OG Box Office Recovery: 3 రోజుల్లో OG రికవరీ కలెక్షన్లు.. పవన్ కళ్యాణ్ ఎన్ని కోట్లు తిరిగి రాబట్టారంటే?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG చిత్రం సెప్టెంబర్ 25న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో వరల్డ్ వైడ్ గా విడుదలైంది. యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వానికి ఫ్యాన్స్ నుంచే కాకుండా నార్మల్ ఆడియెన్స్ నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. మరోవైపు ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపిస్తూ సంచలనంగా మారింది. ఆంధ్రా, తెలంగాణతో పాటు సౌత్ అంతటా ప్రస్తుతం OG హవానే నడుస్తోంది. నార్త్ ఇండియాలోనూ OG పవనం రోజురోజుకు పెరుగుతోంది. మరోవైపు ఓవర్సీస్ లో OG చిత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పేలా బాక్సాఫీస్ వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో OG సినిమా బడ్జెట్ ఎంత? ఏరియా వైజ్ గా ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎన్ని కోట్లు? 3 రోజుల్లో ఎంత రికవరీని సాధించింది? ఇంకెంత రాబడితే వరల్డ్ వైడ్ గా, ఆంధ్రా, తెలంగాణలో క్లీన్ హిట్ సాధించనుందనే వివరాల్లోకి వెళితే..
OG మూవీ బడ్జెట్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో పాటు ఇండియాలోని టాప్ స్టార్స్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ నుంచి ఇమ్రాన్ హష్మీ, జాకీ ష్రాఫ్, ఉపేంద్ర లిమయి, హరీష్ ఉత్తమన్, అభిమాన్యు సింగ్, కోలీవుడ్ నుంచి అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, టాలీవుడ్ నుంచి శుభలేఖ సుధాకర్, ప్రకాశ్ రాజ్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషించారు. ఇక టాప్ టెక్నీషియన్లు రవి కే చంద్రన్, మనోజ్ పరమహంస సినిమాటోగ్రాఫర్లుగా, నవీన్ నూలి ఎడిటర్ గా, ఎస్ఎస్ థమన్ సంగీత దర్శకుడిగా పనిచేశారు. టాలీవుడ్ టాప్ ఫిల్మ్ ప్రొడక్షన్ కంపెనీ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్ లో నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, నిర్మాణ ఖర్చులు, ప్రచార కార్యక్రమాలతో కలుపుకొని సనిమాకు రూ.250 కోట్ల బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

OG ప్రీ రిలీజ్ బిజినెస్? బ్రేక్ ఈవెన్ టార్గెట్?
పవన్ కళ్యాణ్ OG సినిమాకు ఉన్న హైప్‌తో తెలుగు స్టేట్స్, ఇండియా వైడ్ గా, ఓవర్సీస్ లోనూ భారీగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఆంధ్రా థియేట్రికల్ రైట్స్ రూ.80 కోట్లకు, సీడెడ్ రూ.22 కోట్లకు, నైజాం రూ.55 కోట్లకు అమ్ముడుపోయాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో రూ.157 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. కర్ణాటక నుంచి రూ.8 కోట్లు, తమిళ+కేరళ నుంచి రూ.3 కోట్ల వ్యాపారం జరిగింది. ఒక ఓవర్సీస్ లో నార్త్ అమెరికా రైట్స్ ద్వారా రూ.25.5 కోట్లు అందింది. తెలుగు స్టేట్స్ + ఇండియాలోని మిగితా రాష్ట్రాలు + ఓవర్సీస్ కలుపుకొని వరల్డ్ వైడ్ గా రూ.193.5 కోట్ల ప్రీ రిలీజ్ జరిగిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు.
ఏరియా వైజ్ OG మూవీ 3 రోజుల రికవరీ కలెక్షన్లు?
తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 3 రోజుల్లో రూ.118 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయ్యింది. ఏపీ+టీజీకి రూ.174 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను ట్రేడ్ నిపుణులు నిర్ణయించారు. కాగా ఇంకా రూ.55 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ పూర్తి అవుతుంది. ఇప్పటి వరకు 65 % రికవరీని సాధించింది. ఇక ఓవర్సీస్ నార్త్ అమెరికాలో 4.5 మిలియన్ డాలర్లు బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా ఉంది. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.40 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించాలి. ఇక అక్కడ నుంచి 3 రోజుల్లో 57 కోట్ల వరకు గ్రాస్ వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఈ లెక్కన ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ పూర్తై.. 17వరకు లాభాల్లోన్నే ఉంది. ఓవర్సీస్ లో 40 శాతం వరకు ప్రాఫిట్ ను అందుకుంది.
ఇక కర్ణాటకలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 16 కోట్లు సాధించాల్సి ఉంది. కాగా 3 రోజుల్లో రూ.13 కోట్ల గ్రాస్ వసూల్ చేసింది. అంటే 85% రికవరీని సాధించిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. మరోవైపు తమిళనాడు+కేరళ కలుపుకొని రూ.6 కోట్ల గ్రాస్ వసూల్ చేస్తే బ్రేక్ ఈవెన్ పూర్తి కానుంది. కాగా ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి 3 రోజుల్లో రూ.4 కోట్ల వరకు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. దీంతో ఇక్కడ 65% రికవరీని సాధించిందని తెలుస్తోంది. వరల్డ్ వైడ్ గా రూ.400 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయాల్సి ఉంది. ఇక ఈ చిత్రం 3 రోజుల్లో రూ.200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ లెక్కన కేవలం 3 రోజుల్లోనే 50% రికవరీని సాధించిందని ట్రేడ్ నిపుణులు తెలుపుతున్నారు. ఇక మొదటి వారంలోనే OG లాభాల భాటలోకి రానుందని అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











