»   »  'రేయ్' కి ఇప్పుడు రజనీకాంత్ సమస్య

'రేయ్' కి ఇప్పుడు రజనీకాంత్ సమస్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్‌ని హీరోగా పరిచయం చేస్తూ బొమ్మరిల్లు వారి పతాకంపై వైవీఎస్ చౌదరి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం 'రేయ్' . ఏ ముహుర్తాన ఈ చిత్రం మొదలు పెట్టారో కానీ రిలీజ్ డేట్ సైతం ఖరారు కాలేకపోతోంది. మొత్తానికి రకరకాల రిలీజ్ డేట్స్ మార్చుకున్న ఈ చిత్రం మే 9 న విడుదల చేయాలని దర్శక,నిర్మాత వైవియస్ చౌదరి నిర్ణయించారు. అయితే అదే రోజున సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రం విక్రమ్ సింహా కూడా విడుదల అవుతోంది.

విక్రమ్ సింహా పైనా మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అదే విధంగా ఆ చిత్రం కూడా భారీ ఎత్తున,ఎక్కువ థియోటర్స్ లో విడుదల చేయాలని భావిస్తున్నారు. దాంతో 'రేయ్' చిత్రం పెద్ద పోటిని ఎదుర్కోవటానికి సిద్దం అవుతున్నట్లే అంటున్నారు. వైవియస్ చౌదిరి ప్రతిష్టాత్మకంగా సంవత్సరాల తరబడి కష్టబడి రూపొందించిన ఈ చిత్రం పైనా మంచి అంచనాలే ఉన్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి వస్తున్న హీరో కావటంతో ఆ ఫ్యాన్స్ సపోర్టు లభిస్తుంది.

Rajnikanth Threat For Mega Movie 'Rey'

వైవీఎస్‌ చౌదరి మాట్లాడుతూ ''వెస్టిండీస్‌లో సెటిల్‌ అయిన ఓ కుటుంబానికి చెందిన యువకుడి కథ ఇది. అమెరికాలో జరిగే ఓ సంగీత పోటీ టైటిల్‌ పోరు నేపథ్యంలో చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఎక్కువ భాగం వెస్టిండీస్‌, అమెరికాలోనే చిత్రీకరించాం. అందుకే ఆ ప్రాంతాల్లో సినిమా ప్రత్యేక షోలు ఏర్పాటు చేస్తున్నాం. వెస్టిండీస్‌లో విడుదల కాబోయే తొలి తెలుగు సినిమా ఇది. ఈ ప్రీమియర్‌ షోల్లో చిత్రబృందమంతా పాల్గొంటుంది'' అని తెలిపారు.

ఏదైనా మేనమామ పోలికలు వస్తే అదష్టవంతులవుతారంటారు. మరి తన మేనమామలా సాయి ధరమ్ తేజ కూడా స్టార్ అవుతాడో లేదో వేచి చూడాల్సిందే... ఎవరేమన్నా మెగాస్టార్ మాత్రం తమ కుటుంబం నుంచి వెండితెరకు పరిచయమవుతున్న తమ బిడ్డల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు శిరసు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నానంటున్నారు. దేవదాసుతో సంచలన విజయం నమోదు చేసిన వైవిఎస్ చౌదరి సాయిధరమ్ తేజతో ఎటువంటి హిట్ ఇస్తారో చూడాలి. చిత్రంలో అర్పిత్‌ రాంకా, తనికెళ్ల భరణి, బ్రహ్మానందం, ఎమ్మెస్‌ నారాయణ, అలీ, నరేష్‌, జె.పి తదితరులు ఇతర పాత్రధారులు. చిత్రానికి సంగీతం: చక్రి, కూర్పు: గౌతంరాజు, ఛాయాగ్రహణం: గుణశేఖరన్‌.

English summary
YVS announced that 'Rey' will hit screens on May 9th. But here comes the mega hurdle. Superstar Rajnikanth's latest movie 'Vikramasimha' is being planned for a worldwide release on the same date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu