twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘పిశాచి’ రేటెంతంటే.....

    By Srikanya
    |

    హైదరాబాద్ :‘చంద్రకళ' సినిమా తరువాత మరో తమిళ సూపర్‌హిట్‌ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు సి.కళ్యాణ్‌ తీసుకొస్తున్న సంగతి తెలిసిం. మిస్కిన్‌ దర్శకత్వంలో తమిళ దర్శకుడు బాల నిర్మించిన ‘పిశాచి' సినిమాను సి.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. పతాకంపై సి.కల్యాన్‌, కల్పన అదే టైటిల్‌తో తెలుగులోకి అనువదిస్తున్నారు. బాల ఈ చిత్రానికి సమర్పకులు. ఈ చిత్రం డబ్బింగ్ రైట్స్ ని 25 లక్షలు చెల్లించి సొంతం చేసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ చిత్రం తెలుగు డబ్బింగ్ వెర్షన్ బిజినెస్ ప్రారంభమైనట్లు తెలుస్తోంది.

    నిర్మాత సి.కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘మిస్కిన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 19న విడుదలై పెద్ద హిట్‌ అయింది. మనసుల్ని దోచుకునే ఓ దెయ్యం కథ ఇది. ఎన్నో చిత్రాలకు దర్శకత్వం వహించిన బాలా అంతా కొత్తవారితో ఈ సినిమా నిర్మించారు. రొమాంటిక్‌ హారర్‌గా రూపొందిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటుదన్న నమ్మకం ఉంది. పెద్ద పోటీ మధ్య ఈ సినిమా రైట్స్‌ దక్కించుకున్నాను. ప్రస్తుతం డబ్బింగ్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదిని ప్రకటిస్తాం'' అని తెలిపారు.

    ఇక ....‘చంద్రకళ' విషయానికి వస్తే.... తమిళంలో 'అరణ్మణి'గా సుందర్ సి రూపొందించిన సినిమాను తెలుగులో 'చంద్రకళ' పేరుతో నిర్మాత సి. కళ్యాణ్ అనువదించారు. హన్సిక ప్రధాన పాత్ర పోషించిన ఈ హారర్ కామెడీ చిత్రం ఆమెలోని కొత్త కోణాన్ని ఆవిష్కృతం చేసింది. తమిళవారిని ఆకట్టుకున్న 'అరణ్మణి' తెలుగువారి మెప్పు పొందింది.

    Pisachu dubbing rights bagged

    తమిళంలో ‘అరన్మణి' పేరుతో విడుదలై ఘనవిజయం సాధించిన ఈ చిత్రం దాదాపు 30 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈమధ్య తెలుగులో థ్రిల్లర్ చిత్రాలకు ఆదరణ ఎక్కువైంది. ఆ కోవలో రూపొందిన ఈ చిత్రం కూడా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకంతో విడుదల చేసారు. హర్రర్‌తోపాటు మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. ముఖ్యంగా గ్రాఫిక్స్ ప్రధానాకర్షణగా నిలిచాయి. ఈ చిత్రం షూటింగ్ మొత్తం హైదరాబాద్‌లోనే జరిగింది.

    మురళి(వినయ్ రాయ్)కుటుంబానికి చెందిన ఓ జమీందారు బంగ్లా అమ్మకానికి పెడతారు. దాన్ని శుభ్రం చేయటానికి వచ్చిన వారంతా ఒకరు తర్వాత మరొకరు మాయమవుతూంటారు. దాంతో ఆ భవంతిలో దెయ్యం తిరుగుతోందని,అదే ఇదంతా చేస్తోందని అందరూ భావించి,భయపడతారు. అప్పుడు ఆ ఇంటికి మురళి భార్య అన్న అయిన రవి(సుందర్.సి) వస్తాడు. ఆయన ఈ సంఘటనలు వెనక ఉన్న కారణాలు తెలుసుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఈ లోగా తన చెల్లిలే(ఆండ్రియా) ఈ హత్యలన్నీ చేస్తోందని తెలుసుకుని షాక్ అవుతాడు. అప్పుడు రవి ఏం చేసాడు...తన చెల్లికీ చంద్రకళ(హన్సిక) కీ సంభంధం ఏమిటి.. ఇంతకీ చంద్రకళ ఎవరు..ఆ భవంతికి చంద్రకళకూ ఉన్న సంభంధం ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే మిగతా కథ తెలుసుకోవాల్సిందే.

    హన్సిక, విమల్‌, లక్ష్మీరాయ్‌, ఆండ్రియా, సుందర్‌, కోట శ్రీనివాసరావు, కోవై సరళ, సంతానం నటించిన ఈ చిత్రానికి మాటలు: ఎం.రాజశేఖరరెడ్డి, పాటలు: వనమాలి, సంగీతం: కార్తీక్‌రాజా, భరద్వాజ్‌, ఫొటోగ్రఫీ: సెంథిల్‌కుమార్‌, సహనిర్మాత: పద్మారావు వాసిరెడ్డి, నిర్మాతలు: శ్వేతలానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: సుందర్‌ సి.

    English summary
    C.Kalyan bagged the dubbing rights of ‘Pisachu’ film for Rs 25 lakhs. This film stars Naga and Prayaga Martin alongside RadhRavi and Harish Uthaman.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X