రాజ్‌కుమార్‌రావు, శ్రద్దా కపూర్ కేక.. ఆకట్టుకొంటున్న స్త్రీ.. 100 కోట్లకు చేరువలో..
రాజ్‌కుమార్ రావు, శ్రద్ధాకపూర్ నటించిన స్త్రీ చిత్రం బాక్సాఫీస్ వద్ద దమ్మురేపుతున్నది. ఈ చిత్రం గత 10 రోజులుగా భారీ కలెక్షన్లను సాధిస్తూ రూ.10 కోట్లకు చేరువైంది. పదో రోజున కూడా ఈ చిత్రం 9.88 కోట్ల రూపాయలను సాధించడం విశేషం. మొత్తంగా ఈ చిత్రం రూ.82.29 కోట్ల వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను షాక్ గురిచేస్తున్నది.
అమర్ కౌశిక్ అనే తొలి చిత్ర దర్శకుడు స్త్రీ చిత్రానికి డైరెక్టర్‌గా వ్యవహరించారు. తెలుగువారైన రాజ్, డీకే ఈ సినిమాకు కథను అందించారు. నాలే బా అనే హారర్ కామెడీని స్ఫూర్తిగా తీసుకొని ఈ సినిమాను రూపొందించారు.

విలక్షణ నటుడు రాజ్‌కుమార్ రావు వికీ పాత్రలో లేడీస్ టైలర్‌గా కనిపించాడు. స్నేహితులు హెచ్చరించినా గానీ అజ్తాత వ్యక్తి శ్రద్ధాకపూర్ ప్రేమలో పడుతాడు. అలా ప్రేమలో పడిన లేడీస్ టైలర్‌కు ఎలాంటి కష్టాలు ఎదురయ్యాయనేది చిత్ర కథ.
ఈ చిత్రంతోపాటు రిలీజైన యమ్లా పగ్లా దీవానా ఫిర్ సే చిత్రాన్ని వెనక్కు నెట్టింది. రానున్న రోజుల్లో ఇదే స్పందన వ్యక్తమైతే మరిన్ని వసూళ్లను భారీగా సాధించడానికి అవకాశం ఉందనే మాట వినిపిస్తున్నది. సినిమా కంటెంట్, రాజ్‌కుమార్ రావు, శ్రద్దా యాక్టింగ్ అద్భుతంగా ఉంది అని సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తున్నాయి.


Click it and Unblock the Notifications











