Paradha Closing Collections: వారానికే ఔట్.. అనుపమా పరదా చిత్రం క్లోజింగ్ కలెక్షన్స్.. లాభమా? నష్టమా?
యంగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ నటించిన లేటెస్ట్ ఫిల్మ్ పరదా. ఫీమేల్ ఓరియెంటెడ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహిళల గురించి ప్రత్యేకంగా చిత్రీకరించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పెద్దగా స్పందన లభించలేదు. ఆగస్టు 22న తెలుగు, మలయాళంలో విడుదలై ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు చేసిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అనుపమా పరమేశ్వరన్, సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్, ప్రధాన పాత్రల్లో నటించారు. కాగా సినిమా బడ్జెట్ ఎన్ని కోట్లు? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? ఆగస్టు 30 వరకు ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
పరదా సినిమా బడ్జెట్?
అనుమా నటించిన ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్ భాగ్యలక్ష్మి పోస సమర్పణలో ఆనంద మీడియా బ్యానర్ లో రూపుదిద్దుకుంది. శ్రీనివాసులు పీజీ, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మాతలుగా వ్యవహరించారు. సినిమా బండి, శుభం వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. సినిమాల అనుపమా, సంగీతతో మరికొంత మంది ప్రముఖులు నటించారు. నటీనటుల రెమ్యునరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చు, ప్రచార వ్యయాలన్నీ కలుపుకొని సినిమాకు 8 కోట్ల రూపాయల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు వెల్లడిస్తున్నారు.

పరదా ప్రీ రిలీజ్ బిజినెస్? బ్రేక్ ఈవెన్ పాయింట్?
అనుపమా పరమేశ్వరన్ ఇటీవల పెద్ద హిట్స్ ఏమీ అందుకోలేదు. అయినా ఆమెకు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ ఉంది. ఎప్పుడూ గ్లామర్ రోల్స్ లోనే కాకుండా తనకు వీలైనప్పుడల్లా విభిన్న కథల్లో నటిస్తోంది. అలా వచ్చిన చిత్రమే పరదా. ఈ క్రమంలో తెలుగు స్టేట్స్, కేరళలో థియేట్రికల్ బిజినెస్ ద్వారా ఈ చిత్రం రూ.5 కోట్ల బిజినెస్ అయ్యిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక ఈ చిత్రం థియేట్రికల్ ద్వారా రూ.10 కోట్ల గ్రాస్, రూ.5 కోట్ల షేర్ వసూల్ చేయాల్సి ఉందని ట్రేడ్ పండితులు తెలుపుతున్నారు.
7 రోజుల్లో పరదా చిత్రం వసూళ్లు?
బాక్సాఫీస్ వద్ద పరదా చిత్రానికి ఓపెనింగ్ డే నుంచే దారుణంగా వసూళ్లు అందాయి. మొదటి రోజు రూ.16 లక్షలు, 2వ రోజు రూ.16 లక్షలు, 3వ రోజు రూ.14 లక్షలు, 4వ రోజు రూ.13 లక్షలు, 5వ రోజు రూ.9 లక్షలు, 7వ రోజు కేవలం రూ.4 లక్షలు మాత్రమే అందిందని సాక్ నిక్ రిపోర్ట్ ఇచ్చింది. ఇలా వారం రోజుల్లో రూ.1.08 కోట్ల ఇండియా నెట్ వసూలైంది. రూ.1.20 కోట్ల ఇండియా గ్రాస్ వసూల్ అయ్యింది. టోటల్ గా పరదా చిత్రానికి రూ.1.20 కోట్లు వచ్చాయని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
లాభమా? నష్టమా?
పరదా చిత్రం థియేట్రికల్ రన్ ద్వారా టోటల్ రూ.1.20 కోట్లు వసూళ్లు చేసిందని ట్రేడ్ నిపుణులు తెలియజేస్తున్నారు. ఇక బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.10 కోట్ల గ్రాస్ అందాల్సి ఉంది. ఈ లెక్కన ఈ చిత్రానికి ఇంకా రూ.8 కోట్లకు పైగానే రికవరీ కావాల్సి ఉంది. దీంతో సినిమాకు భారీ నష్టాలు చవి చూసిందని ట్రేడ్ లెక్కలు తెలుపుతున్నాయి.


Click it and Unblock the Notifications











