twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    లాభం ఎంత?: 'పటాస్‌' 10 రోజుల కలెక్షన్స్ (ఏరియా వైజ్)

    By Srikanya
    |

    హైదరాబాద్: కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందిన 'పటాస్‌' చిత్రం 10 రోజుల క్రితం విడుదలై విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే . రచయితగా పలు చిత్రాలకి పనిచేసిన అనీల్ రావిపూడి ఈ చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమయ్యారు. ఈ చిత్రం మార్నింగ్ షో కే హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా పది రోజులకు 12 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం. ఈ చిత్రం థియోటర్ రైట్స్ మొత్తం 9 కోట్లు కు అమ్ముడు పోవటంతో ఆల్రెడీ మూడు కోట్లు లాభంలో ఉన్నట్లు. ఈ రేంజిలో కలెక్షన్స్ రావటం కళ్యాణ్ రామ్ కెరిర్ లో రికార్డే. ఈ 10 రోజుల్లో ఏరియావైజ్ ఎంత కలెక్షన్స్ వచ్చిందో చూద్దాం..

    పటాస్ 10 రోజుల కలెక్షన్స్ (షేర్) :

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    Patas Movie 10 days collections:3 crs profit!

    నైజాం: Rs 4.10 కోట్లు

    సీడెడ్ : Rs 1.93 లక్షలు

    వైజాగ్: Rs 1.05 లక్షలు

    గుంటూరు: Rs 95 లక్షలు

    కృష్ణా: Rs 75 లక్షలు

    తూర్పు గోదావరి జిల్లా: Rs 70 లక్షలు

    పశ్చిమ గోదావరి జిల్లా : Rs 60 లక్షలు

    నెల్లూరు : Rs 35 లక్షలు

    మొత్తం ఆంధ్రా,నైజాం కలిపి.. 10.43 కోట్లు

    ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ వీకెండ్ (షేర్) : రూ 11.73 crore (కర్ణాటక& దేశంలో మిగిలిన ప్రాంతాలు కలిపి: Rs 70 లక్షలు; ఓవర్ సీస్: Rs 60 లక్షలు)

    చిత్రం కథేమిటంటే....

    Patas Movie 10 days collections:3 crs profit!

    కళ్యాణ్ సిన్హా (కళ్యాణ్ రామ్) ఓ కరప్టడ్ పోలీస్ ఆఫీసర్. కావాలని హైదరాబాద్ ట్రాన్సఫర్ చేయించుకుని వచ్చిన అతను అక్కడ తన అధికారం ఉపయోగించి... సిటీలో లంచాలు,దందాలు చేస్తూంటాడు. అంతేకాదు హైదరాబాద్ డిజిపి కృష్ణ ప్రసాద్(సాయి కుమార్)కు,పోలీస్ డిపార్టమెంట్ కు శతృవైన విలన్ జీకె(అశుతోష్ రానా)కు తొత్తులా మారతాడు. అయితే అసలు కళ్యాణ్ సిన్హా ఎందుకలా ప్రవర్తిస్తున్నాడు... అతని గతం ఏమిటి...గతంలోని అసలు నిజం తెలిసిన అతను మంచివాడిగా మారి... విలన్ కు ఎలా పటాస్ లా మారి ట్విస్ట్ లు ఇస్తాడు...ఈ కథలో హీరోయిన్ పాత్ర ఏమిటి...సునామీ స్టార్ గా ఎమ్.ఎస్ నారాయణ పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

    అనీల్ రావి పూడి మాట్లాడుతూ... ''ఒక మాస్‌ కథతో దర్శకుడిగా పరిచయమైతే ఆ ప్రభావమే వేరుగా ఉంటుంది. ఆ విషయంలో వి.వి.వినాయక్‌గారే స్ఫూర్తి. దర్శకుల్లో వి.వి.వినాయక్‌ గారంటే ఇష్టం. ఆయన తీసిన తొలి సినిమా 'ఆది' స్ఫూర్తితోనే నేను 'పటాస్‌'లాంటి ఓ మాస్‌ కథని రాసుకొన్నా.అందుకే ఎన్ని ఇబ్బందులెదురైనా ఎంతో ఇష్టంగా రాసుకొన్న మొదటి కథతోనే సినిమా తీశా'' అన్నారు అనిల్‌ రావిపూడి.

