Paradha Box Office Collections: పరదా మూవీకి షాకింగ్ కలెక్షన్లు.. ఆంధ్రా, నైజాం, కేరళ బాక్సాఫీస్ రిపోర్ట్

తెలుగు సినిమా రంగంలో కంటెంట్ ఆధారిత చిత్రాలకు భారీ ఆదరణ దక్కుతున్న నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పరదా. శ్రీమతి భాగ్యలక్ష్మి పోస సమర్పణలో ఆనంద మీడియా బ్యానర్‌పై శ్రీనివాసులు పీజీ, విజయ్ డొంకాడ, శ్రీధర్ మక్కువ నిర్మించారు. సినిమా బండి, శుభం చిత్రాలను రూపొందించిన ప్రవీణ్ కండ్రేగుల ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మహిళా చైతన్యం కాన్సెప్ట్‌తో రూపొందిన రూరల్ డ్రామాలో అనుపమ పరమేశ్వరన్, సంగీత, దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్, ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని ఆగస్టు 22న విడుదల చేశారు. అయితే ఈ సినిమా బడ్జెట్ ఎంత? దాని బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? బాక్సాఫీస్ వద్ద వసూలు చేసిన కలెక్షన్లు ఎంత? అనే వివరాల్లోకి వెళితే...

గ్రామీణ నేపథ్యంతో రూపొందిన విభిన్నమైన చిత్రం పరదా. గ్రామంలో ముఖం చూపించకుండా పరదా వేసుకొనే మూఢాచారంతో సాగే కథ. పడతి అనే గ్రామంలో సుబ్బలక్ష్మీ అనే యువతి రాజేశ్ (రాగమయూర్) అనే యువకుడితో ప్రేమలో ఉంటుంది. వారిద్దరికి పెళ్లి చేయాలని నిశ్చితార్థానికి ముహుర్తం నిర్ణయిస్తారు. కానీ ముఖంపై పరదా లేకుండా సుబ్బలక్ష్మీ ఫోటో నేషనల్ మ్యాగజైన్‌లో పబ్లిష్ అవుతుంది. దాంతో గ్రామ దేవత జ్వాలాంబికా దేవీ సెంటిమెంట్‌ను తుంగలో తొక్కిందనే కారణంతో ఆత్మాహుతి శిక్షను విధిస్తారు. ఆ శిక్షను ఎలా తప్పించుకొన్నది? ఆ ఊర్లో మహిళలకు పరదా వేసుకొనే ఆంక్షను ఎలా తొలగించింది అనేది సినిమా కథ

Paradha Movie Box Office

పరదా చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, సంగీత, దర్శన రాజేంద్రన్ లాంటి టాలెంటెడ్ యాక్లర్లు, కీలక పాత్రల్లో చైతన్య రావు, రాగమయూర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ లాంటి వాళ్లు నటించడం జరిగింది. ఇక ఈ సినిమాకు గోపిసుందర్ మ్యూజిక్ అందించారు. ఇక ఉత్తర భారత దేశంలోని ధర్మశాలలో కీలక భాగాన్ని చిత్రీకరించారు. ఇలా నటీనటులు, సాంకేతిక విభాగాల నిపుణులు రెమ్యురేషన్లు, ప్రమోషనల్ ఖర్చులనీ కలిపి ఈ సినిమా బడ్జెట్ సుమారుగా 8 కోట్ల రూపాయలు అయిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్‌‌ను తెలుగు, మలయాళంలో కలిపి సుమారుగా 5 కోట్ల రూపాయలుగా వాల్యూ కట్టారు.

అయితే ఈ సినిమాకు బజ్ అంతగా లేకపోవడం వల్ల అడ్వాన్స్ బుకింగ్ కూడా పెద్దగా స్పందన కనిపించలేదు. తొలి రోజు ఆక్యుపెన్సీ కూడా అంతంత మాత్రంగానే ఉంది. దాంతో ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడం కూడా కలెక్షన్లపై ప్రభావం పడింది. దాంతో ఈ మూవీ తొలి రోజు నార్మల్‌గానే బాక్సాఫీస్ జర్నీని మొదలు పెట్టింది. ఈ సినిమా తొలి రోజు తెలుగులో 40 లక్షల రూపాయలు, మలయాళంలో 10 లక్షల రూపాయలు వసూలు చేసింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఓవర్సీస్ కలెక్షన్లు అందాల్సి ఉన్నాయి.

ఇక ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే.. అమెరికా, తెలుగు రాష్ట్రాలు, కేరళ, కన్నడ రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 5 కోట్ల షేర్, 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టాల్సి ఉంటుంది. ఈ సినిమా టాక్ పాజిటివ్‌గా మారి కలెక్షన్లు పుంజుకొంటే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా పెర్ఫార్మ్ చేస్తుందనే ఆశాభావాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. రానున్న రోజుల్లో ఈ సినిమాకు ఎలాంటి వసూళ్లు నమోదు అవుతాయో వేచి చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X