Param Sundari Day 5 Box Office: పరం సుందరికి షాకింగ్ కలెక్షన్స్.. జాన్వీకపూర్ మూవీ లాభాల్లోకి రావాలంటే?

సైయారా వంటి బ్లాక్‌బస్టర్ హిట్ బాలీవుడ్‌ను షేక్ చేసిన తర్వాత రిలీజైన మరో ప్రేమ కథా చిత్రం పరం సుందరి. మరో చెన్నై ఎక్స్‌ప్రెస్‌గా బాలీవుడ్ జనాలు భావించిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పరం సుందరిలో సిద్ధార్ధ్ మల్హోత్రా, జాన్వీ కపూర్‌లు హీరో హీరోయిన్లుగా నటించారు. తుషార్ జలోటా దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 29న ప్రేక్షకుల ముందుకొచ్చింది. మద్దూక్ ఫిల్మ్స్ బ్యానర్‌పై దినేష్ విజాన్ ఈ పరం సుందరి సినిమాను నిర్మించారు. ఈ నేపథ్యంలో పరం సుందరి బడ్జెట్ ఎంత? ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? ఐదో రోజు పరం సుందరి చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే..

పరం సుందరి బడ్జెట్?
పరం సుందరిలో రెంజీ పానికర్, సిద్ధార్ధ శంకర్, మనోజ్ సింగ్, సంజయ్ కపూర్, ఇనయత్ వర్మలు కీలక పాత్ర పోషించారు. సచిన్- జిగర్ ద్వయం ఈ చిత్రానికి సంగీతం అందించగా.. శాంతన కృష్ణన్ రవిచంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్, ప్రచార కార్యక్రమాలతో కలిపి పరం సుందరి సినిమాకు దాదాపు 60 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ పండితులు తెలిపారు.

Param Sundari Day 5 Expected Box Office Collections Worldwide Janhvi Kapoor s movie faces drop

పరం సుందరి బ్రేక్ ఈవెన్ టార్గెట్
టీజర్, ట్రైలర్లతో పాటు జాన్వీ కపూర్, సిద్ధార్ధ్ మల్హోత్రాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన ప్రమోషనల్ కార్యక్రమాలతో పరం సుందరిపై హైప్ నెలకొంది. ఈ రొమాంటిక్ మూవీ లాభాల్లోకి రావాలంటే 65 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని ట్రేడ్ పండితులు విలువ నిర్దేశించారు. భారీ అంచనాల నేపథ్యంలో పరం సుందరి సినిమాను ఇండియా వైడ్‌గా 3000 స్క్రీన్లలో విడుదల చేసినట్లుగా పేర్కొన్నారు.

పరం సుందరి 4 రోజుల కలెక్షన్స్
పరం సుందరి చిత్రానికి ఇండియా వైడ్ కలెక్షన్స్ పరిశీలిస్తే.. తొలి రోజు 7.50 కోట్ల రూపాయలు, రెండో రోజు 10 కోట్ల రూపాయలు, మూడవ రోజున 11 కోట్ల రూపాయలు, నాలుగో రోజున 3.50 కోట్ల రూపాయల చొప్పున ఇండియాలో 30 కోట్ల రూపాయల నెట్, 36 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సాక్‌నిక్ తెలిపింది. ఓవర్సీస్‌లోనూ జాన్వీ కపూర్- సిద్ధార్ధ్ మల్హోత్రా జోడీకి ఆదరణ లభిస్తోంది. నార్త్ అమెరికా, న్యూజిలాండ్, యూకే, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ తదితర దేశాలతో కలిపి ఓవర్సీస్‌లో పరం సుందరికి 20 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. దాంతో ఇండియాలో వచ్చిన 36 కోట్లు, ఓవర్సీస్ వసూళ్లు కలిపి పరం సుందరికి వరల్డ్ వైడ్‌గా 56 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది.

పరం సుందరి ఐదో రోజు వసూళ్లు
వీకెండ్ కావడంతో ఆదివారం వరకు పరం సుందరి సినిమా యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించింది. అయితే సోమవారం నుంచి ఈ సినిమాకు అసలు సిసలు పరీక్ష ప్రారంభమవుతుందని అంతా భావించారు. అయితే విశ్లేషకుల అంచనాలను తలక్రిందులు చేస్తూ సోమవారం ఈ టెస్టులో పాసైంది పరం సుందరి. 5వ రోజు జాన్వీ కపూర్ - సిద్ధార్ మల్హోత్రాల సినిమా ఎన్ని కోట్లు రాబట్టిందో చూస్తే.. 5వ రోజు మంగళవారం ఉదయం, మ్యాట్నీ షోలకు మందకొడిగా బుకింగ్స్ జరిగినట్లుగా నివేదికలు వస్తున్నాయి.

మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు 13 శాతం థియేట్రికల్ ఆక్యూపెన్సీ నమోదైనట్లుగా సాక్‌నిక్ తెలిపింది. ఐదో రోజు ఈ చిత్రం ఉత్తరాది రాష్ట్రాలలో 3 కోట్ల రూపాయలు, రెస్టాఫ్ ఇండియాలో కోటి రూపాయలు, ఓవర్సీస్‌లో కోటి రూపాయలు చొప్పున వరల్డ్ వైడ్‌గా 5 కోట్ల రూపాయల వసూళ్లు రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు భావిస్తున్నారు. దాంతో కలిపి 5 రోజుల వరకు పరం సుందరి సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 62 కోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X