»   » ‘కాటమరాయుడు’రిలీజ్ ప్లాన్ మారింది, ముందే వచ్చేస్తున్నాడు

‘కాటమరాయుడు’రిలీజ్ ప్లాన్ మారింది, ముందే వచ్చేస్తున్నాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: పవన్‌ కల్యాణ్‌ హీరోగా నార్త్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెరకెక్కిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. డాలీ దర్శకుడు. శ్రుతిహాసన్‌ హీరోయిన్. శరత్‌మరార్‌ నిర్మాత. రెండు పాటలు, కొన్ని సన్నివేశాలు మినహా షూటింగ్ పూర్తయింది. ఈ చిత్రం అనుకున్న తేదీ కన్నా ముందే వచ్చేస్తోందని సమాచారం. ముందనుకున్నట్లుగా మార్చి 28న ఉగాది రోజు కాకుండా అంతకు ముందే అంటే... మార్చి 24నే 'కాటమరాయుడు' విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.

'' 'కాటమరాయుడు' టీజర్‌ ఇటీవలే విడుదలైంది. ప్రచార చిత్రానికి వచ్చిన స్పందన మాలో మరింత ఉత్సాహాన్ని నింపింది. అంతకు పదింతలు 'కాటమరాయుడు' వినోదాన్ని అందిస్తాడు. మార్చిలోనే పాటల్ని విడుదల చేస్తాము. మార్చి 10 నాటికి నిర్మాణానంతర కార్యక్రమాలతో సహా సినిమా పూర్తవుతుంది. 'అని దర్శక నిర్మాతలు తెలిపారు.మరో ప్రక్క 'కాటమరాయుడు' సినిమా నైజాం డిస్ట్రిబ్యూషన్‌ హక్కులను హీరో నితిన్‌ సొంతం చేసుకోవటంతో బిజినెస్ సర్కిల్స్ లో సినిమాపై క్రేజ్ రెట్టింపైంది. ఫిల్మ్ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం..ఈ చిత్రం నైజాం హక్కులు ఇరవై కోట్లకి తీసుకున్నారని తెలుస్తోంది. అలాగే ఆ ఇరవై కోట్లలో రెండు కోట్లు రికవరబుల్‌ అని తెలిసింది. అంటే లెక్క ప్రకారం...ఈ సినిమాపై నితిన్‌ ప్లస్‌ ఏషియన్‌ వాళ్ల రిస్క్‌ పద్ధెనిమిది కోట్లు. సగం ఏషియన్ వాళ్లు షేర్ చుసుకంటారు కనుక నితిన్‌ పై తొమ్మిది కోట్లు రికవరీ భాధ్యత ఉంటుంది. అయితే సినిమా ఓ మోస్తరుగా ... యావరేజ్‌ టాక్ తెచ్చుకున్నా ఈ అమౌంట్‌ తిరిగి వచ్చేస్తుంది.ఇక 'కాటమరాయుడు' చిత్రం టీజర్‌కు యూట్యూబ్‌లో విశేష స్పందన లభిస్తోంది. 'ఎంత మంది ఉన్నారన్నది ముఖ్యం కాదు.. ఎవడు ఉన్నాడన్నది ముఖ్యం' అంటూ ఫిబ్రవరి 4న విడుదల చేసిన ఈ టీజర్‌ ఇప్పటికీ యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో మొదటి స్థానంలో ఉంది. దాంతో ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనే అంచనాలు అంతటా ఉన్నాయి. ముఖ్యంగా నైజాం ఏరియాలో పవన్ కు ఓ రేంజిలో ఫాలోయింగ్ ఉంది. ఖచ్చితంగా నితిన్ కు ఈ సినిమా లాభాలు తెచ్చి పెడుతుందని ట్రేడ్ లో లెక్కలు వేస్తున్నారు.ఇందులో పవన్‌ ఈ పవర్‌ఫుల్‌ డైలాగ్‌ చెబుతూ కనిపించారు. టీజర్‌లో 'రాయుడూ..' అంటూ వస్తున్న నేపథ్య సంగీతం ఆకట్టుకుంటోంది.
దీంతో అభిమానులు ఈ టీజర్ ను సోషల్ మీడియాలో షేర్ ట్రెండ్ చేస్తూ తెగ సందడి చేస్తున్నారు.


Pawan Kalyan’s “Katama Rayudu” Release date changed


శ్రుతిహాసన్‌ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరా మన్ గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్ దర్శకత్వం: కిషోర్ పార్ధసాని

English summary
Pawan Kalayn’s forthcoming Film ‘Katama Rayudu’ which is now busy in shooting is slated to hit theaters on 24th of March- 2017.The film features Pawan Kalyan and Shruti Haasan in lead roles. It is a remake of Ajith’s Tamil Movie Veeram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu