స్పిరిట్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. సందీప్ రెడ్డి అంచనా ఎంతనో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం భారీ బడ్జెట్ చిత్రాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ నుంచి పాన్ వరల్డ్ సినిమా కల్కి 2898 ఏడి, అంతకుముందు సలార్ పార్ట్ 1 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాలతో ప్రభాస్ రేంజ్ మరింతగా పెరిగిపోయింది. ఇక నెక్స్ట్ ప్రభాస్ లైన్ అప్ లో చాలా సినిమాలు ఉన్నాయి. అందులో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం ప్రభాస్ తన రాబోయే చిత్రాలు ది రాజా సాబ్, ఫౌజీ వంటి చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలకు సంబంధించి తన షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో నటించేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ మూవీ సెట్స్ లో అడుగుపెట్టడానికి ఇంకాస్త సమయం ఉంది. ప్రస్తుతానికి సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే సందీప్ రెడ్డి వంగ నటీనటుల ఎంపికను పూర్తి చేసినట్టుగా తెలుస్తుంది.

Pan India Star Prabhas Sandeep Reddy vanga upcoming film spirit expected box office collection by director

ఇక స్పిరిట్ చిత్రం ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా స్పిరిట్ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్ ని యాక్టీవ్ లోకి తీసుకొచ్చినట్టుగా మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా స్పిరిట్ పేరు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చింది. ఇదే సమయంలో ప్రభాస్ సందీప్ రెడ్డి కి సంబంధించిన స్పిరిట్ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్లపై ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. ప్రస్తుతం చిత్ర వర్గాల కొత్త సినిమాల బాక్సాఫీస్ ఓపెనింగ్ నెంబర్స్ ఎంత కలెక్ట్ అవుతుందనేది ట్రెండింగ్ గా మారిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో స్పిరిట్ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెనింగ్ డే ఎన్ని కోట్లు వసూలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై ఒకసారి సందీప్ రెడ్డి వంగ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ప్రభాస్ తన కెరీర్లో ఇప్పటివరకు 1000 నుంచి 2000 కోట్ల వరకు బాక్సాఫీస్ వద్ద వసూలు రాబట్టి ఉంటారని చెప్పారు. కానీ తన సినిమాతో మాత్రం బాక్సాఫీస్ నంబర్స్ ఎంతైనా ఉండవచ్చు కానీ, ప్రభాస్ కెరియర్లో డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లేలా ఉంటుందని చెప్పుకొచ్చారు.

అయితే ప్రస్తుతం స్పిరిట్ చిత్రం ఎప్పుడు ప్రారంభమవుతుందో అనే ఆసక్తి నుంచి ఈ సినిమా రిలీజ్ అయి మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్న అనే దానిపై ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అయితే సందీప్ రెడ్డి వంగ తన చిత్రాలకు బాక్సాఫీస్ నుంచి వచ్చే నెంబర్స్ కన్నా, ఆడియన్స్ నుంచి వచ్చే రెస్పాన్స్ కే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రతి సీన్ పేలిపోయేలా తీసినందుకు ప్రయత్నిస్తుంటారు. ఇక అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభం కాబోతున్న స్పిరిట్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిప్తి డిమ్రినీ ఎంపిక చేశారు. డాన్లీ విలన్ గా నటించబోతున్నట్టు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X