»   » అయ్యో...రామ్ చరణ్ వాయిస్ కూడా ఫెయిల్

అయ్యో...రామ్ చరణ్ వాయిస్ కూడా ఫెయిల్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :బాలీవుడ్‌ దర్శకుడు సూరజ్‌ భరజాత్యా, రాజశ్రీ ప్రొడక్షన్స్‌ నిర్మాణంలో వచ్చిన 'ప్రేమ్‌రతన్‌ ధన్‌ పాయో' మొన్న దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. తెలుగులోనూ 'ప్రేమలీల' టైటిల్ తో విడుదల చేసారు.

ఈ సినిమాకు క్రేజ్ తేవటానికి రామ్ చరణ్ డబ్బింగ్ చెప్పారు. అయితే ఈ డబ్బింగ్ ఏ మాత్రమూ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయలేకపోయింది. మరో ప్రక్క 'ప్రేమ్‌రతన్‌ ధన్‌ పాయో' 3 రోజుల్లోనే రూ.100 కోట్లు వసూలు చేసి రికార్డులు బ్రద్దుల కొడుతోంది.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

PremRatanDhanPayo telugu Version fails to draw audiences

గతంలో ఇదే కాంబినేషన్ లో వచ్చిన మైనే ప్యార్ కియా తెలుగు వెర్షన్ ప్రేమ పావురాలు, హమ్ ఆప్ హై కౌన్ తెలుగు వెర్షన్ ప్రేమాలయం ఆంధ్రా,తమిళనాడులో వంద రోజులు పాటు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో ఆడి రికార్డులు క్రియేట్ చేసారు. పాటలు సైతం ఇక్కడ పెద్ద హిట్టై, ఇప్పటికి అవి అభిమానుల నోళ్లలో నానుతున్నాయి.

అయితే ఇక్కడ 'ప్రేమలీల' ఫెయిలవటానికి కారణం ..వారు తెలుగు మార్కెట్ పై పెద్దగా దృష్టి పెట్టకపోవటమే అంటున్నారు. నామ మాత్రంగా ట్రైలర్ వదిలి, రిలీజ్ చేసేసారు తప్ప ప్రమేషన్ చేయలేదు. గతంలో మాదిరిగానే సినిమా రిలీజ్ చేస్తే అదే ఆడుతుందనుకున్నారు కానీ మారుతున్న పరిస్ధితులకు అణుగుణంగా ఇక్కడ ప్రమోషన్ యాక్టవిటీస్ చేపట్టలేదు.

'ప్రేమ్‌ రతన్‌ ధన్‌పాయో' ప్రపంచ వ్యాప్తంగా 5,300 థియేటర్లలో గురువారం విడుదలైంది. భారత్‌లోనే 4,500పైగా థియేటర్లలో, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో 800 థియేటర్లలో చిత్రం విడుదలైంది.

PremRatanDhanPayo telugu Version fails to draw audiences

ఈ చిత్రంలో సల్మాన్ ద్విపాత్రాభినయం చేస్తూ కనిపించారు. చిత్రానికి భారీ స్దాయిలో ఓపినింగ్స్ వచ్చాయి. ఈ చిత్రం పాకిస్థాన్‌లోనూ విడుదల అయ్యింది. తెలుగులో 'ప్రేమలీల', తమిళంలో 'మెయ్‌ మరన్‌దాయో అన్బే' పేరిట తీసుకొచ్చారు. అమెరికన్‌ రచయిత మార్క్‌ ట్వెయిన్‌ రాసిన 'ది ప్రిన్స్‌ అండ్‌ ది పాపర్‌' కథ ఆధారంగా దీన్ని తెరకెక్కించారు.

సుమారు రూ.80 కోట్ల బడ్జెట్‌తో 'ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో'ను తెరకెక్కించారు. విడుదలకు ముందే సంగీతం, శాటిలైట్‌ హక్కుల అమ్మకం ద్వారా రూ.57 కోట్లు ఆదాయం వచ్చింది. హిమేష్‌ రేష్మియా స్వరపరిచిన గీతాలకు మంచి స్పందన వస్తోంది. సంగీతం హక్కుల ద్వారా వచ్చిన ఆదాయంలో ఇప్పటివరకు ఈ చిత్రానిదే రికార్డు.

English summary
Ram Charan providing his voice to Salman Khan for the Prem Ratan Dhan PayoTelugu version, the movie didn't lure the audiences to the theatres.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu