Param Sundari Day 1 Box Office: పరం సుందరికి తొలి రోజు షాకింగ్ కలెక్షన్స్.. జాన్వీ కపూర్ మూవీకి ఎన్ని కోట్లంటే
బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్ధ్ మల్హోత్రా, అతిలోక్ సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పరం సుందరి. ఎప్పుడో రావాల్సిన ఈ సినిమా పలుమార్లుగా వాయిదా పడుతూ వచ్చింది. అనేక అడ్డంకులను దాటుకుని ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చింది. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ సినిమాను .. ఛావా వంటి బ్లాక్ బస్టర్ మూవీ నిర్మించిన మద్దూక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ నిర్మించారు. ఈ నేపథ్యంలో పరం సుందరి బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే ..
పరం సుందరి బడ్జెట్?
పరం సుందరిలో రెంజీ పానికర్, సిద్ధార్ధ శంకర్, మనోజ్ సింగ్, సంజయ్ కపూర్, ఇనయత్ వర్మలు కీలక పాత్ర పోషించారు. సచిన్- జిగర్ ద్వయం ఈ చిత్రానికి సంగీతం అందించగా.. శాంతన కృష్ణన్ రవిచంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. కేరళలోని అందమైన లోకేషన్స్ పాటు ముంబైలోని కీలక ప్రాంతాల్లో పరం సుందరి సినిమా షూటింగ్ జరిగింది.

స్వతహాగా మద్దూక్ సంస్థ ఓ సినిమాను నిర్మించేటప్పుడు నటీనటులకు రెమ్యునరేషన్ చెల్లించే విధానం మార్కెట్ విలువ కంటే తక్కువగా ఉంటుందని బాలీవుడ్‌లో చెప్పుకుంటూ ఉంటారు. నటీనటులు ఏ సినిమాకైనా పెద్ద మొత్తంలో పారితోషికాన్ని డిమాండ్ చేస్తారు. అయితే మార్కెట్‌లో ఉన్న దాని ప్రకారం నటులకు బయట 10 కోట్ల రూపాయలు పారితోషికాన్ని చెల్లిస్తే.. మద్దూక్ ఫిల్మ్స్ నుంచి మాత్రం 7 కోట్ల రూపాయలకు మించి డిమాండ్ చేయలేరని విశ్లేషకులు చెబుతున్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి పరం సుందరి సినిమాకు దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.
పరం సుందరి బ్రేక్ ఈవెన్ టార్గెట్
టీజర్, ట్రైలర్లతో పాటు జాన్వీ కపూర్, సిద్ధార్ధ్ మల్హోత్రాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రమోషనల్ కార్యక్రమాలతో పరం సుందరిపై హైప్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగినట్లుగా ట్రేడ్ పండితులు తెలిపారు. పరం సుందరి మూవీ లాభాల్లోకి రావాలంటే 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రావాలని వెల్లడించారు. ఈ సినిమాను ఇండియా వైడ్‌గా 2700 స్క్రీన్లలో విడుదల చేసినట్లుగా పేర్కొన్నారు.
పరం సుందరి తొలి రోజు కలెక్షన్స్
జాన్వీ కపూర్, సిద్ధార్ధ్ మల్హోత్రా జంటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. తొలి రోజు సాయంత్రం 5 గంటల వరకు హిందీలో 10 శాతం థియట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. సినిమా టాక్‌ను బట్టి రానున్నరోజుల్లో బుకింగ్స్ బాగా జరుగుతాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. తొలిరోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఉత్తరాది రాష్ట్రాలుల, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి జాన్వీ కపూర్ మూవీకి 7 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వస్తాయని భావిస్తున్నారు. వీకెండ్‌లో కలెక్షన్స్ బాగుంటాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది సైయారా చిత్రం సైలెంట్‌గా వచ్చి దాదాపు 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించిన నేపథ్యంలో ఇప్పుడు అందరిచూపు పరం సుందరిపై నెలకొంది.


Click it and Unblock the Notifications











