Param Sundari Day 3 Box Office: జాన్వీ కపూర్ మేనియా.. పరం సుందరి మూవీకి 3వ రోజు ఎన్ని కోట్లంటే?
సిద్ధార్ధ్ మల్హోత్రా, జాన్వీ కపూర్‌లు హీరో హీరోయిన్లుగా తుషార్ జలోటా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా పరం సుందరి. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఛావా వంటి బ్లాక్‌బస్టర్ మూవీ నిర్మించిన మద్దూక్ ఫిల్మ్స్ అధినేత దినేష్ విజాన్ ఈ పరం సుందరి సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో పరం సుందరి బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? మూడో రోజు పరం సుందరి చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..
పరం సుందరి బడ్జెట్?
పరం సుందరిలో రెంజీ పానికర్, సిద్ధార్ధ శంకర్, మనోజ్ సింగ్, సంజయ్ కపూర్, ఇనయత్ వర్మలు కీలక పాత్ర పోషించారు. సచిన్- జిగర్ ద్వయం ఈ చిత్రానికి సంగీతం అందించగా.. శాంతన కృష్ణన్ రవిచంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి పరం సుందరి సినిమాకు దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

పరం సుందరి బ్రేక్ ఈవెన్ టార్గెట్
టీజర్, ట్రైలర్లతో పాటు జాన్వీ కపూర్, సిద్ధార్ధ్ మల్హోత్రాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రమోషనల్ కార్యక్రమాలతో పరం సుందరిపై హైప్ నెలకొంది. ఈ రొమాంటిక్ మూవీ లాభాల్లోకి రావాలంటే 65 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. భారీ అంచనాల నేపథ్యంలో పరం సుందరి సినిమాను ఇండియా వైడ్‌గా 2700 స్క్రీన్లలో విడుదల చేసినట్లుగా పేర్కొన్నారు.
పరం సుందరి రెండు రోజుల కలెక్షన్స్
పరం సుందరి చిత్రానికి ఇండియా వైడ్ రెండు రోజుల కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలి రోజు 8 కోట్ల రూపాయలు, రెండో రోజు 11 కోట్ల రూపాయలు చొప్పున ఇండియాలో 16.50 కోట్ల రూపాయల నెట్, 19 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. బాలీవుడ్‌కు స్ట్రాంగ్ బేస్ ఉన్న ఓవర్సీస్‌లోనూ పరం సుందరికి మరింత ఆదరణ లభిస్తోంది. నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలతో కలిపి ఓవర్సీస్ మార్కెట్‌లో పరం సుందరికి 8 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. దాంతో పరం సుందరికి రెండ్రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 27 కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చాయి.
పరం సుందరి మూడో రోజు వసూళ్లు
మూడో రోజు వీకెండ్ కావడంతో పరం సుందరి సినిమాకు మంచి బుకింగ్స్ జరుగుతున్నాయి. ఆదివారం జాన్వీ కపూర్ మూవీకి 18 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైంది. మూడో రోజు ఈ సినిమా ఉత్తరాది రాష్ట్రాలలో 8 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో 2 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 3 కోట్ల రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 13 కోట్ల రూపాయల గ్రాస్ రాబడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీంతో కలిపి పరం సుందరికి 3 రోజుల వరకు వరల్డ్ వైడ్‌గా 40 కోట్ల రూపాయలు వసూళ్లు వస్తాయని భావిస్తున్నారు. వీకెండ్ తర్వాత సోమవారం నుంచి ఈ సినిమాకు అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది.


Click it and Unblock the Notifications











