»   » పవన్ కళ్యాణ్ 'పులి' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!?

పవన్ కళ్యాణ్ 'పులి' ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

కేవలం ఆంధ్రప్రదేశ్‌లోనే మొదటి వారంలోనే మా చిత్రం పులి రూ.15 కోట్ల 8 లక్షల 46వేలు షేర్ సాధించి స్ట్రాంగ్‌గా దూసుకెళ్తోంది. 'టాక్‌తో సంబంధం లేకుండా 'పులి' కనకవర్షం కురిపిస్తోంది. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు, పవన్ అభిమానులకు ప్రత్యేకించి ధన్యవాదాలు'అని నిర్మాత శింగనమల రమేష్ మీడియాకు ప్రెస్ నోట్ ద్వారా తెలియచేసారు. పవన్‌కల్యాణ్ హీరోగా, ఎస్.జె. సూర్య దర్శకత్వంలో విడుదలైన చిత్రం 'పులి' క్రిందట వారం రిలీజై బ్యాడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అలాగే నిర్మాత కలెక్షన్స్ కారణం చెబుతూ... చిత్రంలో పవన్ పెర్‌ఫార్మెన్స్ హైలైట్. ఓపెనింగ్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్నాయి' అని చెప్పారు.

ఇక వారు విడుదల చేసిన ప్రెస్ నోట్ లో ఏరియాల వారిగా వివరాలు ఉన్నాయి. అవి

నైజాం: Rs 4,76,60,000
సీడెడ్: Rs 3,27,43,000
వైజాగ్: Rs 1,51,15,000
తూర్పు గోదావరి: Rs 1,03,84,000
పశ్చిమ గోదావరి: Rs 1,05,22,000
కృష్ణ: Rs 1,10,07,000
గుంటూరు: Rs 1,58,10,000
నెల్లూరు: Rs 76,05,000

మొత్తం: Rs 15,08,46,000

ఇక ఇలా ఏరియాల వారిగా కలెక్షన్స్ చెప్పకుండా ఉంటే బాగుండునని అభిమానులు అనుకుంటున్నారు. కలెక్షన్స్ గురించి మాట్లాడుతున్నారంటే సినిమా కష్టమనే విషయం అందరికీ తెలిసిందే కదా.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu