twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అప్పుడే వంద కోట్ల పీకింది..'గబ్బర్' ని దాటేసింది

    By Srikanya
    |

    ముంబై: హిందీలో ఇప్పుడు వంద కోట్లు సినిమాలు కామన్ అయ్యిపోయాయి. మరీ చెత్తగా ఉంటే తప్ప....స్టార్ హీరో ఉంటే చాలు వంద కోట్లు వచ్చిపడిపోతున్నాయి. అయితే చిన్న సినిమాలకు ఆ అవకాసం లేదు. కానీ అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె ప్రధాన పాత్రల్లో రూపొందిన 'పీకూ' ప్రపంచవ్యాప్తంగా మంచి విజయం సాధించింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.107 కోట్లు వసూలు చేసింది. దేశంలో రూ. 80 కోట్లు మార్కు అందుకొంది.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    అలాగే.... ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా నిలిచింది. తొలి రెండు స్థానాల్లో 'బేబీ' (రూ.95.5 కోట్లు), 'గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌' (ఠాగూర్ రీమేక్) ...(రూ.80.25 కోట్లు) ఉన్నాయి. కథాప్రాధాన్యమున్న చిత్రం కావడం, మరోవైపు గతవారం సరైన సినిమాలు రాకపోవడంతో 'పీకూ' సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి స్థానంలో నిలిచింది అంటున్నారు బాలీవుడ్‌ పరిశీలకులు.

    క్రితం శుక్రవారం రణబీర్ కపూర్, అనుష్క శర్మ నటించిన 'బోంబే వెల్వెట్' చిత్రం విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీని తట్టుకుని రెండవ వారంలో కూడా 'పీకూ' స్ట్రాంగ్ గా నిలబడింది. కథాబలంతో స్టార్ ఇమేజ్ బేస్ చేసుకుని సుజిత్ సర్కార్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టడం శుభ పరిణామమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. భవిష్యత్లో ఈ తరహా చిత్రాలు మరిన్ని రావడానికి పీకూ ప్రోత్సాహం అందించిందని చెప్తున్నారు.

    Piku touches Rs 100cr mark, scorches Bombay Velvet

    ఇంతకీ ఈ 'పీకూ' ఎవరూ అంటే...

    మనకు రెగ్యులర్ గా కనిపించే అమ్మాయే. ఓ చేతిలో ఆఫీసు ఫైళ్లు, మరో చేతిలో ఇంటికి అవసరమైన నిత్యావసర వస్తువులు... ఇదీ సాయంత్రమైతే పీకూ గెటప్. ఉదయమంతా పని చేసి సాయంత్రమయ్యేసరికి ఇంట్లో పనులు చూడాలి. దిల్లీ మహానగరంలో ఆర్కిటెక్ట్‌గా పని చేస్తూ తన తండ్రితో జీవిస్తుంటుంది పీకూ. ఎవరినైనా ఎదిరించి అవసరమైతే నాలుగు దెబ్బలేయగల ధైర్యం ఉన్న అమ్మాయి.

    తండ్రి భాస్కర్‌ చౌదరి అలియాస్‌ బాబా అంటే చాలా ప్రేమ. వయసుపైబడిన తండ్రిని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటుంది. ఇక్కడిదాకా అంతా బాగానే ఉంది. బాబా దగ్గరికొచ్చేసరికే అసలు మజా మొదలవుతుంది. ఆయనకు చాదస్తంతోపాటు చెవుడూ ఉంది. ఆ రెండింటితో పీకూను తెగ విసిగిస్తాడు. దీన్ని పీకూ సరదాగా తీసుకొన్నా ఒక్కోసారి నాన్న మీద గయ్యిమంటుంది. అయినా పీకూనే బాబాకి బెస్ట్‌ డాటర్‌... బాబానే పీకూకి బెస్ట్‌ ఫాదర్‌. అలాంటి వీరిద్దరూ దిల్లీ నుంచి సొంత ప్రాంతం కోల్‌కతాకు ప్రయాణం కడతారు ఈ సమయంలోనే వీరికి రాణా కలుస్తాడు. అసలీ రాణా ఎవరు? పీకూ, బాబాల ప్రయాణం ఎలా సాగిందో నేడు విడుదలవుతున్న 'పీకూ'లో చూడాలి.

    దర్శకుడు సూజిత్‌ సర్కార్ మాట్లాడుతూ....‌''తండ్రీ కూతుళ్ల మధ్య బంధాన్ని వివరిస్తూ గతంలో చాలా సినిమాలొచ్చాయి. ఇదీ ఆ అంశం మీద నడిచే సినిమానే. అయితే కొంచెంసేపు నవ్వించి కాసేపు కంటతడిపెట్టించి... జీవితమంటే ఏంటో చూపించే సినిమా ఇది. పీకూ, బాబాలాంటి వాళ్లు మన చుట్టూ చాలా మంది ఉన్నారు. అలాంటివారి కథే ఈ సినిమా. తండ్రీ కూతుళ్ల బంధాన్ని నా శైలిలో ఆవిష్కరించా'' అన్నారు.

    దీపికా మాట్లాడుతూ... చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రంలో నేను తమిళ యువతిగా నటించాను. రామ్‌లీలాలో గుజరాతీ మహిళగా, హ్యాపీ న్యూఇయర్‌లో మహారాష్ట్ర యువతిగా నటించాను. నాకు గుజరాతీ, మరాఠి భాషలపై కొంత పట్టుంది. అందుకే ఆ సినిమాల సమయంలో భాష నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు. అయితే చెన్నై ఎక్స్‌ప్రెస్ సినిమా చేసినప్పుడు తమిళం నేర్చుకున్నాను. అదే విధంగా పీకూ చిత్రం కోసం బెంగాలీ నేర్చుకుంటున్నాను. కొత్త భాషను నేర్చుకోవడం సవాలులాంటిది. కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే కాకుండా స్థానిక బెంగాలీ వాళ్లతో మాట్లాడటం వల్ల త్వరగా భాషను నేర్చుకోవచ్చు. బెంగాలీ భాషలో పర్‌ఫెక్షన్ సాధిస్తాననే నమ్మకముంది అని చెప్పింది.

    ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ కూడా పొడవాటి జుట్టు, పెద్ద పొట్టతో డిఫరెంట్ లుక్ లో దర్శనమిస్తున్నాడు. అమితాబ్‌ బచ్చన్‌, దీపికా పదుకొణె, ఇర్ఫాన్‌ ఖాన్‌, మౌసమీ ఛటర్జీ ముఖ్య పాత్రధారులు. 'విక్కీ డోనర్‌', 'మద్రాస్‌ కేఫ్‌' వంటి చిత్రాలతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరుగాంచిన సూజిత్‌ సర్కార్‌ ఈ చిత్ర దర్శకుడు.

    English summary
    The domestic and overseas gross collections of Shoojit Sircar's Piku totales to Rs 107.34 crore. Bombay Velvet, on the other hand, could only mint Rs 16 crore over the first weekend of its release on May 15.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X