twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Radheshyam : నష్టాల్లో కూడా రికార్డు సృష్టించనున్న రాధేశ్యామ్.. ఇండియాలోనే మొదటి మూవీగా!

    |

    తెలుగు రాష్ట్రాల వరకే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంతా ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూసిన సినిమాల్లో 'రాధే శ్యామ్' ఒకటి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించడమే కాక సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ స్టఫ్ విపరీతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అందుకే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ బిజినెస్‌ను కూడా అత్యధికంగా చేసుకుని గత శుక్రవారం నాడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'రాధే శ్యామ్'కు మొదటి ఆట నుంచే డివైడ్ టాక్ రావడంతో ఆ ప్రభావం కలెక్షన్లపై పడింది. దీంతో మొదటి రోజు నుంచి సినిమాకు అనుకున్న రీతిలో వసూళ్లు రావడం లేదు. ఇక మొదటి వారం రోజుల కలెక్షన్స్ ను బట్టి అంచనా వేస్తే ఈ సినిమా నష్టాలతో రికార్డు సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు. ఆ వివరాలు తెలుసుకుందాం.

     భారీ ప్రీ రిలీజ్ బిజినెస్

    భారీ ప్రీ రిలీజ్ బిజినెస్

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రభాస్ హీరోగా - పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'రాధే శ్యామ్'. జిల్ దర్శకుడు రాధాకృష్ణ కుమార్‌ తెరకెక్కించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీని కృష్ణంరాజు సమర్పణలో యువీ క్రియేషన్స్‌, గోపీకృష్ణా మూవీస్‌ పతాకాలపై వంశీ, ప్రమోద్‌, ప్రశీద నిర్మించారు. ఈ మూవీని ఏకకాలంలో ఐదు భాషల్లో విడుదల చేశారు. ఈ సినిమాలో ప్రభాస్ పామిస్ట్ పాత్రలో నటించగా పూజ ఒక డాక్టర్ పాత్రలో నటించింది. ముందు నుంచి పోస్టర్లు, టీజర్లు, ట్రైలర్లతో సినిమా మీద ఆసక్తిని పెంచేశారు. ఇక ప్రభాస్‌కు ఉన్న మార్కెట్ సినిమా ప్రమోషన్స్ చూసి చాలా ఏరియాల్లో భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

    52.59 కోట్లు షేర్

    52.59 కోట్లు షేర్


    మొత్తంగా రాధే శ్యామ్' మూవీకి ఏపీ తెలంగాణలో కలిపి రూ. 105.20 కోట్లు, కర్నాటకలో రూ. 12.50 కోట్లు, తమిళనాడులో రూ. 6 కోట్లు, కేరళలో రూ. 2.10 కోట్లు, హిందీలో రూ. 50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్‌లో కలిపి రూ. 27 కోట్లతో ప్రపంచ వ్యాప్తంగా రూ. 202.80 కోట్లు వ్యాపారం జరిగింది. అయితే అంత వ్యాపారం జరిగితే 'రాధే శ్యామ్'కు మొదటి వారం తెలుగు రాష్ట్రాల్లో సహా బయట కూడా భారీ నిరాశే ఎదురైంది. బాక్స్ ఆఫీస్ లెక్కల ప్రకారం చూస్తే మొదటి వారం అంతా కలిపి నైజాంలో రూ. 24.20 కోట్లు, సీడెడ్‌లో రూ. 7.24 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 4.68 కోట్లు, ఈస్ట్‌లో రూ. 4.19 కోట్లు, వెస్ట్‌లో రూ. 3.23 కోట్లు, గుంటూరులో రూ. 4.37 కోట్లు, కృష్ణాలో రూ. 2.59 కోట్లు, నెల్లూరులో రూ. 2.09 కోట్లతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 52.59 కోట్లు షేర్, రూ. 82 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే వారం రోజుల్లో ఏపీ, తెలంగాణలో 'రాధే శ్యామ్'కు రూ. 52.59 కోట్లు షేర్ వచ్చింది.

    హిందీ రన్‌పై కూడా ప్రభావం

    హిందీ రన్‌పై కూడా ప్రభావం


    ఇక తెలుగు రాష్ట్రాలను పక్కన పెట్టి పక్కనే ఉన్న కర్నాటకలో రూ. 4.18 కోట్లు, తమిళనాడులో రూ. 75 లక్షలు, కేరళలో రూ. 18 లక్షలు, హిందీలో రూ. 8.95 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 1.58 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 11.13 కోట్లతో ప్రపంచవ్యాప్తంగా వారంలో రూ. 79.36 కోట్లు షేర్‌తో పాటు రూ. 142.20 కోట్లు గ్రాస్‌ను వసూలు చేసింది ఈ రాధేశ్యామ్ సినిమా. నిజానికి అదే రోజు విడుదలైన కాశ్మీర్ ఫైల్స్ నుండి ఈ చిత్రానికి భారీ పోటీ ఏర్పడింది. కాశ్మీర్ ఫైల్స్ రోజు రోజుకు బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు సృష్టిస్తోంది. ఈ సినిమా కూడా 200 కోట్ల మార్కును చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇది రాధే శ్యామ్ హిందీ రన్‌పై కూడా ప్రభావం చూపింది.

    డ్రాప్ గట్టిగా కనిపిస్తోంది

    డ్రాప్ గట్టిగా కనిపిస్తోంది


    ఇప్పుడు ఈ సినిమా నష్టాల్లో కూడా రికార్డు సృష్టించే అవకాశం ఉందని అంటున్నారు.. అసలు విషయం ఏమిటంటే ఈ సినిమా కలెక్షన్లు మరీ దారుణంగా తగ్గిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్లు ఓపెనింగ్ రోజున పాతిక కోట్లు ఉంటే ఏడో రోజున 32 లక్షల పడిపోయాయి. హిందీలో ఓపెనింగ్ రోజున నాలుగున్నర కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఏడో రోజుకు 80 లక్షలకు పడిపోయింది. ముందు నుంచి పరిశీలిస్తున్నట్లు అయితే ఈ సినిమా వసూళ్లలో డ్రాప్ గట్టిగా కనిపిస్తోంది కానీ ఎక్కడా వసూళ్లు పెరిగిన దాఖలాలు లేవు.

    మొట్ట మొదటి సినిమాగా

    మొట్ట మొదటి సినిమాగా


    ఈ సినిమా గట్టిగా నిలబడేందుకు ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ వారం రోజుల పాటు కష్టపడినా సరే వంద కోట్ల రూపాయలు కలెక్షన్లు దాటడం అనేది గగనమే అని అంటున్నారు. ఆ లెక్కన చూస్తే బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో వంద కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. అది అసాధ్యం కాబట్టి భారత సినీ చరిత్రలో 100 కోట్ల రూపాయల నష్టాలు తెచ్చుకున్న మొట్ట మొదటి సినిమాగా రాధేశ్యామ్ రికార్డులకు ఎక్కే అవకాశం కనిపిస్తోంది.

    English summary
    Radhe Shyam will be the first Indian film with 100 crore plus theatrical loss
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X