స్పిరిట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్.. సందీప్ రెడ్డి వంగా అంచనా ఎన్ని కోట్లో తెలుసా?
ఇండియాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రాబోయే చిత్రం స్పిరిట్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ఈ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సినిమాను ప్రకటించినప్పటి నుంచి అభిమానులతో పాటు నార్మల్ ఆడియెన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకు కారణం గతంలో సందీప్ రెడ్డి వంగ నుంచి వచ్చిన తెలుగు చిత్రాలే. ఆయన దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
దాంతో నెక్ట్స్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన స్పిరిట్ చిత్రంపై ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా ఎప్పుడూ ప్రారంభం అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఇక ప్రభాస్ కూడా తన గత చిత్రాలకు సంబంధించిన షూటింగ్ పార్ట్ ను త్వరగా పూర్తి చేసుకొని, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో తాజాగా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబోలోని స్పిరిట్ చిత్రానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

సందీప్ రెడ్డి వంగ సినిమాలకు ఏ రేంజ్ లో చర్చలు జరుగుతాయో అదే స్థాయిలో బాక్సాఫీస్ వద్ద వసూళ్లు కూడా అందుతుంటాయి. అర్జున్ రెడ్డి సినిమాకు రూ.51 కోట్లు, యానిమల్ చిత్రానికి రూ.700 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గా గ్రాస్ కలెక్షన్స్ ను అందుకుంది. దీంతో రాబోయే చిత్రం స్పిరిట్ ఏ రేంజ్ వసూళ్లను కలెక్ట్ చేస్తుందోనని అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగా తన అంచనాను చెప్పుకొచ్చారు. అయితే స్పిరిట్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద డే 1 ఎన్ని కోట్లు వస్తాయో ఓ అంచనాతో ఉన్నారు. ఓపెనింగ్ డే 150 కోట్లకు పైగా వసూళ్లు చేస్తుందని గత ఇంటర్వ్యూలో చెప్పారు. ఇక ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఆ సమయానికి అప్పటి మార్కెటింగ్ రేంజ్ తో ఇంకా వసూళ్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఓపెనింగ్ డే 200 కోట్ల రూపాయల వరకు వసూళ్లు చేస్తుందని ట్రేడ్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక సందీప్ రెడ్డి స్పిరిట్ చిత్రంతో రూ.1500 కోట్ల టార్గెట్ పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకు తగట్టుగానే సినిమాకు సంబంధించిన రేంజ్ ను పెంచుతున్నారు. వరల్డ్ వైడ్ గా మంచి వసూళ్లను అందుకునేలా సినిమాను నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తైనట్టు సమాచారం.
ఇక త్వరలో సందీప్ రెడ్డి వంగ షూటింగ్ వెళ్లబోతున్నారు. ఇప్పటికే సెప్టెంబర్ మొదటి వారంలోనే షూటింగ్ పనులు ప్రారంభించాలని టీమ్ అనుకున్నారు. కానీ ప్రభాస్ రెడీగా లేరని తెలుస్తోంది. అయితే ప్రస్తుతానికి సందీప్ రెడ్డి వంగ ఎలాగైనా షూటింగ్ ను సెప్టెంబర్ మంథ్ లోనే ప్రారంభించాలని, ప్రభాస్ లేని సన్నివేశాలను షూట్ చేయాలనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఇక షూట్ ఎప్పుడు ప్రారంభం అవుతుందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











