Param Sundari Day 2 Box Office: మిక్స్‌డ్ టాక్‌లోనూ వసూళ్ల జాతర.. జాన్వీ కపూర్ మూవీకి ఎన్ని కోట్లంటే?
తుషార్ జలోటా దర్శకత్వంలో సిద్ధార్ధ్ మల్హోత్రా, జాన్వీ కపూర్‌లు హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం పరం సుందరి. ఆగస్ట్ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మద్దూక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దినేష్ విజాన్ నిర్మించారు. ఈ నేపథ్యంలో పరం సుందరి బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? రెండో రోజు పరం సుందరి చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..
పరం సుందరి బడ్జెట్?
పరం సుందరిలో రెంజీ పానికర్, సిద్ధార్ధ శంకర్, మనోజ్ సింగ్, సంజయ్ కపూర్, ఇనయత్ వర్మలు కీలక పాత్ర పోషించారు. సచిన్- జిగర్ ద్వయం ఈ చిత్రానికి సంగీతం అందించగా.. శాంతన కృష్ణన్ రవిచంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి పరం సుందరి సినిమాకు దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

పరం సుందరి బ్రేక్ ఈవెన్ టార్గెట్
టీజర్, ట్రైలర్లతో పాటు జాన్వీ కపూర్, సిద్ధార్ధ్ మల్హోత్రాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రమోషనల్ కార్యక్రమాలతో పరం సుందరిపై హైప్ నెలకొంది. ఈ మూవీ లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 65 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రావాలని వెల్లడించారు. మరో చెన్నై ఎక్స్‌ప్రెస్‌గా బాలీవుడ్ విశ్లేషకులు అభివర్ణించిన ఈ సినిమాను ఇండియా వైడ్‌గా 2700 స్క్రీన్లలో విడుదల చేసినట్లుగా పేర్కొన్నారు.
పరం సుందరి తొలి రోజు కలెక్షన్స్
తొలిరోజు కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఉత్తరాది రాష్ట్రాలు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లలో కలిపి జాన్వీ కపూర్ మూవీకి వరల్డ్ వైడ్‌గా 8 కోట్ల రూపాయల ఓపెనింగ్స్ వచ్చాయి. మిక్స్‌డ్ టాక్‌తో బాక్సాఫీస్ జర్నీ ప్రారంభించిన పరం సుందరి 2025లో టాప్ బాలీవుడ్ ఓపెనర్లలో చోటు దక్కించుకోలేకపోయినప్పటికీ.. మద్దూక్ ఫిల్మ్స్ నిర్మించిన రొమాంటిక్ మూవీస్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన 4వ సినిమాగా నిలిచింది. అలాగే జాన్వీకపూర్ నటించిన సినిమాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో రెండో స్థానంలో నిలిచింది.
పరం సుందరి రెండో రోజు వసూళ్లు
వీకెండ్ కావడంతో పాటు మౌత్ టాక్ కారణంగా పరం సుందరికి శనివారం మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. వార్ 2, మహావతార్ నరసింహ, కూలీ సినిమల నుంచి ఈ సినిమాకు గట్టి పోటీ ఎదురవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. రెండో రోజు సాయంత్రం 6 గంటల వరకు జాన్వీ కపూర్ మూవీకి 14 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. రెండో రోజు ఈ సినిమా ఉత్తరాది రాష్ట్రాలలో 7 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయల చొప్పున పరం సుందరి సినిమా వరల్డ్ వైడ్‌గా 10 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేస్తుందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. దాంతో రెండ్రోజుల వరకు జాన్వీ కపూర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 20 కోట్ల రూపాయలు కలెక్ట్ చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











