»   » బాహుబలికి ధీటుగా కాటమరాయుడు బిజినెస్..

బాహుబలికి ధీటుగా కాటమరాయుడు బిజినెస్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న పవన్ కల్యాణ్ తాజా చిత్రం కాటమరాయుడు బిజినెస్ రికార్డు స్థాయిలో జరిగినట్టు వార్తలు వెలువడుతున్నాయి. సిడెడ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్మినట్టు ఫిలింనగర్ ప్రచారం జరుగుతున్నది.

Pawan Kalyan's Katamarayudu business done record level

పలు సంచలనాలు సృష్టించిన బాహుబలి రేంజ్ తగినట్టుగా కాటమరాయుడు బిజినెస్ జరిగినట్టు తెలుస్తున్నది. పవన్ కల్యాణ్ గత చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్ దారుణ పరాజయం తర్వాత కూడా కాటమరాయుడు బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగడం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.

తమిళ చిత్రం 'వీరం'కు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఉగాదికి విడుదలయ్యేందుకు సిద్ధమవుతున్నది. పవన్ సన్నిహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.

English summary
Pawan Kalyan Latest movie Katamarayudu's ceded rights sold record level. this movie is remake of Tamil Veeram.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu