Pathaan 12 days collections మరో చరిత్ర సృష్టించిన పఠాన్.. దంగల్ రికార్డు బ్రేక్.. బాహుబలి2 ఇక టార్గెట్!
బాలీవుడ్ బాద్షా, సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీని కొనసాగిస్తున్నది. ఈ చిత్రం రెండో వారాంతంలో కూడా భారీ కలెక్షన్లు రాబట్టింది. హిందీ సినీ పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డును సొంతం చేసుకొనేందుకు పరుగులు పెడుతున్నది. హిందీ వెర్షన్ విషయానికి వస్తే.. గత 11 రోజుల్లో 384 కోట్లు రాబట్టిన ఈ చిత్రం ప్రస్తుతం 400 కోట్ల క్లబ్‌లో చేరింది. ఇక 12వ రోజు కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

10 ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్
పఠాన్‌కు ముందు షారుక్ ఖాన్ నటించిన చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 2003లో షారుక్‌కు ఘన విజయం అందించిన చెన్నై ఎక్స్‌ప్రెస్. ఆ సినిమా తర్వాత అంటే పదేళ్లలో అన్నీ ఫ్లాపులుగానే నిలిచాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నది. ఇండియాలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచేందుకు బాక్సాఫీస్ రేసులో పరుగులు పెడుతున్నది.

దంగల్ రికార్డులు స్మాష్
రిపబ్లిక్ డే కానుకగా వచ్చిన పఠాన్ చిత్రం హిందీ సినిమా పరిశ్రమలో అన్ని రికార్డులను తుడిచిపెట్టే దిశగా ముందుకెళ్తున్నది. ఈ చిత్రం హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో దంగల్ సాధించిన రికార్డులను అధిగమించింది. ఇండియాలోనే ఏకంగా 400 కోట్లు వసూలు చేసిన చిత్రంగా పఠాన్ బాక్సాఫీస్ ఘనతను సాధించింది. ఇక ముందు కేజీఎఫ్2, బాహుబలి2 రికార్డులను అధిగమించేందుకు సిద్దమైంది.

ముంబైలో 100 కోట్లు
ముంబై మహా నగరంలో పఠాన్ చిత్రం రికార్డులను తిరగరాస్తున్నది. కేవలం ముంబై నగరంలోనే 100 కోట్లు సాధించిన చిత్రంగా బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసింది. 12వ రోజు నాటికి ఈ చిత్రం 118 కోట్లు వసూలు చేసింది. ముంబైలో అమీర్ ఖాన్ దంగల్, పీకే, సల్మాన్ ఖాన్ చిత్రం టైగర్ జిందా హై సినిమాల కలెక్షన్లను అధిగమించింది. ముంబైలో అత్యధిక వసూళ్లు సాధించిన కేజీఎఫ్2, బాహుబలి2 సినిమాల రికార్డులను పఠాన్ గురిపెట్టాడు.

బాహుబలి2 రికార్డుపై పఠాన్ గురి
హిందీ బాక్సాఫీస్ వద్ద ఇండియా వైడ్‌గా ఇప్పటి వరకు బాహుబలి2 సినిమాదే అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు ఉంది. బాహుబలి2 చిత్రం ఇండియాలో 511 కోట్ల రూపాయలు సాధించి నంబర్ వన్ స్థానంలో ఉంది. అయితే ఇండియాలో బాహుబలి2 రికార్డును పఠాన్ చిత్రం అధిగమించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఇండియాలో హయ్యెస్ట్ కలెక్షన్లు
పఠాన్ చిత్రం రెండో అదివారం అంటే.. రిలీజైన తర్వాత 12వ రోజున కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. ఇండియాలో ఈ చిత్రం ఫిబ్రవరి 5వ తేదీన 28 కోట్ల మేర వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం 400 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం 428 కోట్లు మేర షేర్, 481 కోట్ల గ్రాస్ వసూళ్లను ఇండియన్ బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది.

ప్రపంచవ్యాప్తంగా 12 రోజుల పఠాన్ వసూళ్లుల
ఇండియాలో 500 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్న పఠాన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 781 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్‌లో ఈ చిత్రం 300 కోట్లు రాబట్టింది. రెండో వారాంతం ముగిసే సమయానికి హిందీలో 415 కోట్లు, తెలుగులో 10 కోట్లు, తమిళంలో 5 కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఈ చిత్రం త్వరలోనే 1000 కోట్ల వసూళ్లను టచ్ చేసే ఛాన్స్ కనిపిస్తున్నది.


Click it and Unblock the Notifications











