OG USA Collections: కూలీ, వార్ 2 లైఫ్ టైమ్ కలెక్షన్లు బ్రేక్.. యూఎస్‌లో OG మూవీ రికార్డు!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ గా నటించిన గ్యాంగ్ స్టార్ ఫిలిం OG. ఈ చిత్రానికి యంగ్ అండ్ సెన్సేషనల్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లో ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరించడం విశేషం. సెప్టెంబర్ 25న ఈ చిత్రం ఇండియా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలతో పాటు ఓవర్సీస్ లోనూ భారీ స్థాయిలో విడుదలైంది. ఈ క్రమంలో ఓవర్సీస్ నుంచి అందుకుంటున్న బాక్సాఫీస్ కలెక్షన్లు ఆసక్తికరంగా మారాయి.
తాజాగా OG చిత్రం యూఎస్ఏలో రజనీకాంత్ కూలీ, జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ కలిసిన నటించిన మల్టీ స్టారర్ మూవీ వార్ 2 బాక్సాఫీస్ రికార్డులను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG చిత్రం తాజాగా బ్రేక్ చేసింది. ఇప్పటికే నార్త్ అమెరికాలో OG చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను కూడా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అక్కడ లాభాల బాటలో పయనిస్తుంది. ఈ క్రమంలో పలు రికార్డులను కూడా చెరిపేస్తోంది.

యూఎస్ఏ లోని నార్త్ అమెరికాలో ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి 2 చిత్రం ద్వారా 20 మిలియన్ల డాలర్లను సాధించి టాప్ లో నిలిచారు. ఇక OG ఆ రికార్డు దిశగా పయనిస్తుంది. 4 రోజుల్లో OG చిత్రం నార్త్ అమెరికా బాక్సాఫీస్ వద్ద 5 మిలియన్ల డాలర్లను వసూల్ చేసి సెన్సేషన్ గా మారింది. ఇక మున్ముందు ఎలాంటి వసూలను రాబడుతుందనేది ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
ఈ క్రమంలో OG చిత్రం కూలీ, వార్ 2 చిత్రాల లైఫ్ టైం నార్త్ అమెరికాలోని వసూళ్లను కేవలం 4 రోజుల్లోనే దాటేసింది. రజనీకాంత్ కూలీ చిత్రం నార్త్ అమెరికాలో 1.8 మిలియన్ల డాలర్లను మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. ఇక జూనియర్ ఎన్టీఆర్ మల్టీ స్టారర్ ఫిలిం వార్ 2 చిత్రం కేవలం 830k యూఎస్ డాలర్లకే పరిమితం అయ్యిందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ఈ కలెక్షన్లు అక్కడ థియేట్రికల్ గా ఫుల్ రన్ లో వసూల్ చేసినవి కావడం గమనార్హం. ఇక OG మాత్రం మొదటి వీకెండ్ లోనే ఈ సినిమాల కలెక్షన్లను దాటేసింది.
మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ OG చిత్రం ద్వారా నార్త్ అమెరికాలో రిలీజ్ కు ముందే 2.5 మిలియన్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం విశేషం. ఇక ఇప్పుడు అంతకు రెట్టింపుగా 5 మిలియన్ల డాలర్లను కేవలం 4 రోజుల్లోనే వసూల్ చేయడం ఓవర్సీస్ ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేవలం పవన్ కళ్యాణ్ క్రేజ్, సుజీత్ మార్క్ డైరెక్షన్ తోనే ఈ స్థాయిలో వసూళ్లు అందుతున్నాయని తెలుపుతున్నారు. ఇప్పటి వరకు OG చిత్రం వరల్డ్ వైడ్ గా రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను అందుకుందని వెల్లడిస్తున్నారు.


Click it and Unblock the Notifications











