For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  RRR : ఎట్టకేలకు ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఆ పెద్ద సినిమాలను టెన్షన్ పెడుతూ కొత్త డేట్!

  |

  బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా కీర్తి సంపాదించిన రాజమౌళి ఆ సినిమా తర్వాత ఇద్దరు స్టార్ హీరోలను పెట్టి మల్టీస్టారర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఎట్టకేలకు ఫైనల్ రిలీజ్ డేట్ ప్రకటించారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే .

  ఆ సినిమాతో సూపర్ క్రేజ్

  ఆ సినిమాతో సూపర్ క్రేజ్

  ప్రభాస్ తో బాహుబలి పార్ట్ వన్, పార్ట్ టు చేసి రిలీజ్ చేసిన రాజమౌళి ఆ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారన్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాల దెబ్బకి తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా ఎలా వ్యాపించింది అనే విషయం అందరికీ తెలిసింది. తెలుగు సినిమా ఎందులోనూ తక్కువ కాదని ఈ సినిమా నిరూపించడమే కాక వందల కోట్ల కలెక్షన్లు సాధించి ఇప్పటికి రికార్డులు బద్దలు కొట్టడానికి వీలు లేని స్థాయిలో ఆ బాహుబలి సిరీస్ సినిమాలు నిలబడ్డాయి. బాహుబలి 2 పూర్తయిన తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న రాజమౌళి ఎన్టీఆర్, రామ్ చరణ్ తేజ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్ సినిమా రూపొందిస్తున్నారు. మొన్నీమధ్యనే ఈ సినిమా షూటింగ్ పూర్తి అయింది.

  కరోనా ఎఫెక్ట్ తో అలా

  కరోనా ఎఫెక్ట్ తో అలా


  నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తయి విడుదల కూడా అవ్వాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఎంటర్ అయిన కరోనా కారణంగా ఈ సినిమా అంతకంతకీ వెనక్కి వెళుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే అక్టోబర్ 13వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేసేందుకు యుద్ద ప్రాతిపదికన సినిమా యూనిట్ బాగానే కష్టపడింది. అయితే అనుకోకుండా వచ్చి పడిన కరోనా మహమ్మారి రెండో దశ ఆ ఆశలను కూడా వమ్ము చేసింది. ఆ తేదీకి సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలే తక్కువగా కనిపిస్తున్నాయని ముందు నుంచీ ప్రచారం జరగగా ఇప్పుడు అదే నిజం అయింది. కొద్ది రోజుల క్రితం ఈ సినిమా విడుదల గురించి అధికారిక ప్రకటన విడుదల చేసింది ఆర్ఆర్ఆర్ యూనిట్.

  థియేటర్ల టెన్షన్ తో

  థియేటర్ల టెన్షన్ తో

  అక్టోబర్ 21 నాటికి ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ చేయడానికి పోస్ట్ ప్రొడక్షన్ దాదాపు పూర్తయిందని, అయితే అందరికీ తెలిసినట్టుగానే మేము విడుదలను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. కొన్ని ప్రాంతాల్లో థియేటర్లు నిరవధికంగా మూసివేయబడిన కారణంగా కొత్త తేదీని ప్రకటించలేమని కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. ప్రపంచ సినిమా మార్కెట్లు ప్రారంభమైనప్పుడు మేము సాధ్యమైనంత త్వరలో విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే ఈ ప్రకటన అటు ఆంధ్ర ప్రదేశ్ టికెట్ రేట్లు, మహారాష్ట్ర థియేటర్లు ఓపెన్ చేసి లేని కారణంగా అలా పేర్కొన్నారు.

  ఇప్పుడు క్లారిటీ రావడంతో

  ఇప్పుడు క్లారిటీ రావడంతో


  అయితే ఈ రెండు విషయాల్లో క్లారిటీ వచ్చిన కారణంగా సినిమాను రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు. జనవరి 7, 2022న 'RRR' విడుదల చేస్తున్నట్టు ఆర్ఆర్ఆర్ యూనిట్ తాజాగా ప్రకటించింది. రాజమౌళి డైరెక్షన్ లో మెగా పవర్​స్టార్ రామ్​చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి ఈ సినిమా మీద ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా ఆ స్థాయిలోనే ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ సినిమా ఐదు భారతీయ భాషలలోనే కాక మరో ఐదు విదేశీ బాషలలో కూడా రిలీజ్ అవుతోంది.

  మొత్తం పది బాషలలో

  మొత్తం పది బాషలలో


  బాహుబలి క్రేజ్ తో పాటు పలువురు హాలీవుడ్ నటీనటులు కూడా ఉండడంతో రాజ‌మౌళి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అంచ‌నాల‌కు త‌గ్గ‌ట్టుగానే రాజ‌మౌళి టాలీవుడ్ టాప్‌ హీరోలయిన ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌ల‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో లోనే కాక మరో అయిదు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ కాబోతోంది. ఇంగ్లీష్, పోర్చుగీస్, కొరియన్, స్పానిష్, టర్కిష్ భాషలలో కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.

  భారీ అంచనాలు

  భారీ అంచనాలు

  రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి రూపొందిస్తున్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీమ్‌గా ఎన్టీఆర్‌ కనిపించనున్నారు. బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అలియాభట్‌ ఈ సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ చరణ్ సరసన సీత పాత్రలో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌కి జోడీగా హాలీవుడ్‌ భామ ఒలీవియా మోరీస్ కనిపించనుంది. అలిసన్‌ డూడీ, రే స్టీవెన్‌ సన్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.

  పోటాపోటీగా

  పోటాపోటీగా

  నిజానికి వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ కు భారీ పోటీ నెలకొంది.. కేవలం సంక్రాంతి మూడు రోజుల్లో మూడు పెద్ద సినిమాలు విడుదల చేయడానికి ఇప్పటికే ప్రకటన చేయగా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దమయింది. జనవరి నెలలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ రాణా కాంబినేషన్ లో జరుగుతున్న భీమ్లా నాయక్, మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న సర్కారు వారి పాట, ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమాలు ఇప్పటికే తేదీలు ఖరారు చేసుకున్నాయి. అయితే వారం ముందే ఆర్ఆర్ఆర్ రావడం కూడా ఆ సినిమాల కలెక్షన్స్ మీద ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పక తప్పదు.

  English summary
  SS Rajamouli's RRR gets a new release date, film will hit the theatres on January 7, 2022.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X