»   » వచ్చేవారం రెండు పెద్ద రిలీజ్ లు, ట్విస్ట్ ఏంటంటే డైరక్టర్ ఒకరే

వచ్చేవారం రెండు పెద్ద రిలీజ్ లు, ట్విస్ట్ ఏంటంటే డైరక్టర్ ఒకరే

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ఒకే డైరక్టర్ , డైరక్ట్ చేసిన రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవటం అంటే మాటలు కాదు. అలాంటి అరుదైన అవకాశాన్ని తమిళ దర్శకుడు పాండిరాజ్ సొంతం చేసుకున్నారు. ఆయన డైరక్ట్ చేసి, గత రెండు నెలలుగా వాయిదాలు పడుతూవస్తున్న చిత్రాలు రెండు వచ్చే శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. అవి మరేవో కాదు...

పాండిరాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రాలు 'మేము', 'కథకళి'. ఈ చిత్రాల విడుదలకు సంబంధించి ఇప్పటికే చాలా సార్లు పలు తేదీలను వెల్లడించారు. అయితే కొన్ని కారణాల వల్ల విడుదలను వాయిదా వేస్తూ వచ్చినట్లు తెలుస్తోంది.

Pandiraj two films on March 18th

తాజాగా పాండిరాజ్‌ ఈ రెండు చిత్రాలను మార్చి 18న విడుదల చేయనున్నట్లు సోషల్‌మీడియా ద్వారా ప్రకటించారు. అంతేకాకుండా సరికొత్త పోస్టర్లను ఆయన అభిమానులతో పంచుకున్నారు. ఈ రెండు చిత్రాలను తమిళంలో 'కథకళి', 'పసంగ-2' అనే టైటిల్స్‌తో విడుదల చేశారు.

సూర్య, అమలాపాల్‌ జంటగా నటించిన చిత్రం 'మేము'. పాండిరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సూర్య సమర్పిస్తున్నారు. జూలకంటి మధుసూదన్‌రెడ్డి నిర్మాత. చిన్నారుల నేపథ్యంలో సాగే కథ ఇది.
విశాల్‌ హీరో గా రూపుదిద్దుకున్న చిత్రం 'కథకళి'.

కేథరిన్‌ త్రెసా, రెజీనా హీరోయిన్స్ . పాండిరాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విశాల్‌ తన సొంత బ్యానర్‌ అయిన విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కించారు. ఓ హత్య నేపథ్యంలో సాగే కథ ఇది.

English summary
Pandiraj tweeted: " With all your blessings #Memu #Pasanga2 & #Kathakali releasing in Telugu on March 18"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu