హిట్ టాక్.... స్క్రీన్స్ పెంచుతున్నారు
హైదరాబాద్ : హిట్ టాక్ వస్తే డిస్త్రిబ్యూటర్స్ ఆ సినిమాకు పబ్లిసిటీ పెంచి, స్క్రీన్స్ సైతం పెంచుతూ మరింత బిజినెస్ చేయటానికి ప్రయత్నం చేస్తారు. తాజాగా అలాంటి ప్రయత్నమే ఈ దసరా కానుకగా విడుదలైన ‘రాజుగారి గది' చిత్రానికి చేస్తున్నారు చిత్రం పంపిణీదారులు అని తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం ఈ రోజు నుంచి తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ చిత్రం స్క్రీన్స్ మరిన్ని పెంచనున్నారు.
‘జీనియస్' తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న ఓంకార్, తాజాగా మొదటి ప్రయత్నానికి భిన్నంగా ‘రాజుగారి గది' అంటూ హర్రర్ కామెడీతో మనముందుకు వచ్చారు. అక్టోబర్ 22న దసరా కానుకగా ఈ సినిమా విడుదల అయిన ఈ చిత్రం నిన్న రిలీజైన మూడు చిత్రాల్లో బెస్ట్ అనిపించుకుంది. భాక్సాఫీస్ వద్ద చెలరేగి,బి,సి సెంటర్లలలో డబ్బు తెస్తుందని ట్రేడ్ వర్గాల అంచనా. కామెడీ, హర్రర్ డోస్ ఫెరఫెక్ట్ గా మిక్స్ కావటమే సినిమాకు కలిసి వచ్చిందంటున్నారు.
ఈ దసరాకు ... ఓంకార్ ‘రాజుగారి గది' , క్రిష్ ...కంచె చిత్రం, సుమంత్ అశ్విన్ చిత్రం కొలంబస్ లు రిలీజ్ అయ్యాయి. మూడు చిత్రాలపై మంచి అంచనాలే ఉన్నాయి. మూడు సినిమాలూ తమ ట్రైలర్స్ తో ప్రేక్షకులను థియోటర్స్ వరకూ లాక్కెళ్లినవే. ఈ మూడింటిలో రెండు ఓ మాదిరి బడ్జెట్ చిత్రాలు కాగా, కంచె మాత్రం హై బడ్జెట్ తో రూపొందింది.

చిత్రం కథేమిటంటే...
అన్ని దెయ్యాల సినిమాల్లో లాగానే ఈ సినిమాలోనూ ఓ పురాతన భవంతి. అందులోకి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి రారంటూ...భవంతి గురించి భయపెట్టే రకరకాల కథలు. ఈ భవంతి ని బేస్ చేసుకుని మా టీవి ఛానెల్ వారు ...దెయ్యంతో ఏడు రోజులు..గెలిస్తే..3 కోట్లు అనే రియాలటీ షో పోగ్రాం పెడుతుంది. ఆ షో లో పాల్గొనటానికి ఓ ఏడుగురు (అశ్విన్, చేతన్ శ్రీను, బార్బీ,విద్యుర్లేఖ, షకలక శంకర్, ధనరాజ్, ధన్య బాలకృష్ణ) బయిలు దేరి వెళతారు.
అక్కడ ఆ భవంతిలోవారికి బొమ్మాళ రాజు ఆత్మగా మారి రాసుకున్న డైరీ కనపడుతుంది. ఇంతకీ ఆ భవంతిలో ఏముంది... లేక అక్కడ జరిగే సంఘటనలు...ఛానెల్ వారు భయపెట్టడానికి ఏర్పాటు చేసినవా...ఇంతకీ బొమ్మాళి(పూర్ణ) ఎవరు...ఆమె కథేంటి... ఆ ఏడుగురు పరిస్ధితి ఏమిటి తెలియాలంటే సినిమా పూర్తిగా చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











