»   » వెంకన్న మహిమో...నాగ్ క్రేజో...కానీ ‘ఓం నమో వెంకటేశాయ’ నిర్మాత పండగ చేసుకుంటున్నాడు

వెంకన్న మహిమో...నాగ్ క్రేజో...కానీ ‘ఓం నమో వెంకటేశాయ’ నిర్మాత పండగ చేసుకుంటున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తెరకెక్కిస్తున్న మరో భక్తిరస చిత్రం 'ఓం నమో వేంకటేశాయ'. నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలై మంచి భక్తులను అలరిస్తున్నాయి. ఫిబ్రవరి 10న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమాలో శ్రీవారి భక్తుడు హథీరాం బాబాగా నాగార్జున, కృష్ణమ్మ అనే భక్తురాలిగా అనుష్క నటించారు. విజువల్‌ ఎఫెక్ట్స్‌కి పెద్దపీట వేస్తూ తెరకెక్కించిన ఈ చిత్రం కోసం పలు భారీ సెట్లు నిర్మించి చిత్రీకరణ జరిపారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ ని రీసెంట్ గా క్లోజ్ చేసినట్లు సమాచారం. ఎవరూ ఊహించని స్థాయిలో బిజినెస్ చేసి. చరిత్ర సృష్టించింది.ఆశ్చర్యపోయే స్దాయిలో

ఆశ్చర్యపోయే స్దాయిలో

అందుతున్న ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.47.25 కోట్లు ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. భక్తి చిత్రాల్లో ఈ రేంజులో బిజినెస్ చేయడం ఇదే తొలిసారి. దాంతో అందరూ ఈ లెక్కలు చూసి ఆశ్చర్యపోతున్నారు.


భారీ రేట్లకు

భారీ రేట్లకు

అంతేకాదు...నాగ్ కెరీర్లో కూడా ఇది రికార్డ్ ఫిగర్, 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' తర్వాత నాగార్జున, రాఘవేంద్రరావు దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో చాలా నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు దీని రైట్స్ భారీ రేట్లకు కొనుగోలు చేశారు.


నైజాం ఏరియా ఎంతకంటే..

నైజాం ఏరియా ఎంతకంటే..

ముఖ్యంగా లెక్కలు వేసి మరీ సినిమాలు కొనే ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు నైజాం ఏరియా హక్కుల్ని 9 కోట్లకు సొంతం చేసుకోవడం విశేషంగా చెప్తున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని ఏరియాలతోపాటు కర్ణాటక, ఓవర్ సీస్ కలుపుకుంటే ఓవరాల్ గా ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ. 34 కోట్లకు అమ్ముడుపోయాయి.


మొత్తం ఇంత...

మొత్తం ఇంత...

ఈ చిత్రం సేఫ్ జోన్లోకి చేరాలంటే రూ.35 కోట్లపైనే వసూలు చేయాల్సి వుంటుంది. ఇక ఈ సినిమా శాటిలైట్ హక్కులతోపాటు ఆడియో రైట్స్ కూడా కలుపుకుంటే. టోటల్ ప్రీ-రిలీజ్ బిజినెస్ లెక్క రూ.47.25 కోట్లు.


ఏరియాలవారీగా ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు :

ఏరియాలవారీగా ప్రీ-రిలీజ్ బిజినెస్ వివరాలు :

నైజాం : 9(దిల్ రాజు)
సీడెడ్ : 4.01
వైజాగ్ : 2.87
గోదావరి : 3.62
కృష్ణా : 1.80
గుంటూరు : 2.25
నెలల్లారు : 1.10
ఏపీ+తెలంగాణ : రూ. 24.65 కోట్లు
కర్ణాటక : 2.70
రెస్టాఫ్ ఇండియా : 0.80
ఓవర్వీస్ : 5,50
టోటల్ వరల్డ్ వైడ్ : రూ. 33.65 కోట్ల ఆడియో+డిజిటల్ : 1.1 శాటిలైట్ : 12.5 గ్రాండ్ టోటల్ : రూ. 47.25 కోట్లు


