For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెన్సార్ అయ్యింది‌: 2 గం. 54 నిముషాలు రన్ టైమ్

  By Srikanya
  |

  హైదరాబాద్‌: రన్ టైమ్ ఇప్పుడు సినిమాల్లో అతి ముఖ్యమైన అంశంగా మారింది. ఎక్కువ రన్ టైమ్ ఉన్న సినిమాలు వర్కవుట్ అవటం కష్టంగా మారింది. అయితే టైట్ స్క్రీన్ ప్లే తో వర్కవుట్ చేస్తే...మాత్రం కళ్లు తిప్పకుండా చూస్తూనే ఉండిపోతారు. తాజాగా సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'లింగ' కి సెన్సార్ అయ్యింది. అనుష్క, సోనాక్షిసిన్హా హీరోయిన్స్ గా చేస్తున్న ఈ చిత్రం రన్ టైమ్ 2 గం. 54 నిముషాలు అని సమాచారం .

  అలాగే రీసెంట్ గా విడుదలైన ఈ చిత్రం తమిళ,తెలుగు ట్రైలర్‌ లుఈ చిత్రంపై మరింత అంచనాలు పెంచేస్తున్నాయి. చిత్రానికి 'U' సర్టిఫికేట్ ఇచ్చారు. రాక్‌లైన్‌ ఎంటర్‌టైనమెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతమందిస్తున్నారు. డిసెంబర్‌లో విడుదల చేసేందుకు నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేష్‌ సన్నాహాలు చేస్తున్నారు.

  మరో ప్రక్క వివాదం..

  'లింగా' చిత్రం విడుదలను అడ్డుకోవాలని మద్రాసు హైకోర్టు మదురై బెంచీలో పిటీషన్‌ దాఖలైంది. కేఎస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'లింగా' చిత్రాన్ని రజనీకాంత్‌ పుట్టినరోజు సందర్భంగా డిసెంబరు 12న విడుదల చేసేందుకు ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ భారీఎత్తున సన్నాహాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో 'లింగా' చిత్ర కథ తనదేనని రవిరత్నం అనే వ్యక్తి మద్రాసు హైకోర్టులో దాఖలు చేసిన పిటీషన్‌లో ప్రస్తావించారు. 2013లో తాను యూట్యూబ్‌లో విడుదల చేసిన 'ముల్లెవనం- 999', 'లింగా' కథ ఒకటేనన్న సమాచారం తనకు తెలిసిందని పేర్కొన్నారు.

  ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి.. నిజాన్ని తేటతెల్లం చేయాలని కోరారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలను మాత్రమే కాకుండా.. త్వరలో జరుగనున్న ఆడియో విడుదల కార్యక్రమాన్ని కూడా ఆపేందుకు చర్యలు తీసుకోవాలని పిటీషన్‌లో ప్రస్తావించారు. కేసును విచారించిన న్యాయమూర్తి వేణుగోపాల్‌.. రవిరత్నం పిటీషన్‌కు వివరణ ఇవ్వాలని కోరుతూ నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌, నటుడు రజనీకాంత్‌, కేఎస్‌ రవికుమార్‌తోపాటు 11 మంది నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణకు కేసును రానున్న 19వ తేదీకి వాయిదా వేశారు.

  Rajani's Lingaa Run time 3 Hrs !

  చిత్రం ప్రత్యేకతలు

  దర్శకుడు మాట్లాడుతూ...''రజనీకాంత్‌ను మరోసారి మాస్‌ లుక్‌లో చూపించే ప్రయత్నమీ చిత్రం. స్వాతంత్య్రం ముందు, తర్వాత తరాలకు చెందిన రెండు పాత్రల్లో రజనీకాంత్‌ కనిపిస్తారు'' అంటున్నారు దర్శకుడు.

  నిర్మాత మాట్లాుడుతూ... ''చిత్రంలో రజనీకాంత్‌ మాస్‌ మసాలా యాక్షన్‌ నాయకుడిగా కనిపిస్తాడు. అన్ని వర్గాలవారినీ అలరించేలా దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ చిత్రాన్ని సిద్ధం చేస్తున్నారు. సినిమాలో రజనీ పాత్ర చిత్రణ సరికొత్తగా ఉంటుంది'' అన్నారు. సినిమా పాటల చిత్రీకరణ కోసం త్వరలో యూరప్‌ వెళ్లనున్నారు.

  ఈ సినిమా కథ గురించి ఇటీవల ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల మధ్య కట్టిన ముళ్ల పెరియార్‌ డ్యామ్‌ నేపథ్యంలో తీర్చిదిద్దన కథతో తెరకెక్కుతోందని కోలీవుడ్‌లో ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పెరియార్‌ డ్యామ్‌పై వివాదం నడుస్తోంది. మరి ఈ సినిమాతో రజనీ ఏం చెప్పబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. ఎ.ఆర్‌.రెహమాన్‌ స్వరాలందిస్తున్నారు.

  రజనీకాంత్ స్వయంగా ఈ చిత్రం విడుదల తేది ప్రకటించి తన అభిమానులను ఆనందంలో ముంచెత్తారు. 'లింగా' రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేశారు రజినికాంత్. ఈ సినిమా దీపావళికి విడుదల అవుతుందని వార్తలు వచ్చినా అవి నిజం కాదని చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా డిసెంబర్ 12న ‘లింగా' విడుదల అవుతుందని ప్రకటించారు.

  ఈ చిత్రంలో రజనీ దొంగగా, ఇంజినీరు గా ద్విపాత్రలలో కనపించనున్నారు. ఫ్లాష్ బ్యాక్ లో ఇంజినీరు పాత్ర వస్తుందని తెలుస్తోంది. సినిమాకు కీలకంగా ఈ చిత్రంలో ఫ్లాష్ బ్యాక్ ఉండబోతోందని తెలుస్తోంది. దొంగ పాత్రకు, బ్రిటీష్ వారి సమయంలో కనిపించే ఇంజినీరు పాత్రకు ఉన్న లింకేంటి, ఇంజినీరు గా రజనీ ఏం చేసాడు...అది ప్రస్తుత కాలానికి ఎలా ముడిపెట్టారన్నది కీలకం కానుంది.

  తన తాజా చిత్రం 'లింగా' కోసం ఓ స్త్టెలిష్‌ ఫైట్‌ను తెరకెక్కిస్తున్నారు. దీని చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగింది. ఫైట్‌ మాస్టర్‌ లీ ఆధ్వర్యంలో రజనీకాంత్‌, జగపతిబాబుపై పోరాట సన్నివేశాలను షూట్ చేసారు.

  సినిమా పాటల చిత్రీకరణ కోసం త్వరలో యూరప్‌ వెళ్లనున్నారు. చిత్రంలో అనుష్క, సోనాక్షి సిన్హా హీరోయిన్స్. జగపతిబాబు ముఖ్య పాత్రలో కనిపిస్తారు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాక్‌లైన్‌ వెంకటేష్‌ నిర్మాత. ఈ సినిమాలో నయనతార ప్రత్యేక గీతంలో నర్తించనుందని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం: ఎ.ఆర్‌.రెహమాన్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు

  English summary
  Rajnikanth, Sonakshi Sinha and Anushka's Lingaa Film's censor formalities completed and got 'U' certificate without any cuts. Run time is exactly locked as 2 hrs. 54 min.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X