»   » ‘కబాలి’తెలుగు వెర్షన్ రిలీజ్ డౌటే, పాత గొడవ తేలితేనే?

‘కబాలి’తెలుగు వెర్షన్ రిలీజ్ డౌటే, పాత గొడవ తేలితేనే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా పా రంజిత్‌ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం 'కబాలి'. ఈ చిత్రం తెలుగు,తమిళ వెర్షన్స్ రెండూ జూన్ 3న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయంచారు. ఈ మేరకు వదిలిన టీజర్స్ సైతం అందరినీ ఆకట్టుకుంటున్నాయి.

అయితే అందుతున్న సమాచారం ప్రకారం తెలుగు వెర్షన్ రిలీజ్ కష్టమే అంటున్నారు. ఎందుకంటే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో రజనీ గత చిత్రం కొచ్చిడియాన్(విక్రమ్ సింహా)పై ఓ కంప్లైంట్ పెండింగ్ లో ఉంది.


అప్పట్లో డిస్ట్రిబ్యూటర్ లక్ష్మి గణపతి ఫిల్మ్స్ వారు, ఫైనాన్సియర్ శోభన్ బాబు ఈ చిత్రం పంపిణీ చేసి భారీగా నష్టం పొందారు. అయితే ఈ నష్టాలు విషయమై రజనీ భార్య లత..7.60 కోట్లకు వీరికి హామీ ఇచ్చి ఉన్నారు. కానీ ఆమె ఆ తర్వాత హామీని నిలబెట్టుకోలేదు. దాంతో ఇప్పుడు ఆ నష్టం రికవరీ విషయమై తేలకుండా కబాలిని విడుదల చేసేది లేదు అంటున్నారు.


Rajani's Kabali Telugu release in doubt?

మరో ప్రక్క రజనీ గత చిత్రం లింగా డిజాస్టర్ సైతం ఇక్కడ పంపిణీదారులను భయపెడుతోంది. ఈ నేపధ్యంలో ఫిల్మ్ ఛాంబర్ లో ఉన్న కేసుని లెక్క చేయకుండా ఉండి రిలీజ్ చేసే డిస్ట్రిబ్యూటర్ దొరికితేనే ఈ సినిమా ఇక్కడ తెలుగులో రిలీజ్ అవుతుంది.


ఇక ఈ చిత్రం తెలుగు టీజర్‌ మొన్న ఆదివారం సాయంత్రం విడుదలైంది. ఎప్పటిలాగే తలైవా తనదైన స్టైల్‌, డైలాగ్‌ డెలివరీతో అదరగొట్టేశాడు.మిడిల్ ఏజ్డ్ మాఫియా డాన్ గా తెల్లని గెడ్డంతో రజినీకాంత్ తనదైన శైలిలో చాల విభిన్నంగా స్టైలిష్ గా కనిపించి అభిమానులకు పండుగ చేసారు. రజినీకాంత్ స్టైలిష్ నడకతో ఈ టీజర్ ప్రారంభమైంది.


ముఖ్యంగా 'పాత తెలుగు చిత్రాల్లో బుగ్గపై గాటు పెట్టుకుని, మీసాలు తిప్పుకొంటూ, లుంగీ కట్టుకుని పాత విలన్‌ ఏయ్‌! కబాలి అని పిలవగానే... వంగుని వినయంగా ఎస్‌ బాస్‌ అంటూ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నావా?.. కబాలి... రా' అంటూ చెప్పిన డైలాగ్‌ అదరగొట్టిందంటున్నారు ఫ్యాన్స్.


మరోపక్క ఆదివారం ఉదయం విడుదల చేసిన కబాలి త‌మిళ‌ టీజర్‌కు గంటలోనే మిలియన్‌ వ్యూస్‌ వచ్చేశాయి. అంతేకాకుండా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలోని అందరు ప్రముఖులు రజనీ స్టైల్‌కు ఫిదా అయిపోయారు.


Rajani's Kabali Telugu release in doubt?

ఈ చిత్రంలో రజనీకాంత్‌కి జోడీగా రాధికా ఆప్టే నటించారు. కలైపులి ఎస్‌. థను నిర్మించిన ఈ చిత్రానికి సంతోష్‌ నారాయణన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. ధన్షిక, కిషోర్‌, దినేష్‌ రవి, జాన్‌ విజయ్‌ తదితరులు చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. చైనాకు చెందిన విల్సన్‌ చౌ విలన్ గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఎక్కువ భాగం మలేసియాలో జరిగింది.


నిర్మాత మాట్లాడుతూ ''తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్న చిత్రిమిది. సంతోష్‌ నారాయణ్‌ బాణీలు అందిస్తున్నారు. తెలుగులో సీతారామశాస్త్రి, చంద్రబోస్‌, అనంతశ్రీరామ్‌ సాహిత్యాన్ని అందిస్తున్నారు''అన్నారు. ఈ చిత్రానికి మాటలు: సాహితి, ఛాయాగ్రహణం:మురళీ, కళ: రామలింగం.

English summary
Rajinikanth, Radhika Apte's Kabali Telugu version release is in doubt as a complaint is still pending on his earlier film Kochadaiyan (Vikramasimha) with the Telugu Film Chamber of Commerce (TFCC).
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu