twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Acharya యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్ హంగామా.. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతంటే?

    |

    మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రాంచరణ్ కాంబినేషన్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఆచార్య చిత్రం విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకోవడంతో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా జరిగినట్టు తెలుస్తున్నది.

    అయితే ఈ సినిమాకు సంబంధించి మీడియాలో వెలుగు చూస్తున్న విషయాలు సినిమాపై మరింత అంచనాలు పెంచుతున్నాయి. అయితే ఏప్రిల్ 29న రిలీజ్ అవుతున్న సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్, అడ్వాన్సు బుకింగ్, ఇతర విషయాల్లోకి వెళితే..

    విజువల్ ట్రీట్‌గా అంటూ కొరటాల శివ

    విజువల్ ట్రీట్‌గా అంటూ కొరటాల శివ

    ఆచార్య చిత్రం సినీ ప్రేమికులకు విజువల్ ట్రీట్‌గా ఉంటుంది. మాస్ కథకు భారీగా కమర్షియల్ హంగులు అద్దినాం. వెండితెరపై చిరు, చరణ్‌ను కలిపి చూడటం అభిమానులకు పండుగలా ఉంటుంది అంటూ కొరటాల శివ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ అన్నారు. దీంతో మెగా ఫ్యాన్సులో ఆనందం మరింత ఉరకలేస్తున్నది.

    భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్

    భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్

    ఆచార్య సినిమాకు సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, పాటలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో బిజినెస్ వర్గాల భారీగా క్యూరియాసిటీ పెరిగింది. సైరా తర్వాత చిరంజీవి నటించిన చిత్రం కావడంతో మరింత అంచనాలు పెరిగాయి. ఇక ఇటీవల తండ్రీకొడుకుల కాంబో పాట సినిమాపై మరింత క్రేజ్‌ను పెంచింది. దాంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 133 కోట్ల మేర జరిగింది అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

    ఆచార్య నిడివి ఎంతంటే?

    ఆచార్య నిడివి ఎంతంటే?

    ఆచార్య సినిమా నిడివి కూడా సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ సినిమా నిడివి దాదాపు మూడు గంటలపాటు ఉండేదని.. అయితే చివరకు ఈ సినిమా లెంగ్త్‌ను 2 గంటల 46 నిమిషాలకు కుదించారు అనే వార్త మీడియాలో హంగామా చేస్తున్నది. దీంతో ఈ సినిమా ఫుల్ మీల్స్‌లా ఉండబోతుందనే మాట అభిమాన వర్గాల్లో వినిపిస్తున్నది.

    డల్లాస్‌లో అడ్వాన్సు బుకింగ్

    డల్లాస్‌లో అడ్వాన్సు బుకింగ్

    ఇక అమెరికాలో ఆచార్య సినిమా హడావిడి అప్పుడే పెరిగింది. ఈ సినిమా అడ్వాన్సు బుకింగ్‌ను డల్లాస్‌లో సోమవారం ప్రారంభించారు. తొలుత 10 లొకేషన్లలో 29 షోల కోసం టికెట్ల అమ్మకాలు ప్రారంభించారు. ఈ సినిమాకు అభిమానుల నుంచి మంచి రెస్సాన్స్ వస్తున్నది. ఈ సినిమా టికెట్ ధరను 21 డాలర్లుగా నిర్ణయించారు. తొలి రోజు సుమారు 500 టికెట్లు అమ్ముడు కాగా, మొత్తం 8740 డాలర్లు కలెక్షన్లు నమోదయ్యాయి.

    ప్రీమియర్ షో ఎప్పడంటే..

    ప్రీమియర్ షో ఎప్పడంటే..

    అమెరికాలోని డల్లాస్‌లో సినిమార్క్ 17 వెబ్ ఛాపెల్‌ థియేటర్‌లో ప్రీమియర్ షో కోసం టికెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఈ సినిమా ప్రీమియర్ అమెరికా కాలమానం ప్రకారం ఏప్రిల్ 28 తేదీ 3pm కి XD, RPX, EMAX, DLF, Ultra, ఇంకా మరికొన్ని స్కీన్లలో ప్రదర్శించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం నుంచి అన్ని ప్రాంతాల్లో టికెట్ల అమ్మకాలు మొదలయ్యే అవకాశం ఉంది.

    English summary
    Chiranjeevi's Acharya USA Premiere Advance Sales started in USA. As per report, Cinemark 17 Webb Chappel in Dallas has opened tickets for premieres US.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X