కుల వివాదం

కుల వివాదం

ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు కుల వివాదంలో చిక్కుకుంది. న‌మోః వేంక‌టేశాయ‌కు బంజారా సామాజికవర్గ ప్రజల సెగ తగిలింది. ఈ సినిమాను హథీరాంబాబా జీవిత చరిత్ర ఆధారంగా తీసినప్పుడు ఆయన పేరు పెట్టకుండా.. భగవంతుడి పేరు ఎలా పెడతారని బంజారాలు ప్రశ్నిస్తున్నారు.


టైటిల్ మార్చాల్సిందే

టైటిల్ మార్చాల్సిందే

రాఘవేంద్రరావు గతంలో తెరకెక్కించిన అన్నమయ్య, శ్రీ రామదాసు చిత్రాలకు వారి పేర్లనే పెట్టారని... ఈ సినిమాను మాత్రం భగవంతుడి పేరుతో తెరకెక్కించడం ఏంట‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. త‌క్ష‌ణ‌మే న‌మోః వేంక‌టేశాయ పేరును హథీరాంబాబాగా మార్చాలని, లేకుంటే సినిమా రిలీజ్ అడ్డుకుంటామని వారు హెచ్చరిస్తున్నారు.


కోర్కెల చిట్టా

కోర్కెల చిట్టా

నాగార్జున మాట్లాడుతూ ...‘‘ నాన్నగారి ఆఖరి సినిమా ‘మనం' హిట్‌ అవ్వాలని మనసారా ప్రార్థించా. ఆ సినిమా సూపర్‌హిట్‌ అయింది. అలాగే...మంచి కుటుంబాన్ని ఇచ్చావు. ఇద్దరు పిల్లల్ని చల్లగా చూడు తండ్రి అని వేడుకున్నా. తిరుమలలో ఉండగానే తెలిసింది. మా ఇద్దరి పిల్లల కల్యాణం గురించి. ఇలా స్వామివారు నా కోర్కెలన్నీ తీర్చాడు. స్వామి తీర్చిన కొద్దీ కోర్కెల చిట్టా పెరుగిపోతోంది. శ్రీనివాసుడు ఎప్పుడూ నాతోనే ఉన్నట్లు అనిపిస్తుంటుంది. శ్రీరామదాసు, అన్నమయ్య, శిరిడిసాయి, ఇప్పడు ‘ఓం నమో వెంకటేశాయ'లో నటించడం నా అదృష్టంగా భావిస్తున్నా'' అని వివరించారు.


హాధీరామ్ బాబా కథే

హాధీరామ్ బాబా కథే

శ్రీనివాసుడి పరమభక్తుడైన హథీరామ్ బాబా జీవిత కథకు ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని నిర్మించారు. కె.రాఘవేంద్ర రావు దర్శకత్వం వహిస్తున్నారు. సాయికృపా ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఎ.మహేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


అప్పటి కథ...

అప్పటి కథ...

నిర్మాత చిత్ర విశేషాలు తెలియజేస్తూ 16 శతాబ్దంలో కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవెంకటేశ్వరుని పరమభక్తుడిగా నీరాజనాలందుకున్న హాథీరామ్‌బాబా జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. ఈ సినిమాలో వెంకటేశ్వరస్వామిగా సౌరబ్‌జైన్, భక్తురాలు కృష్ణమ్మగా అనుష్క నటిస్తోంది. ప్రతి ఒక్కరిలోనూ భక్తిభావనలు పెంపొందించేలా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నాం అన్నారు. జగపతిబాబు, ప్రగ్యాజైస్వాల్, విమలారామన్ తదితరులు నటిస్తున్నారు.


English summary
Theatrical Business of 'Om Namo Venkatesaya ' is simply superb due to the trust Distributors have on this combo.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu