For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మెగా ముద్ర :'పిల్లా నువ్వులేని జీవితం' వీకెండ్ కలెక్షన్స్

  By Srikanya
  |

  హైదరాబాద్ : వైవియస్ చౌదరి 'రేయ్'తో ఎంట్రీ ఇవ్వాల్సిన చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ 'పిల్లా నువ్వులేని జీవితం'తో ప్రేక్షకుల ముందుకు మొన్న శుక్రవారం వచ్చాడు. రెజీనా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అల్లు అరవింద్, దిల్ రాజు నేతృత్వంలో బన్నీవాసు, హర్షిత్ నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం. ట్రైడ్ లో అందుతున్న సమచారాన్ని బట్టి మొత్తం ...ఎపి, నైజాం కలెక్షన్స్ కలిపి 5.18 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఏ ఏరియాలో ఎంతెంత కలెక్టు చేసిందో వివరాలు...స్లైడ్ షోలో చూడండి..

  చిరంజీవి మేనల్లుడు.. అయినా ఆల్బమ్‌ పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగాడు! నాగబాబు అండ ఉంది.. కానీ తొలి అవకాశం కోసం ఏళ్ల తరబడి నిరీక్షించాడు. పవన్‌ కల్యాణ్‌ పిలిస్తే వస్తాడు.. కనీసం ఆ పేరు వాడుకోలేదు.. 'వీళ్లంతా నా వెనుక ఉన్నార'న్న ధైర్యంతో ముందడుగు వేశాడు. అవకాశం సంపాదించాడు. తొలి సినిమా విడుదల కాకపోయినా పట్టు వదల్లేదు. ఈలోగా రెండో సినిమా వచ్చేసింది. తెరపై బొమ్మ పడిపోయింది. 'కుర్రాడు భలే చేశాడ్రా..' అని దీవిస్తున్నారంతా. ఆ కుర్రాడే సాయిధరమ్‌తేజ్‌.

  చిరంజీవి ఇంటి నుంచి వచ్చిన మరో కథానాయకుడు. 'రేయ్‌'తో ఎంట్రీ కార్డు పడిపోయినా.. రెండో సినిమా 'పిల్లా నువ్వు లేని జీవితం'తోనే తేజు ప్రతిభ తెలిసింది. డాన్సులు, నటన, హావభావాలూ.. అన్నింట్లోనూ 'మెగా' ముద్ర స్పష్టంగా కనిపించింది.

  ఇక ఈ చిత్రంలో రేసీ స్క్రీన్ ప్లేతో ఆద్యంతం ఆసక్తికరంగా కథను నడపడంలో దర్శకుడు ఎ.ఎస్. రవికుమార్ చౌదరి సక్సెస్ సాధించాడు. మరీ ముఖ్యంగా ప్రథమార్ధంలో హీరో తన కథను జగపతిబాబుకు చెప్పడం, ద్వితీయార్థంలో జగపతిబాబు తన కథను ప్రకాశ్ రాజ్ కు చెప్పడం చాలా ఆసక్తికరంగా ఉండటమే పండిండి. సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం ఊహకందని ట్విస్టులతో, ఫన్ తో సాగిపోయింది.

  అలాగే...సాయిధరమ్ తేజ నటుడిగా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. అయితే తమ మేనమామలుచిరంజీవి, పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ నుండీ వీలైనంత త్వరగా బయటకు వస్తే మంచిది.

  స్లైడ్ షోలో ..ఏరియా వైజ్ కలెక్షన్ వివరాలు...

  నైజాం...

  నైజాం...

  ఈ చిత్రం నైజాం ఏరియాలో 2 కోట్లు ఈ వీకెండ్ లో వసూలు చేసింది. మెగా హీరోలకు నైజాం మొదటి నుంచి మంచి కలెక్షన్స్ సాధించే ఏరియా

  సీడెడ్

  సీడెడ్

  అలాగే సీడెడ్ విషయానికి 95 లక్షలు వసూలు చేసి, కొత్త హీరో అయినా స్టామినా ఉన్న హీరోనే అనిపించాడు.

  వైజాగ్..

