For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్చ్...పవన్ ఫ్యాన్స్ కిది బ్యాడ్ న్యూసే

  By Srikanya
  |

  హైదరాబాద్ : పవన్ సినిమా ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తూంటారు. అయితే ఆయన ఈ సారి తన ఫ్యాన్స్ ని నిరాశపరచదలుచుకున్నట్లున్నారు. అభిమానులు అంతా ఎదురుచూస్తున్నట్లుగా ఆయన తాజా చిత్రం గోపాల గోపాల..సంక్రాంతికి రావటం లేదని ట్రేడ్ వర్గాల సమాచారం. మరో ఇరవై రోజులు షూటింగ్ బ్యాలెన్స్ ఉందని, ముఖ్యంగా ఇంకా పవన్ పై సీన్స్ చిత్రీకరించాల్సి ఉందని తెలుస్తోంది. మరో ప్రక్కన పవన్ పాత్రకు సంభందించిన గ్రాఫిక్స్ వర్క్ కూడా ఇంకా పూర్తికాలేదని చెప్తున్నారు. దాంతో ఎంత స్పీడుగా ఫినిష్ చేసినా సంక్రాంతికి కష్టమే అంటున్నారు. అయితే దర్శక,నిర్మాతలు మాత్రం ఎట్టి పరిస్దితుల్లో సంక్రాంతికి విడుదలచేయాలనే కృత నిశ్చయింతో ఉన్నట్లు చెప్తున్నారు.

  వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్న చిత్రమిది. కిషోర్‌కుమార్‌ పార్థసాని (డాలీ) దర్శకత్వం వహిస్తున్నారు. శరత్‌ మరార్‌, సురేష్‌బాబు నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ''దేవుడికీ మానవుడికీ జరిగిన సంఘర్షణ ఇది. పవన్‌ పాత్ర తీరుతెన్నులు, ఆయన పలికే సంభాషణలు ప్రధాన ఆకర్షణ'' అని దర్శక,నిర్మాతలు చెప్తున్నారు.

  సృష్టి లయలకు కారణం నేనే. సమస్త లోకాన్నీ నేనే నడిపిస్తున్నా.. అని కృష్ణుడు గీతోపదేశం చేశాడు కదా.. అయితే నా కష్టాలకూ ఆయనే బాధ్యుడు..'' అంటూ లాజిక్‌ తీశాడొకాయన. అక్కడితో ఆగలేదు. కోర్టు మెట్లెక్కాడు. న్యాయశాస్త్రంలోనూ ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదు. చివరికి ఆ కృష్ణుడే దిగి సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ కథెలా నడిచిందో తెలియాలంటే 'గోపాల గోపాల' చూడాల్సిందే. పవన్ కళ్యాణ్ పాత్ర చిత్రంలో 45 నిముషాలు మాత్రమే ఉంటుందని అన్నారు.

  Pawan's Gopala Gopala out of sankranthi race

  చిత్రం కథ విషయానికి వస్తే..

  దేవుడంటే నమ్మకం లేని ఓ వ్యక్తి దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది.

  బిజినెస్ విషయానికి వస్తే...

  పవన్ కళ్యాణ్ కి నైజాం ఏరియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే అక్కడ ఆయన సినిమాలు రికార్డులు బ్రద్దలు కొడుతూంటాయి. గబ్బర్ సింగ్ 17 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేస్తే, తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది దాదాపు 24 కోట్లు షేర్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో ఇప్పుడు పవన్ తాజా చిత్రం 'గోపాల గోపాల' కి ఆ ఏరియాలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

  అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం 'గోపాల గోపాల' నైజాం రైట్స్ ని 14 కోట్లకు అమ్ముడైంది. ప్రశాంత్ ఫిల్మ్ వారు ఈ ఏరియా పంపిణీ హక్కులు పొందారు. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం థియోటర్ వరకూ...55 కోట్లు చేసిందని ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. నిర్మాత సురేష్ బాబు, శరద్ మరారా లు దాదాపు 20 కోట్లు వరకూ టేబుల్ ప్రాఫెట్ ని లబ్ది పొందుతున్నారని టాక్. ముఖ్యంగా పవన్ గత చిత్రం అత్తారింటికి దారేది కన్నా ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువ కావటం కలిసి వచ్చే అంశం.

  అలాగే...పవన్‌ కోసం ఓ బైక్‌ను అమెరికా నుంచి దిగుమతి చేశారని తెలిసింది. అన్ని పనులు పూర్తిచేసి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు.

  English summary
  Venkatesh, Pawan Kalyan's ‘Goala Gopala’ is out of Sankranthi race. Dolly is directing the film for which Anup Rubens is the music director. Shriya and Mithun Chakraborthy are starring in the film. It is produced by D.Suresh Babu and Sharath Marrar under the banner Suresh productions and North Star productions.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X