా దూసుకెళ్తున్నాయి. ట్రేడ్ పండితుల లెక్కల ప్రకారం.. పవన్ కళ్యాణ్ OG మూవీ త్వరలోనే రూ.300 కోట్ల గ్రాస్ మార్క్ చేరుతుందని స్పష్టమవుతోంది. ఈ స్పీడ్ చూస్తుంటే పవన్ బాక్సాఫీస్ స్టామినా మరోసారి నిరూపితమైందనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X