OG North America Box Office: నార్త్ అమెరికాలో OG ప్రభంజనం.. 5 రోజలు ముందే పవన్ మూవీ అరుదైన రికార్డు
జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన OG చిత్రం నార్త్ అమెరికాలో కాసుల పంట పండిస్తున్నది. ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ దాదాపు నెల రోజుల ముందే ప్రారంభించారు. ప్రీ సేల్స్ ప్రారంభమైన తొలి రోజు నుంచే ఈ చిత్రం రికార్డు స్థాయిలో టికెట్లను అమ్మడం ప్రారంభించింది. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా 2 మిలియన్ల డాలర్లకు చేరువైంది. ఈ సినిమా బడ్జెట్, నార్త్ అమెరికా ప్రీమియర్ల కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా RRR లాంటి బ్లాక్ బస్టర్ సినిమాను అందించిన టాప్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైనర్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మాతగా సాహో ఫేమ్ సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఓజీ (OG) గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సినిమా ద్వారా బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో మలయాళ నటుడు అర్జున్ దాస్, సీనియర్ నటులు ప్రకాశ్ రాజ్, శుభలేఖ సుధాకర్, శ్రీయా రెడ్డి, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, అజయ్ ఘోష్ లాంటి వాళ్లు నటిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫి, ఎఢిటింగ్ నవీన్ నూలీ, సంగీతం థమన్ ఎస్ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ఇక ఈ సినిమా బడ్జెట్, వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ సినిమాలోని నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్లు, ప్రొడక్షన్ కాస్ట్ అంతా కలిపి ఈ సినిమాను 250 నుంచి 300 కోట్ల రూపాయల మేర బడ్జెట్‌తో నిర్మించారు. ఇక నార్త్ అమెరికాతో కలిపి ఓవర్సీస్ రైట్స్ సుమారుగా 80 కోట్ల రూపాయల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా ప్రీ సేల్స్‌కు అమెరికా, కెనడాలో భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ చిత్రం రికార్డు స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్లు రాబడుతున్నది. కల్కి, పుష్ప 2, దేవర సినిమాలకు ధీటుగా వసూళ్లు రాబడుతుందని అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
అమెరికాలో ఓజీ సినిమా అడ్వాన్స్‌కు బ్రహ్మండమైన రెస్పాన్స్ లభిస్తున్నది. ఈ చిత్రాన్ని సుమారుగా 470 లోకేషన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 2050 షోలను స్క్రీన్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఇప్పటికే అమెరికాలొ 62 వేల టికెట్లు అమ్ముడుపోయాయి. దాంతో ఈ ప్రీమియర్ షో కోసం 1.8 మిలియన్ డాలర్లు అంటే.. సుమారుగా 16 కోట్ల రూపాయలు వసూలు అయ్యాయి అని ట్రేడ్ వర్గాలువ వెల్లడించాయి.
ఇక కెనడాలో కూడా ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన వ్యక్తమవుతున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ సినిమా కోసం ఇప్పటికే 25 వేల డాలర్ల మేర వసూళ్లు నమోదయ్యాయి. అమెరికా, కెనడాలో కలిపి మొత్తంగా 1.95 మిలియన్ డాలర్లు అంటే.. 17 కోట్లకుపైగా వసూళ్లు నమోదు అయ్యాయి. ఇంకా 5 రోజుల ఉండగానే.. 2 మిలియన్ డాలర్లు క్లబ్‌లో చేరడానికి ఈ సినిమా సిద్దమైంది అని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.


Click it and Unblock the Notifications