    కథ గురించి చెప్తూ... ''ఒక అవినీతి పోలీసు అధికారి కథ ఇది. ఎప్పుడూ వసూళ్ల ధ్యాసలోనే గడిపే ఆ పోలీసు ఎలా మారాడన్నది తెరపైనే చూడాలి. పటాస్‌ అంటే టపాకాయ పేరు. అది చాలా గట్టిగా పేలుతుంది. ఇందులో హీరో పాత్ర తీరు కూడా అలాగే ఉంటుంది. ఈ కథలో వినోదమూ కీలకమే. కల్యాణ్‌రామ్‌ తెరపై కనిపించే విధానం కొత్తగా ఉంటుంది'' అన్నారు.

    Patas Movie 10 days collections:3 crs profit!

    తన ప్రస్దానం వివరిస్తూ... ''ఇంజినీరింగ్‌ అయ్యాక దర్శకుడు కావాలనే పరిశ్రమలోకి అడుగుపెట్టాను. సహాయ దర్శకుడిగా, రచయితగా పలు చిత్రాలకు పనిచేశాను. 'శంఖం', 'శౌర్యం', 'దరువు', 'కందిరీగ', 'అలా మొదలైంది', 'మసాలా', 'ఆగడు' తదితర చిత్రాలు రచయితగా మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. 2012లో పక్కాగా మాస్‌ అంశాలతో కూడిన కథ రాసుకొని కల్యాణ్‌రామ్‌గారికి వినిపించాను. ఆయన అప్పుడు 'ఓం' చేస్తున్నారు. మొదట కథ విన్నాక 'చాలా బాగుంది. వేరే హీరోతో ఈ సినిమా నేను నిర్మిస్తా' అన్నారు. 'ఈ కథలో మీరు నటిస్తే బాగుంటుంది, నన్ను నమ్మండి' అని చెప్పా. దీంతో ఆయన ఈ సినిమా చేయడానికి ఒప్పుకొన్నారు'' అన్నారు.

    ఇక నందమూరి అభిమానులకి మళ్లీ సంక్రాంతి సందడి మొదలైనట్టుగా ఈ సినిమా వినోదాల్ని పంచుతుంది. ప్రస్తుతానికి 'పటాస్‌' విడుదలపైనే నా దృష్టంతా. ఆ తర్వాతే కొత్త సినిమా గురించి ఆలోచిస్తా అని చెప్పుకొచ్చారు.

    కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ''యాక్షన్‌ ప్రధానంగా సాగే చిత్రమిది. కథలో వినోదానికీ చోటుంది. రొమాంటిక్‌ , యాక్షన్‌, మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకొంది. సాయికార్తీక్‌ మంచి సంగీతాన్ని అందించారు. భారీ హంగులతో రూపుదిద్దుకొంటున్న ఈ చిత్రం ఇంటిల్లిపాదినీ అలరిస్తుంది'' అన్నారు. శ్రుతి సోధి పంజాబీ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకొంది శ్రుతి. అటు అందంగా కనిపించడంతోపాటు ఇటు నటనలోనూ రాణిస్తోంది. చిత్రంలో కల్యాణ్‌రామ్‌ పోలీసు అధికారిగా కనిపిస్తారు. కథలో మలుపులు రక్తికట్టించేలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది.

    సాయికుమార్‌, బ్రహ్మానందం, అశుతోష్‌ రాణా, ఎమ్మెస్‌ నారాయణ, శ్రీనివాసరెడ్డి, జయప్రకాశ్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి తదితరులు నటించిన ఈ చిత్రానికి ఫొటోగ్రఫీ: సర్వేశ్‌ మురారి, ఎడిటింగ్‌: తమ్మిరాజు, రచనా సహకారం: ఎస్‌.కృష్ణ, నిర్మాత: నందమూరి కల్యాణ్‌రామ్‌, కథ, మాటలు, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: అనిల్‌ రావిపూడి.

    English summary
    Nandamuri Kalyan Ram’s recent outing `Patas` finished ten days run at BO and the film collected nearly 12 crores worldwide. As there is no perfect competition nearby Patas expected to continue dominate Boxoffice this week too.the film theatrical rights sold for 9 crores and distributors already recovered their investment.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X