twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నోట్ల రద్దు ఎఫెక్ట్: ‘ధృవ’ ఫస్ట్ డే కలెక్షన్స్ పరిస్థితి ఇలా... (ఏరియా వైజ్)

    మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ మూవీ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'ధృవ' మూవీ శుక్రవారం గ్రాండ్‌గా రిలీజైంది. సినిమాపై భారీ అంచనాలు ఉన్నప్పటికీ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో రాలేదు. అందుకు కారణం నోట్ల రద్దు వ్యవహారమే అంటున్నారు విశ్లేషకులు.

    చాలా మంది చేతిలో లిక్విడ్ క్యాష్, చిల్లర లేక....ఏటీఎంలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. చేతిలో చిల్లర ఉన్న వారు వాటిని జాగ్రత్తగా ఖర్చు పెడుతున్నారు. గతంతో పోలిస్తే డిమోనిటైజేషన్ కారణంగా సినిమా చూసే వారి సంఖ్య కాస్త తగ్గింది.

    రామ్ చరణ్ నటించిన గత మూవీ 'బ్రూస్ లీ' ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.7 కోట్లు వసూలు చేయగా.... తాజాగా రిలీజైన 'ధవ' మూవీ రూ. 10.57 కోట్లు మాత్రమే వసూలు చేసింది. ధృవ మూవీ ఏరియా వైజ్ కలెక్షన్ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

    నైజాం ఏరియా కలెక్షన్

    నైజాం ఏరియా కలెక్షన్

    నైజాం ఏరియాలో ధృవ మూవీ తొలి రోజు రూ. 3.26 కోట్లు వసూలు చేసింది. ప్రస్తుతం పెద్ద సినిమాలేవీ లేక పోవడంతో ఇక్కడ ఈచిత్రాన్ని భారీగా రిలీజ్ చేసారు.

    సీడెడ్

    సీడెడ్

    సీడెడ్ ఏరియాలో ధృవ మూవీ తొలి రోజు రూ. 2.07 కోట్లు వసూలు చేసింది. ధవ చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఎన్వి ప్రసాద్ కు సీడెడ్ ఏరియాలో మంచి పట్టుంది. ఈ సిమాను అక్కడ భారీగా రిలీజ్ చేయడంలో ఎన్వి ప్రసాద్ సక్సెస్ అయ్యారు.

    వైజాగ్ ఏరియా

    వైజాగ్ ఏరియా

    వైజాగ్ ఏరియాలో కూడా ధవ మూవీ వసూళ్లు బావున్నాయి. ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 1.32 కోట్లు వసూలు చేసింది.

    గుంటూరు ఏరియాలో

    గుంటూరు ఏరియాలో

    గుంటూరు ఏరియాలో మెగా అభిమానుల సంఖ్య ఎక్కువే. ఈ సినిమా ఇక్కడ తొలి రోజు రూ. 1.08 కోట్లు వసూలు చేసింది.

    వెస్ట్ గోదావరి

    వెస్ట్ గోదావరి

    వెస్ట్ గోదావరి ఏరియాలో ధృవ మూవీ తొలి రోజు రూ. 90 లక్షలు వసూలు చేసింది. చరణ్ గత సినిమాలతో పోలిస్తే ఇది కాస్త తక్కువనే చెప్పాలి.

    ఈస్ట్ గోదావరి

    ఈస్ట్ గోదావరి

    ఈస్ట్ గోదావరి ఏరియాలో కూడా డిమోనిటైజేషన్ ప్రభావం బాగా పడింది. ఈ సినిమా ఇక్కడ తొలి రోజు రూ. 85 లక్షలు వసూలు చేసింది.

    నెల్లూరు

    నెల్లూరు

    నెల్లూరు ఏరియాలో రామ్ చరణ్ నటించిన ‘ధృవ' మూవీకి తొలి రోజు రూ. 41 లక్షలు వసూలయ్యాయి.

    కృష్ణ

    కృష్ణ

    కృష్ణా ఏరియాలో ధృవ మూవీ తొలి రోజు రూ. 68 లక్షలు వసూలు చేసింది.

    యూఎస్ఏ ప్రీమియర్

    యూఎస్ఏ ప్రీమియర్

    యూఎస్ఏ లో ప్రిమియర్ షోల ద్వారా $223000 వసూలయ్యాయి.

    రూ. 57.5 కోట్ల బిజినెస్

    రూ. 57.5 కోట్ల బిజినెస్

    ధృవ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 57.5 కోట్ల వరకు జరిగింది. సినిమాకు టాక్ బావుండటంతో త్వరలోనే మొత్తం రికవరీ అవుతుందని భావిస్తున్నారు.

    English summary
    The movie minted $223 k from premieres in the USA. Thus the film has good openings at the box office on day 1 of its release.Demonetisation effect is clearly seen Ram Charan's Dhruva movie collections because the movie was supposed to mint above 15crores easily from Ap/TS box office on the 1st day but it only minted 10.57 crores.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X