  వైజాగ్..

  తుఫాన్ దెబ్బకు చాలా థియోటర్స్ దెబ్బతినటంలో కాస్త తక్కువ థియోటర్స్ లోనే విడుదలైన ఈ చిత్రం 58 లక్షలు వసూలు చేసింది.

  గుంటూరు...

  గుంటూరు...

  ఈ చిత్రం గుంటూరు ఏరియాలో 45 లక్షలు వసూలు చేసింది. మెగా హీరోలకు గుంటూరులోనూ మంచి ఫాలోయింగ్ ఉంది.

  కృష్ణ

  కృష్ణ

  కృష్ణా జిల్లా తొలి నుంచి నందమూరి అభిమానులు ఎక్కవ. ఇక్కడ కూడా ఈ చిత్రం Rs 35.5 లక్షలు ఈ వీకెండ్ లో వసూలు చేసింది.

  తూర్పు గోదావరి

  తూర్పు గోదావరి

  గోదావరి జిల్లాలు మెగా ఫ్యామిలీకి మొదటి నుంచి పెట్టని కోట. తూర్పు గోదావరిలో ఈ చిత్రం వీకెండ్ లో ... 39 లక్షలు వసూలు చేసింది.

  పశ్చిమ గోదావరి

  పశ్చిమ గోదావరి

  పశ్చిమ గోదావరి లో ఈ చిత్రంలో కాస్త తక్కువ వసూలు చేసిందనే చెప్పాలి. 28.4 లక్షలు మాత్రమే వచ్చినట్లు ట్రేడ్ రిపోర్టు.

  నెల్లూరు

  నెల్లూరు

  నెల్లూరు ని సినిమా వాళ్లు టాక్ కోసం అక్కడ ఎంత కలెక్టు చేసిందో చూస్తూంటారు. అక్కడ 16.7 లక్షలు వసూలు చేసింది.

  సాయి ధరమ్ తేజ మాట్లాడుతూ...

  సాయి ధరమ్ తేజ మాట్లాడుతూ...

  తొలిసారి తెరపై నన్ను నేను చూసుకొందామని ఆత్రుతతో అడుగుపెట్టా. లోపలకు వెళ్లానో లేదో.. నాకంతా అయోమయంగా తోచింది. తెరపై నా కాళ్లు చూపిస్తున్నారు.. 'వస్తోంది నేనే..' అనిపించింది. ఆ తరవాత నా కళ్లకు ఏమీ కనిపించలేదు అంతా మాయలా అనిపించింది. పక్కన అమ్మ మాత్రం తదేకంగా నన్ను చూడ్డంలో లీనమైపోయింది. ఆ అనుభవం మాటల్లో చెప్పలేను.

  'పిల్లా నువ్వులేని జీవితం' స్పందన గురించి హీరో...

  'పిల్లా నువ్వులేని జీవితం' స్పందన గురించి హీరో...

  అన్ని విధాల సంతృప్తినిచ్చిన సినిమా ఇది. ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు, శ్రీహరి.. ఇలాంటి దిగ్గజాలతో నటించే అవకాశం రావడం నా అదృష్టం. శ్రీహరి గారు నన్ను బాగా చూసుకొన్నారు. రోజూ ఆయన ఇంటి నుంచి క్యారియర్‌ వచ్చేది. 'కలసి భోంచేద్దాం..రా' అనేవారు. ఆయన అకాలమరణం నన్ను కలచివేసింది. ఇక జగపతిబాబు సార్‌... చాలా కూల్‌. సెట్లో జోకులు వేస్తూ సరదాగా ఉండేవారు. ప్రకాష్‌రాజ్‌ గారి గురించి ఏం చెప్పాలి? తెలుగు, తమిళ, కన్నడ భాషలు రాస్తారు.. చదువుతారు. ఆయన ప్రతిభ చూస్తే మాటలు రావు. నిజంగా వీళ్లతో పనిచేసే అవకాశం ఇంత తొందరగా రావడం నా అదృష్టం అన్నారు.

  English summary
  'Pilla Nuvvu Leni Jeevitham' has collected pretty good figure in the first three days.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X