200 కోట్ల క్లబ్‌లో ‘భరత్’.. చెన్నైలో రికార్డు.. హిందీలో రీమేక్.. మహేష్‌ సెన్సేషనల్ కామెంట్!

By Rajababu

Recommended Video

Bharath Ane Nenu Reached 200 Crores Collections

సూపర్‌స్టార్ మహేష్‌బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన భరత్ అనే నేను వసూళ్ల పరంగా దూసుకెళ్తున్నది. ఏప్రిల్ 20న రిలీజైన ఈ చిత్రం రికార్డు కలెక్షన్లను కొల్లగొడుతున్నది. 20 రోజులుగా ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నది. తాజాగా ఈ చిత్రం మరో ఘనతను సాధించింది. మే 5న రూ.190 కోట్లకుపైగా వసూళు చేసిన ఈ చిత్రం మరో అడుగు ముందేసింది.

 200 కోట్ల క్లబ్‌లోకి

200 కోట్ల క్లబ్‌లోకి

భరత్ అనే నేను చిత్రం ప్రిన్స్ మహేష్‌బాబు కెరీర్‌లోనే భారీ విజయం సాధించిన చిత్రంగా ఓ రికార్డును సొంతం చేసుకొన్నది. ఈ చిత్రం తాజాగా రూ.200 కోట్ల క్లబ్‌లో చేరింది. నాన్ బాహుబలి చిత్రాల క్యాటగిరీలో భరత్ అనే నేను రెండోస్థానంలో దూసుకెళ్తున్నది. ఇప్పటికే రాంచరణ్ నటించిన రంగస్థలం చిత్రం ఇప్పటికే 200 కోట్ల క్లబ్‌లో చేరిన సంగతి తెలిసిందే.

ట్విట్టర్‌లో డీవీవీ కామెంట్

భరత్ అనే నేను గ్రాస్ కలెక్షన్ల గురించి డీవీవీ బ్యానర్ ట్విట్టర్‌లో మే5 ఓ ప్రకటన చేసింది. మా చిత్రం రూ.190.63 గ్రాస్ కలెక్షన్లను సాధించింది అని ట్వీట్‌లో పేర్కొన్నారు. రెండువారాల్లో ఈ చిత్రం సాధిస్తున్న కలెక్షన్లు మహేష్‌బాబు స్టామినాకు అద్దం పట్టిందని పేర్కొన్నారు.

చెన్నైలో టాలీవుడ్ రికార్డు

తమిళనాడులో భరత్ అనే నేను ప్రభంజనం సృష్టిస్తున్నది. ఈ చిత్రం తమిళనాట రూ.4.2 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. కేవలం చెన్నైలోనే 1.6 కోట్లు సాధించింది. చెన్నైలో ఈ రేంజ్‌లో వసూళ్లను సాధించడంలో భరత్ అనే నేను ఓ రికార్డు నెలకొల్పింది అని చిత్ర పీఆర్వో బీఏ రాజు ట్వీట్ చేశారు.

కొరటాల శివ కథ చెప్పినప్పుడే

కొరటాల శివ కథ చెప్పినప్పుడే

భరత్ అనే నేను విజయానందాన్ని ప్రిన్స్ మహేష్ యూరప్ ట్రిప్‌లో ఆస్వాదిస్తున్నారు. యూరప్ నుంచి మీడియాతో మాట్లాడుతూ.. దర్శకుడు శివ కథ చెప్పినప్పుడే స్క్రిప్టుపై గొప్ప విశ్వాసం కలిగింది. వినోదానికి ప్రేక్షకులు ప్రాధాన్యం ఇస్తారనే విషయాన్ని మొదటి నుంచి నమ్ముతాను. ఆ దిశలోనే భరత్ అనే నేను సినిమాను రూపొందించాం. ఈ చిత్రం ద్వారా సామాజిక సందేశాన్ని ఇవ్వడం ప్రేక్షకులకు నచ్చింది అని మహేష్ బాబు అన్నారు.

బాలీవుడ్‌లోకి రీమేక్

బాలీవుడ్‌లోకి రీమేక్

భరత్ అనే నేను సంచలన విజయం సాధించడంతో ఈ చిత్రంపై అన్ని భాషల సినీ నిర్మాతలు కన్నేశారు. ఈ చిత్రం హిందీ రీమేక్ రైట్స్ కోసం బాలీవుడ్ ప్రముఖులు సంప్రదిస్తున్నారు. ఇప్పటికే చాలా మందితో చర్చలు జరిగాయి. త్వరలోనే వివరాలు అందిస్తాం అని ప్రిన్స్ మహేష్ పేర్కొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X