»   » రామ్ “పండుగ చేస్కో” ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియావైజ్)

రామ్ “పండుగ చేస్కో” ప్రీ రిలీజ్ బిజినెస్ (ఏరియావైజ్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'పండగ చేస్కో' అంటూ వినోదాలు పంచబోతున్నాడు రామ్ . ఈ సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ 13.6 కోట్లు వరకూ ఇరు రాష్ట్రాల్లో కలిపి జరిగినట్లు సమాచారం. ఏడు వందలకు పైగా థియోటర్స్ లో విడుదల అవుతున్న ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంటే మొదటి వారం దాదాపు 12 కోట్లు దాకా రెవిన్యూ జనరేట్ అయ్యే అవకాసం ఉందంటున్నారు. ఈ నేపధ్యంలో చిత్రానికి జరగిన ప్రీ రిలీజ్ ఓ సారి చూద్దాం...

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు


నైజాం: రూ 5 కోట్లు (దిల్ రాజు)


సీడెడ్ : రూ 2.4 కోట్లు (శివ శక్తి)


వైజాగ్ : రూ 1.5 కోట్లు(విబిఎమ్ రెడ్డి)


గుంటూరు : రూ 1.2 కోట్లు (శంకర్)


కృష్ణా : రూ 1 కోట్లు (కామాక్షి)


తూర్పు గోదావరి : రూ 1 కోట్లు (కవిత)


పశ్చిమ గోదావరి: రూ 0.9 కోట్లు (ఎల్ వి ఆర్)


నెల్లూరు : రూ 0.6 కోట్లు (క్రౌన్)


పండుగ చేస్కో ఎపి & నైజాం ప్రీ రిలీజ్ బిజినెస్: రూ 13.6 కోట్లుప్రపంచవ్యాప్తంగా జరగిన ప్రి రిలీజ్ బిజినెస్ : రూ 15.8 కోట్లు ( కర్ణాటక తో కలిపి: రూ 1.5 కోట్లు;భారత్ లో మిగతా ప్రాంతాలు: రూ 0.2 కోట్లు ఓవర్ సీస్: రూ 0.5 కోట్లు)


రామ్ మాట్లాడుతూ... టైటిల్ లోని ఆ పేరులో ఉన్న హుషారు సినిమా మొత్తం ఉంటుంది. పండగ అంటే రంగురంగుల దృశ్యం కళ్లముందు కదలాడుతుంటుంది. ఈ సినిమాలో నా పాత్ర ఎక్కడ ఉంటే అక్కడ పండగ వాతావరణం కనిపిస్తుందన్న మాట. అందుకే సినిమాకు ఆ పేరు పెట్టాం అన్నారు.


“Pandaga Chesko” Pre-Release Business

మరో ప్రక్క "పండుగ చేస్కో" నిర్మాతకు శాటిలైట్ తో మరింత ఊరట లభించినట్లే . ఈ చిత్రానికి శాటిలైట్ రైట్స్ ఊహించని విధంగా 6.5 పలకటమే అంటున్నారు. జీ తెలుగు ఛానెల్ వారు ఈ రేటు ఇచ్చి శాటిలైట్ రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు సమచారం. కుటుంబాలని ఈ చిత్రం టార్గెట్ చేసినట్లుగా ఉండటం, బ్రహ్మానందం, రకుల్ ప్రీతి సింగ్ లు చిత్రంలో ఉండటం, దర్శకుడు మలినేని గోపిచంద్ కు ఇది సూపర్ హిట్ బలుపు తర్వాత చిత్రం కావటం ఈ రేటు పలకటానికి కారణమయ్యాయని సమాచారం.


రామ్‌ పాత్ర వైవిధ్యంగా ఉంటుందని, కుటుంబమంటే ప్రాణాలిచ్చే కుర్రాడిగా రామ్‌ 'పండగ చేస్కో' లో కనిపిస్తారని చెప్తున్నారు. అతని పాత్ర ఎన్నారై అని...చాలా ఉషారుగా ఇప్పటివరకూ రామ్ చెయ్యని విధంగా క్యారక్టర్ ని డిజైన్ చేసారని చెప్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ అయ్యాక అతని ఇమేజ్ రెట్టింపు అవుతుందని, యూత్ లో క్రేజ్ మరింత పెరుగుతుందని హామీ ఇస్తున్నారు.


దర్శకుడు మాట్లాడుతూ... అతనొస్తే పండగలానే ఉంటుంది. దసరా, దీపావళి, సంక్రాంతి... ఇవన్నీ తనతో పాటు ఫ్యామిలీ ప్యాక్‌గా తీసుకొస్తాడు. చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఓ పెళ్లిలా మార్చేస్తాడు. ఆ జోరైన కుర్రాడి కథేంటో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు గోపీచంద్‌ మలినేని. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పండగ చేస్కో'. రామ్‌ హీరో. రకుల్‌ప్రీత్‌సింగ్‌, సోనాల్‌చౌహాన్‌ హీరోయిన్. పరుచూరి కిరీటి నిర్మాత. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.


“Pandaga Chesko” Pre-Release Business

దర్శకుడు మాట్లాడుతూ ‘‘ రామ్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు హీరో పాత్ర చాలా ఎనర్జిటిక్‌గా ఉంటుంది. పూర్తిస్థాయి మాస్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది. తమన్‌ మంచి సంగీతాన్నిచ్చారు. యువతతో పాటు అందరికీ నచ్చే సినిమా అవుతుంది'' అని చెప్పారు.


రకుల్‌ ప్రీత్‌సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సాయికుమార్‌, సంపత్‌, రావు రమేష్‌, బ్రహ్మానందం, జయప్రకాష్‌రెడ్డి, రఘుబాబు, సుప్రీత్‌, బ్రహ్మాజీ, సుబ్బరాజు, అభిమన్యుసింగ్‌, వెన్నెలకిశోర్‌, ప్రభాస్‌ శ్రీను, ఫిష్‌ వెంకట్‌, తేజస్విని తదితరులు ఇతర పాత్రధారులు. ఈ సినిమాకు కథ; వెలిగొండ శ్రీనివాస్‌, మాటలు: కోన వెంకట్‌, రచన సహకారం: అనిల్‌ రావిపూడి, కెమెరా: ఆర్థర్‌ విల్సన్‌, ఎడిటింగ్‌: గౌతంరాజు, ఆర్ట్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, ఫైట్స్‌: రామ్‌-లక్ష్మణ్‌, సంగీతం: థమన్‌.ఎస్‌.ఎస్‌., పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, డ్యాన్స్‌: రాజు సుందరం.

English summary
Pandaga Cheska AP & Nizam Pre-Release Business: Rs 13.6 crore . Worldwide Pre-Release Business: Rs 15.8 crore (includes Karnataka: Rs 1.5 crore; Rest Of India: Rs 0.2 crore Overseas: Rs 0.5 crore)
Please Wait while comments are loading...