»   » షాక్ :USA లో 'రామయ్యా వస్తావయ్యా' కలెక్షన్స్

షాక్ :USA లో 'రామయ్యా వస్తావయ్యా' కలెక్షన్స్

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం మొన్న శుక్రవారం దసరా కానుకగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రం USA భాక్సాఫీస్ వద్ద పెద్ద ప్లాఫ్ గా నమోదైందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ మధ్య కాలంలో ఎన్టీఆర్ ఏ సినిమాకూ రానంత తక్కువ కలెక్షన్స్ ఈ చిత్రానికి వచ్చాయి. నిజానికి మొదటి నుంచి ఎన్టీఆర్ సినిమాలు USA లో మంచి రెవిన్యూ సాధిస్తూ వస్తున్నాయి. ఆయన గత చిత్రం బాద్షా... 108 స్క్రీన్స్ లో ఓపినింగ్ వీకెండ్ లో $ 10,45,192 వసూలు చేసింది. అయితే 'రామయ్యా వస్తావయ్యా' కి ఆ పరిస్ధితి కనపడటం లేదు.

  'రామయ్యా వస్తావయ్యా' ప్రి రిలీజ్ టాక్ బాగున్నప్పటికీ రిలీజ్ అయ్యాక పరిస్ధితి ఊహించని విధంగా మారింది. సగం ఎమౌంట్ కూడా రికవరి అవదని చెప్తున్నారు. ఈ వీకెండ్ లో ...90 స్క్రీన్స్ లో .. $ 3,42,448 (Rs. 2.11 crores) కలెక్ట్ చేసింది. దాంతో ఈ చిత్రం ఓవర్ సీస్ లో పెద్ద ఫ్లాఫ్ అని డిసైడ్ చేస్తున్నారు. అయితే మరి ట్రిమ్ చేసిన తర్వాత ఏమన్నా పుంజుకుంటాయా అనేది చూడాలంటున్నారు.


  ఇక 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం తొలి రోజు డివైడ్ టాక్ తెచ్చుకున్నా...మంచి వసూళ్లనే రాబట్టింది. తొలిరోజే భారీ మొత్తం వచ్చింది. అయితే మరుసటి రోజు నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. అయితే వారం మొత్తం కలెక్షన్స్ మొత్తం బట్టి సినిమా రేంజిని డిసైడ్ చేస్తారు.

  ఈ చిత్రంలో ఫస్టాప్ కామెడీ బాగున్నా..సెకండాప్ లో ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగోలేదనే టాక్ వచ్చింది. దాంతో పది నిముషాల వరకూ సెకండాఫ్ ట్రిమ్ చేయనునట్లు తెలుస్తోంది. దాంతో ఈ సినిమా పికప్ అవుతుందని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎన్టీఆర్ సరసన సమంత,శృతి హాసన్ హీరోయిన్స్ గా నటించిన ఈ చిత్రానికి హరీష్ శంకర్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత.

  English summary
  
 Ramayya Vasthavayya has failed to attract the Telugu audiences in overseas. NTR Jr is one of the heroes in Tollywood who has good market in USA. His earlier film, Baadshah in its opening weekend collected about $ 10,45,192 from 108 screens.
 Where as his Ramayya Vastavayya which has generated good pre-release talk has not able to get even half the amount. In its opening weekend, the film has collected $ 3,42,448 (Rs. 2.11 crores) from 90 reported screens.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more